అన్వేషించండి

Kim Jong Un: కిమ్ మరో దారుణం: 30 మంది అధికారుల‌కు ఉరి 

North Korea| వ‌ర‌ద‌ల కార‌ణంగా సంభ‌వించిన ప్రాణ న‌ష్టం, ఆస్థి న‌ష్టం నివారించ‌డంలో అధికారులు విఫ‌ల‌మ‌య్యార‌నే కార‌ణంతో అధికారుల‌ను ఉరితీయాల‌ని ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు. 

30 North Korean officials sentenced to death తీవ్రమైన క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కిమ్‌ను మించిన నాయ‌కుడు లేడు. కిమ్ నియంత చ‌ర్య‌లు నిత్యం ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తుంటాయి. ఒక్కోసారి ఆయ‌న చ‌ర్య‌లు ప్ర‌పంచాన్నే వ‌ణికిస్తుంటాయి. తాజాగా ఉత్త‌ర‌ కొరియాలో 30 మంది అధికారుల‌కు ఉరి శిక్ష విధించాల‌ని ఆ దేశాధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశించారు. ఈ దారుణ నిర్ణ‌యం ప్ర‌పంచాన్ని విస్మ‌యానికి గురిచేసింది. 

ఇటీవ‌ల ఉత్త‌ర‌ కొరియాలో తీవ్ర‌మైన వ‌ర్షాల‌తోపాటు వ‌ర‌ద‌లు ఆదేశాన్ని ముంచెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల్లో దాదాపు 4 వేల మంది వ‌ర‌కు దేశ పౌరులు చ‌నిపోయారు. దాదాపు మ‌రో 5 వేల మంది వ‌ర‌కు నిరాశ్ర‌యుల‌య్యారు. వ‌ర‌ద‌ల నివార‌ణ‌లో అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంలో అధికారులు విఫ‌లమ‌య్యార‌ని ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ కి అనిపించింది. కొండ చ‌రియ‌లు విరిగిపడి భారీగా దేశ పౌరులు మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లు కిమ్‌ను క‌ద‌లించాయి. త‌క్ష‌ణ నివార‌ణ చ‌ర్య‌లకు పూనుకున్నాడు. ఈ వర‌ద ప్ర‌భావాన్ని అడ్డుకోవ‌డంలో అధికారుల వైఖ‌రి కార‌ణ‌మ‌ని, వారు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ఘోరం జ‌రిగింద‌ని కిమ్ గ్ర‌హించారు. దీంతో ఈ దారుణ దుర్ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన 30 మంది అధికారుల‌కు ఉరి శిక్ష విధించాల‌ని కిమ్ ఆదేశించిన‌ట్టు ఉత్త‌ర‌ కొరియా మీడియా పేర్కొంది.

ఇటీవ‌ల వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో కిమ్ స్వ‌యంగా ప‌ర్య‌టించారు. భారీగా జ‌రిగిన‌ ప్రాణ‌న‌ష్టం ఆయ‌న్ను క‌ల‌వ‌ర‌పాటుకు గురించేసింది. మొద‌ట వెయ్యి మంది మ‌ర‌ణించి ఉంటార‌ని భావించినా త‌న ప‌ర్య‌ట‌న‌లో మాత్రం అస‌లు వాస్త‌వాలు వెలుగుచూశాయి. భారీ జ‌రిగిన ప్రాణ న‌ష్టం త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించింద‌ని కిమ్ భావించారు. అందుకు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆ దేశ సైనికులు ప‌ర్య‌టించి స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. బాధితుల‌ను ఆదుకుంటున్నారు. భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిపడ‌టంతోపాటు వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. వారిని పున‌రావాస శిబిరాల‌కు త‌ర‌లిస్తున్నారు. 
అయితే వాస్త‌వ స్థితికి రావ‌డానికి క‌నీసం మ‌రో 3 నెల‌లైనా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ఆ దేశ మీడియా వెల్ల‌డించింది. 15వేల మందికి పైగా వృద్ధులు,విక‌లాంగులు, చిన్నారుల‌ను సైనికులు ర‌క్షించి పున‌రావాస శిబిరాలు, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియాలోని పలు రాష్ట్రాల్లో కిమ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget