Male Contraceptive Pills: మగవారి కోసం ఆ మాత్రలు వచ్చేస్తున్నాయి... ఇక మహిళల ఆరోగ్యం భద్రం...
ఇష్టం లేని గర్భాలు కారణంగా మహిళల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇది కూడా ఓ విధంగా అసమాతగానే చెప్పాలి. అందుకే అలాంటి అసమానత పోగొట్టేందుకు స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.
అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెసీ... చాలా మంది జంటలకు ఇదో సమస్య. దీనికి నివారణకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ అవన్నీ మహిళలపైనే ప్రభావం చూపుతున్నాయి. మగవారికి మాత్రం కండోమ్ తప్ప వేరే పరికరాలు లేకుండా పోయాయి.
ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. ఇన్నాళ్లు మహిళల పిల్స్ మాత్రమే మార్కెట్లో దొరికేవి. ఇకపై మగవారు వేసుకునే పిల్స్ తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. దీనిపై ప్రయోగాలు తీవ్రంగా జరుగుతున్నాయి.
కండోమ్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా మగవారి కోసం ఎలాంటి గర్భనిరోధకాలు రాలేదు. చాలా మంది వీటిని పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఈ కారణంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఏటా కొన్ని లక్షల మంది అనుకోకుండానే గర్భం దాలుస్తున్నారు. తర్వాత అబార్షన్లకు వెళ్లి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. ఏడాదిలో రెండుమూడు సార్లు అబార్షన్లు కూడా అవుతున్నాయి.
ఈ అసమానత పోగొట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. పురుషుడి కోసం స్కాట్లాండ్లోని దుండీ విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు పిల్స్ రెడీ చేసే పనిలో పడ్డారు.
దుండీ యూనివర్శిటీ ప్రయోగాలకు బిల్‌గేట్స్ సంస్థ హెల్ప్ చేస్తోంది. వచ్చే రెండేళ్లలో కావాల్సిన నిధులు ఇచ్చేందుకు సిద్ధమైంది. సుమారు పదిహేడు లక్షల డాలర్లు అందించేందుకు సముఖత వ్యక్తం చేసింది.
మగవారి కోసం ఇలాంటి కుటుంబ నియంత్రణ పిల్స్ తయారీలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే ఇన్నాళ్లు దీనిపై పెద్దగా పురోగతి సాధించలేదన్నది వారి వాదన. పురుషుడి వీర్య కణ బయాలజీపై అవగాహన లేకపోవడం ఓ కారణమైతే... ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వీర్యకణం ఏం చేస్తుందన్నదానిపై కూడా నమ్మకమైన పరిశోధనలు జరగలేదు.
అందుబాటులో ఉన్న మందులో ప్రభావాన్ని స్క్రీన్ చేసే వ్యవస్థ లేకపోవడం కూడా ఈ పరిశోధనలు ముందుకు సాగలేదు.
ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు దుండీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సమాంతర టెస్టింగ్ సిస్టాన్ని డెవలప్ చేశారు. అందులో ఉండే వేగవంతమైన మైక్రోస్కోప్, ఇమేజ్ప్రోసెసింగ్ టూల్స్... వీర్యకణాల కదలికలను పసిగడతాయి.
అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల ఎక్కువ మహిళలే ఇబ్బంది పడుతున్నారని... ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.. ఈ అసమానత్వాన్ని పోగట్టేందుకు మగవారి కోసం పిల్స్‌పై పరిశోధన చేస్తున్నట్టు చెబుతున్నారు డుండీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.
రెండేళ్లలో ఈ పిల్స్‌పై కచ్చితమైన ఫలితాలు సాధిస్తామంటున్నారు. మగవారు వాడుకునే మాత్రలు రెడీ అయితే కచ్చితంగా కొత్త శకం మొదలైనట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు.
ASLO READ: కాలుష్యం ఇంత పనిచేస్తుందా? వామ్మో మతి పోగొట్టేసిందిగా..
‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?