News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Iraq: ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం, 100 మంది సజీవదహనం

Iraq Fire Accident: ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 మంది సజీవదహనమయ్యారు.

FOLLOW US: 
Share:

Iraq Fire Accident: 

ఘోర ప్రమాదం..

ఇరాక్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోగా...150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్‌లోని Nineveh ప్రావిన్స్‌లో పెళ్లి జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే...పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడి బిల్డింగ్ అంతా అంటుకున్నాయి.

ఆ బిల్డింగ్ కూడా పాతది కావడం వల్ల మంటలు అంటుకున్న వెంటనే పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ఉన్న చోట సీలింగ్ ఫ్యాన్‌ ముక్కలు ముక్కలై పడిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందగానే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. సహాయక చర్యలు మొదలు పెట్టింది. అయితే...మంటలు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం..ఈ పెళ్లి వేడుకకు వందలాది మంది హాజరయ్యారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య 100కి చేరుకుంది. మంటలు ఎగిసిపడగానే ఎటు పడితే అటు అందరూ పరుగులు పెట్టారు. తప్పించుకున్న వాళ్లు తప్పించుకున్నారు. కానీ కొందరు మాత్రం ఆ మంటలకు ఆహుతయ్యారు. ఆంబులెన్స్‌లు, మెడికల్ టీమ్స్‌ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీలైనంత వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ ( Mohammed Shia al-Sudani) వెల్లడించారు. 

Published at : 27 Sep 2023 11:50 AM (IST) Tags: Telugu News Iraq iraq fire accident Iraq Fire Nineveh Province Mohammed Shia al-Sudani

ఇవి కూడా చూడండి

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

Look Back 2023 New Parliament Building : ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా - 2023లోనే అందుబాటులోకి కొత్త పార్లమెంట్ భవనం !

Look Back 2023 New Parliament Building :  ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా  - 2023లోనే అందుబాటులోకి  కొత్త పార్లమెంట్ భవనం !

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు