అన్వేషించండి

NASA James Webb Special Stories : అసలు ఈ విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసా?

NASA James Webb Special Stories : నాసా అంతరిక్షంలోకి ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫస్ట్ ఇమేజ్స్ పంపే సమయం వచ్చేసింది. జులై 12న ఈ ఇమేజెస్ భూమికి చేరనున్నాయి.

NASA James Webb Special Stories :  జులై 12 ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే రోజు. గడచిన నాలుగు వందల ఏళ్లుగా మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఈ డెవలప్ మెంట్స్ అంతా ఓ లాంగ్ జంప్ చేయనుంది ఆ రోజుతో. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఫలితం అదే. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి వచ్చే ఫస్ట్ ఇమేజెస్ ఎందుకంత ఇంపార్టెంటో చెప్పుకునే ముందు అసలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టే వరకూ మనం సాగించిన జర్నీని ఓ సారి వెనక్కి వెళ్లి తెలుసుకుందాం. అన్నింటికంటే ముందు సైన్స్ ప్రత్యేకించి ఆస్ట్రానమీ లేదా ఖగోళశాస్త్రం ఎన్నో అద్భుతాలను తన కడుపులో దాచుకున్న సబ్జెక్ట్. మనకు తెలిసింది గోరంత కూడా ఉండదు కానీ తెలియంది చాలా ఉంది. ఆ తెలియనిది తెలుసుకోవాలనే తాపత్రయంతో మన శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ తో నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిన టీజర్ ఫొటోస్ నాసా విడుదల చేసింది. జులై 12 హై రిజల్యూషన్ ఫొటోస్ విడుదల చేయనుంది. 

విశ్వం ఎలా ఏర్పడిందంటే?  

అసలు ఈ విశ్వం ఏంటీ, ఎలా ఏర్పడిందనే ప్రశ్నలు ఇంకా వెంటాడుతున్నాయి. బాల్ చూడడానికి ఎంతో చిన్నగా ఉంటుంది. బాల్ కన్నా చిన్నగా ఉన్నా  ఏదో పదార్థం ఒక్కసారిగా పేలటం వల్ల ఈ అనంత విశ్వం ఏర్పడిందని మీకు తెలుసా? అవును ఇది నిజం. మనం చూస్తున్న ఇన్ని కోట్ల మంది మనుషులు, ఆ మొక్కలు, ఈ బిల్డింగ్స్, ఆ క్రూరమృగాలు అన్నీ ఇలాంటి ఓ చిన్న పదార్థం నుంచే వచ్చినవే. అసలు ఈ విశ్వం ఆవిర్భావం- ఏమీ ఉన్నపళంగా జరిగిపోలేదు. చాలా వందల కోట్ల సంవత్సరాల ప్రక్రియ ఇది. ఎన్నో మారుతూ వచ్చాయి. మరెన్నో యాడ్ అవుతూ వచ్చాయి. దానంతట అదే పేలిన స్పేస్ నుంచి విపరీతమైన రేడియంట్ ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీకి ఉన్న శక్తి ఎంతటిదంటే అలా ముందుకు వెళుతూనే ఉంది. ఇప్పటికీ ఇంకా ఈ రోజుకి ఈ క్షణానికి విశ్వం విస్తరిస్తూనే ఉంది తెలుసా. ఎక్స్ పాండ్ అవుతూ ఆ ఎనర్జీ ముందుకు వెళ్లిపోతూ ఉంటే వెనుక ఉండే మ్యాటర్ ఉంటుంది కదా అదంతా చల్లబడుతూ వచ్చింది. ఫలితంగా ఏర్పడిన క్వార్క్స్ అని పిలవబడే పదార్థాలు కంబైన్డ్ అయ్యి ప్రోటాన్లు, న్యూట్రాన్లుగా మారాయి. మళ్లీ ఇవి ఎలక్ట్రాన్స్ ను అట్రాక్ట్ చేయటంతో అణువు అనేది ఏర్పడింది. 

మిలియన్ల ఏళ్ల పాటు చల్లబడే ప్రక్రియ 

వందల వేల మిలియన్ల సంవత్సరాలు ఇవి చల్లబడటం అనే ప్రక్రియ తర్వాత ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ కారంణగా ఈ అణువులు ఒకదానితో ఒకటి కలుస్తూ సాలెగూడుల్లాంటివి ఏర్పడ్డాయి.  కాస్మిక్ ప్రపంచానికి మొదటి రూపం ఇదే. రెండువందల కోట్ల సంవత్సరాల తర్వాత గ్యాస్ క్లౌడ్స్, డస్ట్ కలిసి పెద్ద వాటర్ డ్రాప్ లెట్స్ లాంటివి ఏర్పడి మెల్లగా గెలాక్సీల ఏర్పాటుకు కారణమయ్యాయి. అలా ఏర్పడిన గెలాక్సీలన్నీ మ్యూచువల్ గ్రావిటీతో దగ్గరగా ఉంటూ క్లస్టర్ లా కనిపించటం మొదలైంది.  కొన్ని గెలాక్సీలు పెద్ద చక్రాల్లా ఏర్పడ్డాయి. నక్షత్రాలు, డస్ట్, గ్యాస్ ఇవన్నీ కలిసి ఆ చక్రాల్లాంటి ఆకృతిని తీసుకువచ్చాయి.  పక్కన రెండు చక్రాల్లాంటి గెలాక్సీలు మ్యూచువల్ గ్రావిటీతో వేగంగా ఢీకొట్టుకుని ఇంకా పెద్ద గెలాక్సీలుగా మారాయి.  కొత్తగా ఏర్పడిన ఆ గెలాక్సీలకు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీనే అందమైన తోకలను కూడా పెట్టింది. పదిబిలియన్ సంవత్సరాలు గడిచిన తర్వాత మనం ఇప్పుడు నివసిస్తున్న ఈ పాలపుంత ఏర్పడి ఉండొచ్చు. 

భూమి మొదటి ఓ నిప్పుకణం 

ఈ పేలే నక్షత్రాలనే సూపర్ నోవా అంటారు. మన బతకటానికి అవసరం అవుతున్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడే ప్రాణం పోసుకుంటాయి. మనం పీల్చుతున్న ఆక్సిజన్, మన మజిల్స్ లోని కార్బన్, మన రక్తంలోని ఐరన్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినవే. గ్యాస్ క్లౌడ్స్ కారణంగా మనం జీవించటానికి ఉపయోగపడుతున్న ఎలిమెంట్స్ అన్నీ మళ్లీ గ్రిప్ గ్రావిటీతో కొన్ని కోట్ల సంవత్సరాలకు దగ్గరకు చేరుకుని ఇదిగో మన సూర్యుడి లాంటి నక్షత్రాలుగా మారుతాయి. మిగిలిన స్టార్ డస్ట్ దగ్గరగా అయ్యి భూమి, శని, బుధుడు ఇలా మన గ్రహాలుగా తయారవుతాయి. ఇంతటితో అయిపోలేదు. నాలుగువందల కోట్ల సంవత్సరాలకు ముందు ఇలా ఏర్పడిన మన భూమి, చంద్రుడు తరచుగా కాస్మిక్ డస్ట్, ఆస్టరాయిడ్స్, తోకచుక్కల దాడులకు గురైంది. అలా భూమిపైన జరిగిన దాడులు అగ్నిపర్వతాలుగా దాన్ని నుంచి పైకి జిమ్మిన లావాగా మారాయి. మండటమే భూమికి తెలిసిన పని. వోల్కనిక్ గ్యాసెస్, యాసిడ్స్ రైన్స్, సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రా వైలెంట్ రేడియేషన్, మన భూమి పుట్టినప్పుడు భగభగమండే నిప్పుకణంలా ఉండేది. కానీ భూమికి జీవనానికి కావాల్సిన బేసిక్ ఇంగ్రియెడెంట్స్ ఆల్రెడీ భూమిపైకి వచ్చేసింది. అవే వాటర్, కార్బన్, అండ్ ఎనర్జీ. 

సముద్రమే మొదటి ఆవాసం 

శాస్త్రవేత్తలు భావించేది ఏంటంటే సముద్రమే మొదటి ప్రాణికి ఆవాసం. ఇలాంటి బబుల్స్ రూపంలో ఉండే బ్యాక్టీరియా సముద్రంలోనే ఉద్భవించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఇక అంతే కొన్ని మిలియన్ సంవత్సరాలకు భూమి వాతావరణం మారటం మొదలైంది. మేఘాలపైన ఆక్సిజన్ పొరలు కట్టడం ప్రారంభించింది. దీన్నే ఇవాళ మనం ఓజోన్ అంటున్నాం. సూర్యుడి నుంచి వచ్చే అతి తీక్షణమైన ఆల్ట్రా వయైలెట్ రేస్ ను ఇది ఆపుతోంది. ఫలితమే సముద్ర గర్భంలో అద్భుతమైన జీవ జాతులు పుట్టుకువచ్చాయి. రకరకాల మార్పులు, చేర్పులు, కొన్ని ఏకకణజీవులు, కొన్ని విచిత్రమైన ప్రాణులు మళ్లీ అవి కలవటం, జాతులుగా విడిపోవటం ఇలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సాగింది ఈ ప్రక్రియ. మొత్తం మారిపోయింది. ఇప్పుడు బ్యాక్టీరియా సముద్రం దాటి బయటకు వచ్చింది. మొక్కలు, క్రిమి కీటకాల రాజ్యం మొదలైంది. సరీసృపాలు, క్షీరదాలు ఇంకా మనం ఈ రోజు ఊహించటానికి కూడా వీలులేనంతటి భారీ జీవులు అన్నీ వచ్చాయి. ఎవల్యూషన్ ప్రక్రియలో భాగంగా మానవజాతి వచ్చింది. బిగ్ బ్యాంగ్ జరిగింది అనుకున్న సమయం నుంచి మానవజాతి ఏర్పడటానికి మధ్య పట్టిన కాలం సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు. మానవప్రస్థానం మొదలైన దగ్గర నుంచి మనం నిత్య అన్వేషకులమే. ఇక్కడ ఎందుకు ఉన్నాం ఏం చేస్తున్నాం. మనం పుట్టుకకు కారణం ఏంటీ...మన లాంటి ప్రాణులు బతికేందుకు ఇంకెక్కడైనా అవకాశం ఉందా. ఈ అన్ని ప్రశ్నలు వేధిస్తున్న టైం లోనే నిప్పు కనిపెట్టడం ఇదిగో ఈరోజు రాకెట్ ప్రయోగాల ద్వారా జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్ ను పైకి పంపి ఏం జరుగుతుందో చూసే వరకూ మనిషి అన్వేషణ సాగుతూనే ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget