News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Elon Musk on Twitter: మస్క్ ఫాలోవర్లలో ఎక్కువ మంది నకిలీలే, తేల్చిన రిపోర్టు

Elon Musk on Twitter: ట్విట్టర్ లో ఎలన్ మస్క్ కు ఉన్న ఫాలోవర్లలో ఎక్కువ మంది నకిలీలేనని ఓ రిపోర్టు తేల్చింది.

FOLLOW US: 
Share:

Elon Musk on Twitter: టెక్ బిలియనీర్, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ పై తాజాగా వెలువడిన రిపోర్టు ఒకటి షాకింగ్ కు గురి చేస్తోంది. తన ఆలోచనలు, నిర్ణయాలు, చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలతో షాక్ లు ఇచ్చే ఎలన్ మస్క్ కు తాజాగా ఓ రిపోర్టు షాక్ ఇచ్చింది. ట్విట్టర్ లో ఎలన్ మస్క్ కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు ఖాతాలు నకిలీవని, అందులో కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని ఆ రిపోర్టు నివేదించింది. Mashable నివేదిక ప్రకారం మస్క్ కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ లో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్ల కంటే ఎక్కువ ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. థర్డ్ పార్టీ రీసెర్చర్ ట్రావిస్ బ్రౌన్ సేకరించిన డేటాను ఈ నివేదిక ప్రస్తావించింది. 

ఎలన్ మస్క్ ను ఫాలో అవుతున్న ట్విట్టర్ ఖాతాల్లో 100 మిలియన్లకు పైగా అకౌంట్లలో ఒక్కో ఖాతాలో కనీసం 10 ట్వీట్లు కూడా లేవని ఆ నివేదిక పేర్కొంది. ఈ మేరకు డేటాను ఆ రిపోర్టు ప్రచురించింది. 

Also Read: Surgical Strike: పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్! మీడియాలో కథనాలు - భారత ఆర్మీ ఏం చెప్పిందంటే?

ట్విట్టర్‌లో (ఎక్స్) ‘బ్లాక్’ ఫీచర్‌ను తొలగించాలని మస్క్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కానీ పర్సనల్ మెసేజ్ చేయకుండా మాత్రం వారిని నిలువరించవచ్చు. ‘డీఎం (డైరెక్ట్ మెసేజ్)’ విషయంలో మాత్రం బ్లాక్ ఆప్షన్ అలాగే ఉండనుంది. కానీ టైమ్ లైన్, ప్రొఫైల్ విజిట్, మీరు చేసే పోస్టుల నుంచి మాత్రం యూజర్లను బ్లాక్ చేయలేరు. నిజానికి బ్లాక్ అనేది సోషల్ మీడియాలో ప్రైవసీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. మనకు నచ్చని వారిని మన ప్రొఫైల్ చూడకుండా బ్లాక్ ఫీచర్ ఉపయోగపడుతుంది. కానీ దీని కారణంగా ఈ ఆప్షన్ కూడా దూరం కానుంది.

ఎక్స్‌లో కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు జరపడాన్ని కూడా ఇటీవలే ప్రారంభించారు. ఇందుకోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ అనే ప్రోగ్రామ్‌ను కంపెనీ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ స్వయంగా ట్వీట్ చేసింది. ఎక్స్‌లో నేరుగా డబ్బు సంపాదించడంలో కంటెంట్ క్రియేటర్లకు సహాయపడే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఎంతో మంది క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయన్సర్లకు నగదు లభించింది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎక్స్‌లో అర్హులైన క్రియేటర్‌లందరికీ (ఎక్స్ క్రియేటర్స్) యాప్‌లో, ఈ మెయిల్ ద్వారా మొదటి చెల్లింపుగా ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పటికే తెలియజేశారు. కొంతమంది ఎక్స్ క్రియేటర్స్ ఇప్పటికే దీన్ని వారి ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఇది కాకుండా వారి ఖాతాలలో నగదు ఎప్పటిలోపు జమ అవుతుందో కూడా కంపెనీ తెలిపింది. మానిటైజేషన్ ద్వారా నగదు పొందాలంటే ఎక్స్‌లో మొదటగా బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పొంది ఉండాలి. దీనికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గత మూడు నెలల్లో మీ పోస్టులపై ఐదు మిలియన్ల ఇంప్రెషన్లు సాధించాలి. గతంలో ఇది 15 మిలియన్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం దీన్ని తగ్గించారు. దీంతో పాటు క్రియేటర్ మానిటైజేషన్ స్టాండర్డ్స్ కోసం జరిపే హ్యూమన్ రివ్యూలో పాస్ అయి ఉండాలి.

Published at : 22 Aug 2023 05:59 PM (IST) Tags: Elon Musk TWITTER Followers Xpro Are Fake

ఇవి కూడా చూడండి

London bridge: కిందకు దిగని ఫేమస్ లండన్‌ బ్రిడ్జ్‌, దాంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

London bridge: కిందకు దిగని ఫేమస్ లండన్‌ బ్రిడ్జ్‌, దాంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Viral Video: లైవ్‌ డిబేట్‌లో కొట్టుకున్న పాకిస్థాన్‌ నేతలు

Viral Video: లైవ్‌ డిబేట్‌లో  కొట్టుకున్న పాకిస్థాన్‌ నేతలు

Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్‌ రామస్వామి

Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్‌ రామస్వామి

భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!

భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?