By: ABP Desam | Updated at : 21 Sep 2023 12:31 PM (IST)
ఏలియన్ మమ్మీస్ కడుపులో గుడ్లు, UFO ఔత్సాహికుల్లో భయం
Mexico Alien Bodies: మెక్సికన్ కాంగ్రెస్‌లో UFO ఎక్స్‌పర్ట్ జైమ్ మౌసన్ ప్రదర్శించిన రెండు నాన్ హ్యూమన్ బాడీస్‌పై గత వారం నుంచి మెక్సికన్ వైద్యులు విస్తృతమైన ప్రయోగశాలు, అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నూర్ క్లినిక్‌లో ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనిటెజ్ పరీక్షలు చేశారు. పుర్రెలు, శరీర భాగాల అసెంబ్లింగ్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆ మృతదేహాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని వైద్యులు తెలిపారు. వాటిలో ఒకటి స్త్రీ అని గర్భంలో గుడ్లు ఉన్నట్లు ఆయన వివరించారు. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో పరిశోధకులు నిర్వహించిన కార్బన్ డేటింగ్ పరీక్షల్లో సైతం ఈ నమూనాలు సుమారు 1,000 సంవత్సరాల నాటివని తేల్చారు. భూమిపై ఉన్న ఏ జాతితోనూ వాటికి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ నిపునుడు బెనిటెజ్, అతని బృందం వాటి గురించి వివరిస్తూ.. ఒకదాని పొత్తి కడుపులో పెద్ద గడ్డల రూపంలో చెక్కుచెదరకుండా ఉన్నాయని పేర్కొంది. అవి జీవసంబంధమైనవి, గర్భధారణకు సంబంధించినవి ఉండొచ్చని, బహుశా గుడ్లు అయి ఉండొచ్చని పేర్కొంది. ఇవి UFO ఔత్సాహికులలో భయం, ఉత్సాహాన్ని రేకెత్తిన్నాయి. గ్రహాంతరవాసులపై విస్తృతంగా ప్రయోగాలు చేసే UFO ఎక్స్‌పర్ట్ జెయిమ్ మౌసన్ ఈ మమ్మీలను సమర్పించారు. వీటి శరీరాలు పొట్టిగా, సుద్ద రంగులో ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి మూడు వేళ్ల చేతులు, కుంచించుకుపోయిన తలలను కలిగి ఉన్నాయి. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో పరిశోధకులు నిర్వహించిన కార్బన్ డేటింగ్ పరీక్ష ప్రకారం ఈ నమూనాలు సుమారు 1,000 సంవత్సరాల నాటివిగా తేలిందని, ఏ జాతితోనూ సంబంధం లేదని మౌసాన్ పేర్కొన్నారు.
మన భూగోళ పరిణామంలో భాగం కాదన్నారు. UFO శిధిలాల తర్వాత కనుగొనబడిన జీవులు కాదని పేర్కొన్నారు. అవి డయాటమ్ (ఆల్గే) గనులలో శిలాజాలుగా కనుగొనబడ్డాయని వివరించారు. మన ప్రపంచంలోని మరే ఇతర జాతులతో సంబంధం లేని మానవేతర నమూనాలు ఇవని, వాటిని పరిశోధించడానికి అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయని అన్నారు. అయితే జెయిమ్ మౌసన్ వాదనలను అనేక మంది UFO, ఫోరెన్సిక్స్ నిపుణులు కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారం, బూటకం అని మండిపడ్డారు. కొంతమంది విద్యావేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు ఆ శరీరాలు కేవలం మమ్మీ చేయబడిన మానవుల పురాతన అవశేషాలు అని అభిప్రాయపడ్డారు. భౌతిక శాస్త్రవేత్త, ప్రెజెంటర్ ప్రొఫెసర్ బ్రియాన్ కాక్స్ ఈ బాడీలను మానవ రూపాలు అని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర ధృవీకరణ కోసం బయోటెక్నాలజీ కంపెనీ 23 అండ్ మేకి నమూనాను పంపాలని ఆయన డిమాండ్ చేశారు. మరొక గ్రహం మీద ఉద్భవించిన ఒక తెలివైన జాతి, మానవుడిలా కనిపించడం అసంభవం అని అన్నారు.
వింత ఆకారం
జెయిమ్ మౌసన్ మాట్లాడుతూ.. ‘చూడడానికి మనుషుల్లోగానే కనిపించినా.. ఆకారం పూర్తి విభిన్నంగా ఉంది. మెడ చాలా సన్నగా, పుర్రె భాగం చాలా పెద్దగా ఉంది. పక్షుల బాడీ స్ట్రక్చర్‌కి దగ్గరగా ఉంది. పళ్లు లేవు. ఎముకలు పెద్దగా బరువుగా లేవు. మానవ పరిణామ క్రమంలో ఎక్కడా మనిషి ఇలా లేడు. UFO అధ్యయనంలో ఈ రెండూ బయటపడ్డాయి. ఓ మైన్‌లో తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చాయి. ఇవి గ్రహాంతర వాసులా కాదా అన్నది ప్రస్తుతానికి తెలియదు. కానీ అవి చాలా ఇంటిలిజెంట్ అని మాత్రం అర్థమవుతోంది. మనుషులతో పాటు చాలా రోజులు కలిసి జీవించాయి. బహుశా అప్పట్లో చరిత్రను తిరిగి రాసుంటారు’ అని అన్నారు.
Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు
100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు
Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా
India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?
Look Back 2023 New Parliament Building : ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా - 2023లోనే అందుబాటులోకి కొత్త పార్లమెంట్ భవనం !
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>