హెల్మెట్ ధరించాలన్న రూల్‌కు వ్యతిరేకంగా పోరాడిన లాయర్ అదే హెల్మెట్ లేక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు
రాన్ స్మిత్ 66 ఏళ్ల న్యాయవాది... ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. మోటారుసైకిల్ నడిపేవారు హెల్మెట్ ధరించాలనే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్వేగభరితంగా పోరాడారు ఈ ఫ్లోరిడా న్యాయవాది.
ద్విచక్రవాహనదారులు హెల్మట్ ధరించాలని ప్రభుత్వం చట్టాలు చేస్తోంది. అలా హెల్మెట్ ధరించని వారు వాహనం నడుపుతూ చిక్కితే జరిమానా విధిస్తుంది. అయితే హెల్మెట్ ధరించాలన్న ప్రభుత్వ రూల్స్‌కు వ్యతిరేకంగా పోరాడే ఓ లాయర్ యాక్సిడెంట్‌లో మృతి చెందారు. అది కూడా హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడుపుతూ ప్రమాదానికి గురై మరణించారు.
రాన్ స్మిత్ 66 ఏళ్ల న్యాయవాది... ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. మోటారుసైకిల్ నడిపేవారు హెల్మెట్ ధరించాలనే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్వేగభరితంగా పోరాడారు ఈ ఫ్లోరిడా న్యాయవాది. ఆగస్టులో మృతి చెందిన ఓ బైకర్ స్మారక సేవ కోసం వెళ్తుండగా రాన్ స్మిత్ ప్రమాదానికి గురయ్యారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రమాదానికి గురయ్యారు. అదే బైక్‌పై ఆయనతోపాటు వెళ్తున్న 62 ఏళ్ల స్నేహితురాలు బ్రెండా జీనాన్ వోల్ప్ కూడా మరణించారు.
రాన్‌స్మిత్, బ్రెండా జీనాన్ వోల్ప్ ఇద్దరిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు. స్మిత్—ఎగైనెస్ట్ టోటాలిటేరియన్ ఎన్‌యాక్ట్‌మెంట్స్‌కు వ్యతిరేకంగా పోరాడే బ్రదర్‌హుడ్ సభ్యుడు. ఫ్లోరిడా మోటార్‌సైకిల్ నిబంధనలను ఉల్లంఘించిన క్లయింట్‌లకు అనుకూలంగా వాదించేవనారు. "ప్రతి ఒక్కరికీ వారి స్వంత ఎంపిక ఉండాలని ఆయన భావించారు," అని స్మిత్ స్నేహితుడు డేవ్ న్యూమాన్ తెలిపారు.