Man Lost Memories: అమెరికాలో గజినీ.. ఒక్క నిద్రలో గతం అంతా మరిచిపోయాడు

హీరోకు కొంచెం మతిమరుపు.. అప్పుడే గుర్తుంటుంది. వెంటనే మర్చిపోతాడు. ఈ లైన్ ఏదో సినిమాలో చూసినట్టు అనిపిస్తోంది కదా.. ఇంతకంటే ఘోరమైన రియల్ స్టోరీ ఉంది. ఓ వ్యక్తి నిద్రలోనుంచి లేచాక గతం అంతా మరిచిపోయాడు.

FOLLOW US: 

మరుపు అనేది సహజం.. బాధించే జ్ఞాపకాలను మరిచిపోతేనే మంచిది. మనసుకు హాయినిచ్చేవి గుర్తు పెట్టుకోవాలి. కానీ లైఫ్ లో జరిగే పెద్ద విషయాలు కూడా మర్చిపోతే ఎలా? కష్టమే.. అసలు పెళ్లాం ఎవరో... పిల్లలు ఎవరో అనేంతలా మరిచిపోతే..  చుట్టూ ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? ఓ వ్యక్తి ఇలానే.. ఒక్క నిద్రలో గతాన్ని మరిచిపోయాడు. 

అమెరికాలోని టెక్సాస్ లోని గ్రాన్ బరీలో డానియల్ అనే వ్యక్తి రాత్రి పడుకున్నాడు. ఉదయం నిద్రలేవగానే.. తాను పడుకున్న బెడ్రూం చూసి షాక్ అయ్యాడు. ఇదేంట్రా బాబు అసలు నేను ఎక్కడున్నా.. అని ఉలిక్కిపడ్డాడు. నా వయసు 16 ఏళ్లే కానీ నేను ఎందుకు ఇంత పెద్దగా ఉన్నా అనుకున్నాడు. స్కూల్ కు రెడీ అవుతూ.. ఏదేదో అరుస్తున్నాడు. ఈ సమయంలోనే ఓ మహిళ అతడి దగ్గరకు వచ్చింది. ఆమెను చూసి డేనియల్ అవాక్కయ్యాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ ఎవరో కాదు డానియల్ భార్యే. నేను నీ భార్య రుత్ ను అని చెబుతున్నా.. అసలు నా వయసేంత.. నువ్ నా భార్య ఏంటీ.. అని ఆమెపై అరిచాడు. ఈ ప్రవర్తన చూసిన ఇంట్లో వాళ్లకు నోట మాట రాలేదు. వాళ్ల పదేళ్ల కూతురు గురించి చెప్పినా.. బిత్తరపోయాడు. నేనే స్కూల్ కి వెళ్లే పిల్లాడిని నాకు కూతురేంటి అని ఎదురు ప్రశ్నించాడు. చాలా సేపు డానియల్,  రుత్ వాదించుకున్నారు. ఇక లాభం లేదని అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

డానియల్ ఉదయాన్నే అతడు నిద్రలేచాడు. నేను ఎవరో తెలియనట్లు చూశాడు. చాలా గందరగోళానికి గురయ్యాడు. మేం ఉన్న గదిని కూడా అతడు గుర్తుపట్టలేదు. బాగా తాగేసి ఆ ఇంటికి వచ్చానా.. లేక  ఎవరైనా కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించారా అని అనుకున్నాడు. నా భర్త మా గది నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత డానియల్ కు నేను తన భార్యనే అని చెప్పాను. అతడు ఇంకా చిన్నపిల్లాడే అనుకున్నాడు. అద్దంలో చూసుకుని ఆగ్రహానికి గురయ్యాడు. అతడు హియరింగ్ స్పెషలిస్ట్. అయినా తన ఉద్యోగం, చదువు అన్నీ మరిచిపోయాడు. కాబట్టి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాం.
రుత్, డానియల్ భార్య 

డానియల్ ను వైద్యులు పరీక్షించారు. అతడు ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియాతో బాధపడుతున్నట్లు చెప్పారు. దానినే షార్ట్ టెర్మ్ మెమోరిలాస్ అంటారని తెలిపారు. 24 గంటల్లో సర్దుకుంటుందని తెలిపారు. కానీ ఇప్పటికి ఏడాది అవుతుంది. అయితే.. పాత జ్ఞాపకాలు ఏమైనా.. గుర్తుకు వస్తాయేమోనని.. చిన్నప్పుడు డానియల్ తిరిగిన ప్రదేశాలన్నీ రుత్ తిప్పంది. మెమోరీ లాస్ తర్వాత.. అతడి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఇప్పుడిప్పుడే అతడికి అన్నీ నెమ్మదిగా గుర్తొస్తున్నాయట. భర్తకు గతం ఎప్పటికైనా గుర్తొస్తోందని ఆశగా ఎదురుచూస్తోంది రుత్.

Tags: Memory loss Texas Person 20 Years Memory Loss In Texas

సంబంధిత కథనాలు

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Ukraine Winner : యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?

Ukraine Winner :  యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?

Salary In Gold : ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది !

Salary In Gold : ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది  !

Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!

Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

AP PCC New Chief Kiran :   వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా