అన్వేషించండి

Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!

Nepal Earth Floods: ప్రకృతి విలయాలు నేపాల్‌కు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వరదలతో భారీగా నష్టపోయిన నేపాల్‌ను భూకంపం వణికించింది. 

Nepal Earth Floods: నేపాల్‌లో రెండు రోజుల క్రితం ధ్వంసం చేసిన వరదలు మరోసారి ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. చైనా- నేపాల్ సరిహద్దుల్లో ఏర్పడిన భూకంపం ఇప్పుడు నేపాల్‌ను వణికిస్తోంది. భూకంపం గురించి తెలుసుకున్న వెంటనే నేపాల్‌లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఏ క్షణమైనా నేపాల్‌ను మరోసారి వరదలు చుట్టుముట్టబోతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రం చైనా- నేపాల్ సరిహద్దుల్లో ఉంది. అందుకే ఈ భూకంపం ప్రభావం చైనాపై కంటే నేపాల్‌పై ఎక్కువగా ఉంటుంది. మరోసారి వరద ప్రళయం ముంచెత్తబోతోందని గ్రహించిన అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలను సురక్షితం ప్రాంతాలకు తరలించారు. 

ఇప్పటికే నేపాల్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీసుల ప్రకారం, సాయంత్రం 5గంటల సమయానికి 8 జిల్లాల నుంచి 359 మృతదేహాలను వెలికి తీశారు. నేపాల్ పోలీస్ ప్రతినిధి అబి నారాయణ్ కఫ్లే పోస్ట్ ద్వారా సవరించిన మృతుల సంఖ్యను ధృవీకరించారు. తాజా గణాంకాల ప్రకారం, రసువా నుంచి 17, నౌకోట్ నుంచి 28, ధాడింగ్ నుంచి 33, చిత్వాన్ నుంచి 132, గోర్ఖా నుంచి 30, తనాహున్ నుంచి 22, తూర్పు నవల్పరాసి నుంచి 82, పశ్చిమ నవల్పరాసి నుంచి 15 మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, ఇతర ఏజెన్సీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు చేపడుతూ, బాధితులైన కుటుంబాలను కాపాడుతున్నారు.

హిమానీనదం, పర్వతం కూలిపోవడంతో విధ్వంసం

నేపాల్, చైనాల సమీపంలో సంభవించిన వరదలకు హిమానీనదం, మంచు ముక్క కూలిపోవడం కారణమయ్యాయి. శాస్త్రవేత్తల ప్రకారం, టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరంలోని హిమానీనదంలో కొంత భాగం కూలిపోయింది. దీనితో పాటు, పర్వత శిథిలాలు కూడా లోయలో పడ్డాయి. ఇది వేగంగా ప్రవహించి విధ్వంసం సృష్టించాయి. 

ఢిల్లీ-ఖాట్మాండు బస్సు సర్వీసు నిలిపివేత 

ఆగష్టు 26న నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా, ఢిల్లీ -ఖాట్మాండు మధ్య బస్సు సర్వీసును నిలిపివేశారు. ఆగష్టు 29న జరగాల్సిన నేపాల్ బస్సు సర్వీసును కూడా రద్దు చేశారు.

నేపాల్‌కు చేరుకున్న యూనిసెఫ్ బృందం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అంచనా వేయడానికి, బాధితులకు సహాయం అందించడానికి యూనిసెఫ్ సభ్యులు నువాకోట్‌కు చేరుకున్నారు. ఒక యూనిసెఫ్ సభ్యుడు మాట్లాడుతూ, "మేము పరిస్థితిని అంచనా వేస్తున్నాం. అవును, మేము నేపాల్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం" అని అన్నారు. 

హెలికాప్టర్ల సహాయంతో నేపాల్‌లో సహాయక చర్యలు  

నేపాల్‌లో హెలికాప్టర్లను ఉపయోగించి సహాయక చర్యలను వేగంగా చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక బృంద సభ్యులను కూడా హెలికాప్టర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గండక్ నది నీటిమట్టం సాధారణ స్థితికి

నేపాల్‌లో వరదలు భయం ఉన్నప్పటికీ, నేపాల్ నుంచి బిహార్‌కు ప్రవహించే గండక్ నది దిగువ ప్రాంతంలోని గంగా నది నీటిమట్టం సాధారణంగానే ఉంది. స్థానికుల ప్రకారం, నేపాల్ నుంచి నీరు వచ్చినప్పటికీ, ఇక్కడ నీటిమట్టం స్థిరంగా ఉంది. మరింత పెరగడం లేదు. ఒక స్థానిక వ్యక్తి ఇలా అన్నారు, "నేపాల్ నుంచి వరద ప్రవాహం పెరిగింది. , కానీ ఇప్పుడు ఇక్కడ నీటిమట్టం స్థిరంగా ఉంది. నేపాల్‌లోని ప్రజలు చాలా నష్టపోయారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే తలెత్తుతుందేమోనని మేం ఆందోళన చెందాం, కానీ ప్రస్తుతానికి ఇక్కడ అలాంటి పరిస్థితి తలెత్తలేదు."

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk: అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget