అన్వేషించండి

Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌, భారత సంతతి వ్యక్తి కమలా హ్యారిస్‌ లక్కీ ఛాన్స్

US Presidential Election Race | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం, దేశ ప్రయోజనాల కోసం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

Joe Biden Drops out of US Presidential Election Race | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ ప్రకటించి తన మద్దతుదారులకు షాకిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ కోసం, దేశ ప్రయోజనాల కోసం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం వరకు, జనవరి 2025 వరకు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల బైడెన్ కరోనా బారిన పడటం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో US అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా చేసే అవకాశం రావడం తన అదృష్టం అన్నారు.

భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌కు లక్కీ ఛాన్స్

జో బైడెన్ ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవడంతో భారత సంతతి మహిళకు గొప్ప అవకాశం లభించింది. బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా రేసులోకి కమలా హ్యారిస్ వచ్చారు. కమలా హ్యారిస్‌కు బైడెన్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కమలా హ్యారిస్ ను వైస్ ప్రెసిడెంట్‌ అభ్యర్థిక ఎంపిక చేయడం తాను తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఒకటని పేర్కొన్నారు. ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో డిబేట్‌లో పాల్గొన్న జో బైడెన్ మాట్లాడిన తీరును చూసి తోటి డెమోక్రాట్స్ ఆయనను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని కోరారు. కొందరు నేతలు నేరుగానే బైడెన్ అభ్యర్థిత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని ఓ ప్రకటన విడుదల చేశారు.

Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌, భారత సంతతి వ్యక్తి కమలా హ్యారిస్‌ లక్కీ ఛాన్స్

ఈసారి కమలా హ్యారిస్‌ను ప్రెసిడెంట్‌గా గెలిపిద్దాం.. జో బైడెన్
‘తోటి డెమోక్రాట్‌ మిత్రులారా, నామినేషన్‌పై నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. నా పదవీకాలం ముగిసేవరకు పూర్తిస్థాయిలో అధ్యక్షుడిగా కొనసాగుతాను. 2020లో పార్టీ  నుంచి కమలా హారిస్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం. ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉండేందుకు నా పూర్తి మద్దతు  తెలుపుతున్నాను. కమలా హ్యారిస్‌కు అధ్యక్ష అభ్యర్థిగా ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఈ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు డెమొక్రాట్లు అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. చేసి చూపిద్దామని’ కీలక ప్రకటన అనంతరం జో బైడెన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Telangana: మినీ మాల్దీవులు లక్నవరం - మూడో ద్వీపం కూడా రెడీ - చూసొద్దామా ?
మినీ మాల్దీవులు లక్నవరం - మూడో ద్వీపం కూడా రెడీ - చూసొద్దామా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget