Hospital Bills : 2 రోజుల ఆస్పత్రి బిల్లు రూ. 52 లక్షలు ! కడుపు మండిపోదా మరి , కానీ అందరిలాగా సైలెంట్‌గా లేడు
ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అమెరికాలోని ఆ యువకుడికి కొత్తగా తెలిసింది. కానీ అతను మనలా సైలెంట్‌గాలేడు.. చేయాల్సింది చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏం చేశాడంటే ?
ఒక్క సారి ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లి వచ్చిన ఎవరికైనా ఓ బాధ మనసులో ఉండిపోతుంది. అదేమిటంటే బిల్లు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ము రెండు,మూడు రోజుల్లో ఆస్పత్రికి ధారబోశామేనన్నదే ఆ బాధ. అలాంటి సొమ్ము ఏదీ లేని వాళ్లు అప్పుల పాలయ్యామనే బాధ ఉంటుంది. ఇది ఇండియాలోనే కాదు అన్ని చోట్లా ఉంది. అలా ఆస్పత్రి బారిన పడిన ఓ అమెరికా యువకుడు రెండు రోజుల్లో రూ. 52 లక్షల బిల్లు సమర్పించుకున్నాడు. ఇది ఆయనను తీవ్రంగా కలచి వేసింది. వెంటనే.. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. చేసేశాడు. ఏం చేశాడంటే.. ఎక్స్‌రే మిషన్ తయారు చేశారు. ఎందుకంటే ఆయనకు ఆస్పత్రి వేసిన రూ. 52 లక్షల బిల్లులో అత్యధికంగా ఈ ఎక్స్‌రేలదే.
విల్ ఓస్మాన్ అనే అమెరికా యువకుడు యూట్యూబ్ వీడియోలు చేస్తూంటాడు. ఇంజనీర్‌గా కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల చిన్న అనారోగ్య సమస్య రావడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నాడు. మూడో రోజు డిశ్చార్జ్ అయ్యాడు. అతని చేతిలో ఆస్పత్రి సిబ్బంది 69వేల డాలర్ల బిల్లు పెట్టారు. అంటే మన రూపాయల్లో రూ. యాభై రెండు లక్షలు. అదృష్టవశాత్తూ అతనికి ఇన్సూరెన్స్ ఉంది. దీంతో చాలా వరకూ కవర్ చేసుకోలిగాడు. రెండున్నర వేల డాలర్లు మాత్రమే సొంతంగా చెల్లించాడు.అయితే అతని మనసులో ఆ ఆస్పత్రి బిల్లు బాగా ముద్ర పడిపోయింది. దేనికి దేనికి చార్జ్ చేశారో చూశాడు.
ఎక్స్‌రేల కోసమే ఎక్కువ బిల్లు వేశారని తెలుసుకున్నాడు. వెంటనే అందుబాటులో ఉన్న పరికరాలతో ఎక్స్ రే మిషనర్ తయారు చేయాలని డిసైడయ్యాడు. అనుకున్నట్లుగానే కొన్ని పరికరాలు కొనుగోలు చేశాడు. ఎక్స్ రే మిషన్‌ను తయారు చేశాడు. మొత్తంగా రెండున్నర వేలల్లో తయారైపోయింది. ఈ వీడియోను తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ప్రైవేటు ఆస్పత్రుల బాధితులు ప్రపంచం అంతా ఉన్నారు మరి.
నిజంగానే ఓస్మాన్ చేసిన ఎక్స్ రే పర్‌ఫెక్ట్‌గా రిజస్ట్ ఇస్తోంది. కానీ ఇది వైద్య పరమైన ప్రమాణాలను అందుకోవడం కష్టమని చెబుతున్నారు. అయితే తన వీడియోతో.. వైద్య ఖర్చులు ఎంత దారుణంగా ప్రజల్ని ఇ్బబంది పెడుతున్నాయన్న విషయాన్ని ఉస్మాన్ మరోసారి ప్రపంచం ముందుకు తీసుకు రాగలిగాడు. ఇండియాలో కూడా ఇలా ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులను భరించేలని మధ్యతరగతి ప్రజల వెతలు ఎన్నో మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి.