Viral Video : లైవ్‌లో చెంప పగలగొట్టిన రిపోర్టర్ - ఆ తర్వాతేమయిందంటే ?
లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న రిపోర్టర్.. ఎదురుగా ఉన్న వ్యక్తి చెంప పగలగొట్టింది. ఇప్పుడా ఇన్సిడెంట్ నేషనల్ టాపిక్ అయింది. అయితే ఇది జరిగింది ఇండియాలో కాదు !
Viral Video : ఆ రిపోర్టర్ లైవ్‌లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతలోనే హఠాత్తుగా ఆమె చేయి పైకి లేచింది. ఎదురుగా ఉన్న వ్యక్తి చెంప పగలగొట్టింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాకయ్యారు. ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. ఆమె చెప్పలేదు. తర్వాత తన రిపోర్టింగ్ తాను చేసుకుని వెళ్లిపోయింది. కానీ ఆ వీడియో మాత్రం వైరల్ అయింది.
A Pakistani reporter 😂😂😜🤣
— Monibhagat (@Paribhagat12345) July 12, 2022
Maira Hashmi(@MairaHashmi7) slaps a boy while reporting in Lahore, #Pakistan.#PrimeDay pic.twitter.com/nWc9EMsg84
అయితే ఆమె ఇండియా రిపోర్టర్ కాదు. పాకిస్తాన్ కు చెందిన మీడియా రిపోర్టర్. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఆమె విధులు నిర్వహిస్తోంది. అయితే ఆమె తీరుపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమయింది. అనవసరంగా ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
A Femele journalist #slapped a young man while reporting on Eid-ul-Adha in #Pakistan. This woman #journalist has been identified as #MairaHashmi.#CBnews #Chandrakant_cb #TrendingNews #CBTrendingNews #Viral #Trending #LatestNews #TodayNews #FemeleReporter #FemaleJournalist pic.twitter.com/qUD9hpEoX0
— Chandra Kant Baghel 26.5k (@Chandrakant_cb1) July 12, 2022
అయితే తాను తప్పేం చేయలేదని ఆ రిపోర్టర్ ఉర్దూలో వివరణ ఇచ్చింది. తాను రిపోర్ట్ చేస్తున్న కుటుంబాన్ని ఆ వ్యక్తి అదే పనిగా హరాస్ చేస్తున్నాని... తాను ఎంత చెప్పిన వినలేదని... అందుకే కొట్టానని తెలిపింది. అలాంటి వ్యక్తిని వదిలేద్దామా అని ప్రశ్నించింది కూడా.
یہ لڑکا انٹرویو کے دوران فیملی کو تنگ کر رہا تھا _جسکی وجہ سے فیملی پریشان ہوگئی تھی__میں نے پہلے پیار سے سمجھایا کے ایسا نہیں کرو مگر سمجھانے کے باوجود یہ لڑکا نہیں سمجھا اور زیادہ ہُلّڑ بازی کررہا تھا_ جس کے بعد مجھے زیب نہیں دیا کہ اسے اور موقع دیکر برداشت کیا جائے ؟ pic.twitter.com/4jmuSsInYg
— Maira Hashmi (@MairaHashmi7) July 11, 2022
మొత్తానికి ఆమె పేరు మైరా హష్మి. న్యూస్ యాంకరింగ్‌కు గ్లామర్ అద్దడంలో ఆమె ప్రత్యేకత . అందుకే ఆమె గురించి ప్లస్ అయినా.. మైనస్ అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోనే కాదు.. ఇండియాలో కూడా.