New Study : ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే
New Study : మిడిల్ చిల్డ్రన్ చాలా నిజాయితీగా ఉంటారని కొత్త సర్వే చెబుతోంది. అయితే దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కెనడియన్ విశ్వవిద్యాలయాల సర్వేపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
![New Study : ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే Middle children are more agreeable and honest finds Canadian universities study New Study : ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/9ffbff2ea52f02976974e860b0fd20af1737998762806215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Study : సైకాలజీలో కొన్నేళ్ల నుంచి ఉన్న డిబేట్ మరోసారి తెరపైకి వచ్చింది. పిల్లల శక్తిసామర్థ్యాలపై పుట్టుక ప్రభావం చూపదని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి కెనడియన్ విశ్వవిద్యాలయాల చేసిన సర్వే మరోసారి ఆ విషయాన్ని చర్చినీయాంశం చేసింది. ఈ సర్వే ప్రకారం పుట్టిన పిల్లల్లో మిడిల్ చిల్ట్రన్ ఎక్కువ నిజాయతీగా ఉంటారని చెప్పడం ఈ హాట్ డిబేట్‌కు కారణమైంది.
కెనడియన్ విశ్వవిద్యాలయాల 700,000 మందిపై సర్వే చేసింది. ముగ్గురు పిల్లలు ఉన్న ఫ్యామిలీలను తీసుకొని ప్రశ్నలు అడిగింది. వారు ఇచ్చిన సమాధానాలు ఆధారంగానే ఓ నిర్ణయానికి వచ్చింది. మొదటి, ఆఖరిలో పుట్టిన పిల్లల కంటే మధ్యలో పుట్టిన పిల్లలకే సర్థుకుపోయే స్వభావం, నిజాయతీ ఉంటుందని స్నేహపూర్వక నేచర్ ఉంటుందని చెప్పుకొచ్చింది.
బ్రాక్ విశ్వవిద్యాలయం కాల్గరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు మిడిల్ చిల్డ్రన్ మానసిక పరిపక్వతపై స్టడీ చేశారు. మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్లు మైఖేల్ ఆష్టన్, కిబియోమ్ లీ నేతృత్వంలోని ఈ అధ్యయనం రెండు భాగాలుగా జరిగింది. రచయితలు రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించి కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా, యుకె అంతటా 700,000 మందిని మొదటిసారి సర్వే చేశారు.
ఆరు వ్యక్తిత్వ లక్షణాలు మెజర్ చేసేందుకు ఇందులో పాల్గొన్న వారిని పాల్గొనేవారిని పలు ప్రశ్నలు అడిగారు. అంగీకారం, తిరస్కరించడం, అనుభవాన్ని మొహమాటం లేకుండా చెప్పడం , నిజాయితీ-నమ్రత, బోలాతనం, మనస్సాక్షి, భావోద్వేగం అనే లక్షాలపై స్టడీ చేశారు. వీటిపై జనన క్రమంలో పిల్లలు ఎలా ఉంటారో అడిగి తెలుసుకున్నారు.
మధ్యన పుట్టిన పిల్లలు అంగీకారం, నిజాయితీ-వినమ్రతలో ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు. సమాజంలో రాణించేందుకు ఈ లక్షణాలు అవసరం అందుకే వీటిపై స్టడీ చేశారు. 'నిజాయితీ-వినమ్రత'లో అధిక స్కోరు చేసిన వాళ్లు జీవితంలో రూల్స్‌ను అతిక్రమించుండా ఇతరులను తప్పు చేయకుండా చూసేందుకు యత్నిస్తారని అంటారు.
మొదట పుట్టిన వాళ్లు మూడో సంతానంగా పుట్టిన వారిలో అధిక మేధో ఉత్సుకత ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తమ వయసు వారి కంటే పెద్దలతో ఎక్కువగా మాట్లాడటంతో ఇలాంటి నేచర్ వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు.. ఈ క్యాన్సర్ గురించి ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలివే
కుటుంబం పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి 77,000 మందిపై రెండో సర్వే చేశారు. కుటుంబం పెద్దదిగా ఉన్నప్పుడు మిడిల్ చిల్ట్రన్ మరింత ఎక్కువ స్కోర్ చేశారు. అంటే వారిలో నాయకత్వ లక్షణాలు మరింతగా విస్తుృతమైనట్టు గుర్తించారు పరిశోధకులు. అధ్యయనానికి కచ్చితమైన వివరణ లేనప్పటికీ తోబుట్టువులతో నిరంతరం రాజీ పడటం వల్లే ఇలాంటి లక్షణాలు అలవరుచుకొని ఉంటారని తెలుస్తోంది.
సైకాలజీలో ఈ పుట్టుక, పుట్టుక క్రమంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదో కొత్త విషయంలో వెలుగులోకి వస్తూనే ఉంటుంది. ఆష్టన్ ప్రకారం, సర్వే చాలా వివరంగా ఉందని, పాల్గొన్న వారి సమాధానాలు కూడా నిజాయితీగా ఉన్నాయని అందుకే సర్వేకు ఎక్కువ విశ్వసనీయత ఉందని అంటున్నారు.
ఈ జననం ప్రకారం లక్షణాలు అలవాటు అవుతాయనే పరిశోధనలను కొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. పుట్టిన తర్వాత పెరిగే వాతావరణం, వారు తిరిగే వ్యక్తులను బట్టి లక్షణాలు అలవడుతాయని అంటారు కాన్కార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన నినా హోవే. ఇలాంటి వ్యక్తిత్వం జీవితాంతం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. మిడిల్ చిల్ట్రన్ కాకపోయినప్పటికీ కుటుంబ నేపథ్యమే అతన్ని వివిధ మార్గాల్లోకి తీసుకెళ్తుందని అంటారు.
Also Read: పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పించాల్సిన 10 అలవాట్లు ఇవే.. ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీ పడకండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)