JD Vance: డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన..! అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమన్న జేడీ వాన్స్
Donald Trump Health condition | ఏదైనా జరగరాని ఘటన సంభవిస్తే, అనుకోని పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు.

JD Vance About Trump Health | వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన చేసి ట్విస్ట్ ఇచ్చాడు. అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
జేడీ వాన్స్ గురువారం నాడు USA టుడేతో మాట్లాడుతూ, అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన కథనాలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. కానీ అందులో వాస్తవం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం బాగుంది. ఆయన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు. అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారని చాలా నమ్మకం ఉందని" వాన్స్ అన్నారు.
🚨 బ్రేకింగ్: జెడి వాన్స్ తాను అధ్యక్షుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు, అయితే అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం పూర్తిగా బాగుంది మరియు అమెరికన్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
— ఎరిక్ డాగర్టీ (@EricLDaugh) ఆగస్టు 28, 2025
3.5 సంవత్సరాలలో 48...
"గత 200 రోజులుగా నేను చాలా మంచి శిక్షణ పొందాను. కానీ అధ్యక్షుడు చాలా అద్భుతంగా ఉన్నారు... pic.twitter.com/hpyWS8gnuZ
ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు
గత వేసవిలో అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంగా లేరని పుకార్లు వచ్చాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియుంగ్‌తో సమావేశంలో ట్రంప్ చేతికి గాయాన్ని అంతా గమనించారు. మీడియాలో వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా చర్చకు దారితీసింది, ఇది పెద్ద ఆరోగ్య సమస్య అయి ఉంటుందా అని కొందరు సందేహాలు లేవనెత్తారు. వైట్ హౌస్ వెంటనే ఆ రూమర్లను తోసిపుచ్చింది. ట్రంప్ తరచుగా చేతులు కలపడం, ప్రతిరోజూ ఆస్పిరిన్ వాడటం వల్ల గాయం ఏర్పడిందని వివరించారు. జూలైలోనూ బహిరంగంగా కనిపించినప్పుడు ట్రంప్ గాయాన్ని కప్పి ఉంచారు.
అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం
ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారని జేడీ వాన్స్ తెలిపారు. పూర్తి పదవీకాలం అధ్యక్షుడిగా కొనసాగడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని, అందులో ఏ అనుమానం అవసరం లేదన్నారు. అయినప్పటికీ, ఏదైనా జరిగితే, అత్యవసర పరిస్థిత్తులో అందుకు సిద్ధంగా ఉండటం ముఖ్యమని వాన్స్ అంగీకరించారు.
"దేవుడి దయతో ప్రస్తుతం అంతా బాగుంది. కానీ ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తితే మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకూ అధ్యక్ష పదవి గురించి ఆలోచించలేదు. పదవిలోకి వచ్చినప్పటి నంుచి అత్యున్నత స్థాయిలో పరిపాలనపై ఫోకస్ చేశానని’ జేడీ వాన్స్ పేర్కొన్నారు.
ఆందోళనలను తగ్గించిన వైట్ హౌస్
ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఏమన్నారంటే.. ట్రంప్ అమెరికన్లకు చేరువ కావడానికి అలసిపోకుండా పని చేస్తారని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. "అధ్యక్షుడు ట్రంప్ ప్రజల మనిషి. ఇతర అధ్యక్షుల కంటే ఎక్కువ మంది అమెరికన్లను ట్రంప్ కలుసుకుంటారు. నిత్యం ఎంతో మందికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆయన నిబద్ధత ఎప్పటికీ తగ్గదని ప్రతిరోజూ నిరూపిస్తారు" అని శుక్రవారం ఒక ప్రకటనలో లెవిట్ పేర్కొన్నారు.
ట్రంప్ హెల్త్ కండీషన్‌పై డాక్టర్ నిర్ధారణ
అధ్యక్షుడు ట్రంప్ కు వైద్య సేవలు అందించే డాక్టర్ సీన్ బార్బబెల్లా మాట్లాడుతూ.. ట్రంప్ దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నారని ధృవీకరించారు, ఇది కాళ్ళలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని, కానీ ఇది పెద్దవారిలో సాధారణం అని తెలిపారు. ట్రంప్ కాళ్లు కాచిన సమయంలో జులైలో ఆయన ఆరోగ్యంపై కథనాలు వచ్చాయి. అధ్యక్షుడికిగా కొనసాగడానికి ట్రంప్ ఎలాంటి కఠిన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవడం లేదని స్పష్టం చేశారు.






















