అన్వేషించండి

Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు

Donation to Nepal | నేపాల్ ఆకస్మిక వరదల సహాయార్థం సద్గురు 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. 80 మంది ఈశా సభ్యుల ఆచూకీ లభించకపోవడంపై ఆవేదన చెందారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సద్గురు ఖాట్మండులో 5 దేశాల హిమాలయ బోర్డు ప్రతిపాదించారు.
  • నేపాల్ వరదలు, ప్రమాదాల నియంత్రణకు సహకారం అత్యవసరమన్నారు.
  • కోటి విరాళమిచ్చి, గల్లంతైన వారి శాంతికి కాలభైరవ కర్మ.

Sadhguru Proposes 5 Nation Himalayan Board | నేపాల్-టిబెట్ సరిహద్దులో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఖాట్మండులో నిర్వహించిన "ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్" కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే ప్రమాదకర విపత్తులను నియంత్రించేందుకు, ముందస్తు చర్యలు చేపట్టేందుకు హిమాలయ పర్వత వ్యవస్థ విస్తరించి ఉన్న దేశాల మధ్య అత్యున్నత స్థాయి సహకారం అవసరమన్నారు. 

నేపాల్‌లో ఏర్పడిన అత్యవసర పరిస్థితిలో ఆ ప్రజలను ఆదుకోవడానికి నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ఆయన ₹1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విపత్తులో వేల మంది గల్లంతు కాగా, సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులతో పాటు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ దొరకకపోవడంతో సద్గురు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రకమైన ప్రాంతీయ విపత్తులను సమర్థవంతంగా నివారించడానికి భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ దేశ భాగస్వామ్యంతో కూడిన 5 దేశాల హిమాలయ బోర్డును అత్యవసరంగా ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. పర్వతాలకు మరియు ప్రకృతి శక్తులకు మానవులు సృష్టించుకున్న రాజకీయ సరిహద్దులు, భాషలు లేదా పాలనా పద్ధతులతో సంబంధం ఉండదని ఆయన పేర్కొన్నారు. హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైనవే కాకుండా, అంతే సున్నితమైన ప్రకృతి సంపద కాబట్టి, అన్ని దేశాలు రాజకీయాలకు అతీతంగా అంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం ఈ పర్వత శ్రేణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇది కేవలం నేపాల్ సమస్య, వారి సమస్యలను వాళ్లే చూసుకుంటారని ఉపేక్షిస్తే ఈ విపత్తులకు సరైన పరిష్కారం ఎప్పటికీ లభించదని స్పష్టం చేశారు.

ఈ 3న కాలభైరవ కర్మ నిర్వహణ

విశాఖ లేదా హిమానీనదం అత్యంత ఎత్తైన మంచు శిఖరం నుండి వేల అడుగుల కిందకు పడిపోవడం అనేది ఎవరూ అంచనా వేయలేదన్నారు. సంక్లిష్ట ప్రకృతి ఇలాంటి భారీ విపత్తులను నేపాల్ వంటి చిన్న దేశం ఒక్కటే సొంతంగా ఎదుర్కోలేదని సద్గురు తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో బాధితులకు బాసటగా నిలవాలని కోరారు. ఈ ప్రమాదానికి ఎలాంటి "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి పరిణామాలను దేవుడి లీలగా అభివర్ణిస్తే, అది బాధితులు అనుభవిస్తున్న మానసిక వేదనను చిన్నచూపు చూడటమే అవుతుందని హెచ్చరించారు. ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతికి, వారి సద్గతి కోసం సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో 'కాలభైరవ కర్మ' విధానాన్ని నిర్వహిస్తున్నట్లు సద్గురు వెల్లడించారు.



Frequently Asked Questions

సద్గురు హిమాలయ ప్రాంత విపత్తుల నివారణకు ఏ ప్రతిపాదన చేశారు?

ప్రమాదకర విపత్తులను నియంత్రించడానికి భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ దేశ భాగస్వామ్యంతో కూడిన 5 దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. ఇది ప్రాంతీయ సహకారాన్ని పెంపొందిస్తుంది.

నేపాల్ విపత్తు సహాయ నిధికి సద్గురు ఎంత విరాళం ప్రకటించారు?

నేపాల్‌లో ఏర్పడిన అత్యవసర పరిస్థితిలో ఆ ప్రజలను ఆదుకోవడానికి నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి సద్గురు ₹1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

ఇటీవల సంభవించిన వరద విపత్తుపై సద్గురు ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటి?

ఈ ప్రమాదానికి

ప్రాణాలు కోల్పోయిన వారి కోసం సద్గురు నిర్వహించే కార్యక్రమం ఏమిటి?

ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతికి, సద్గతి కోసం సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో 'కాలభైరవ కర్మ' విధానాన్ని నిర్వహిస్తున్నట్లు సద్గురు వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay TVK: విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
FIR నమోదైన తర్వాత నిందితుల అరెస్టు తప్పనిసరి కాదా? చట్టాలు ఏం చెబుతున్నాయి
FIR నమోదైన తర్వాత నిందితుల అరెస్టు తప్పనిసరి కాదా? చట్టాలు ఏం చెబుతున్నాయి
Miss World 2026 Winner : మిస్ వరల్డ్ 2026 టైటిల్ గెలుచుకున్న జోహెరీ మోలా.. భారత్ నుంచి పోటీ చేసిన నికితా పోర్వాల్‌కు ఎంతవరకు అవకాశం దక్కిందంటే..
మిస్ వరల్డ్ 2026 టైటిల్ గెలుచుకున్న జోహెరీ మోలా.. భారత్ నుంచి పోటీ చేసిన నికితా పోర్వాల్‌కు ఎంతవరకు అవకాశం దక్కిందంటే..
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
Deepika Padukone Baby Bump: కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
Embed widget