ఇజ్రాయేల్ చేసిన ఖర్చంతా బూడిద పాలేనా? యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది?
Israel Palestine Attack: పవర్‌ఫుల్ ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది?
Israel Palestine Attack:
50 ఏళ్ల క్రితం భీకర దాడులు..
ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య యుద్ధం (Israel Palestine War) రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. నిజానికి ఈ రెండు ప్రాంతాలు ఇప్పుడే కాదు. ఎన్నో దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం 1973లో అక్టోబర్ 6వ తేదీన జరిగిన దాడి ఇజ్రాయేల్‌ని వణికించింది. ఆ తరవాత ఇప్పుడు జరిగిన హమాస్ దాడులతో మరోసారి ఉలిక్కిపడింది. ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌గా భావించే ఇజ్రాయేల్ ఇంటిలిజెన్స్ Mossad కూడా ఫెయిల్ అవడం సంచలనమైంది. అంతే కాదు. యాంటీ మిజైల్ సిస్టమ్ కూడా విఫలమైంది. ఇజ్రాయేల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 'Iron Dome' సిస్టమ్ చాలా శక్తిమంతమైందని ప్రపంచవ్యాప్తంగా పేరుంది. 90% అక్యురసీతో పని చేసే ఈ సిస్టమ్...ఇటీవల జరిగిన హమాస్ దాడులను మాత్రం అడ్డుకోలేకపోయింది. వేరే దేశాలకూ యాంటీ డ్రోన్ సిస్టమ్ (Israel Anti Drone System) ఉన్నప్పటికీ ఇజ్రాయేల్ సిస్టమ్ మాత్రం చాలా పకడ్బందీగా ఉంటుంది. అలాంటి వ్యవస్థ కూడా పని చేయకపోవడమే అనుమానాలకు తావిచ్చింది. ఇజ్రాయేల్‌కి ప్రొటెక్టివ్ షీల్డ్‌గా పని చేసే Iron Dome కోసం ఆ దేశం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2.5 మైళ్ల నుంచి 45 మైళ్ల వరకూ శత్రు రాకెట్‌లను గుర్తించి నేల మట్టం చేస్తుంది ఈ సిస్టమ్. 2021లో Institute for National Security Studies ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఇజ్రాయేల్‌కి ఉన్న రక్షణ వ్యవస్థ విలువ లక్షల డాలర్లు. రాకెట్‌లను గుర్తించి అడ్డుకునే Interceptors ని సమకూర్చుకుంది. ఒక్కో ఇంటర్‌సెప్టర్ ధర 50 వేల డాలర్లు. అంటే..హమాస్ ప్రయోగించిన 5 వేల రాకెట్‌లను నేల కూల్చాలంటే ఇజ్రాయేల్‌కి రూ. 2,079 కోట్లు ఖర్చు అయ్యేది.
ఇజ్రాయేల్ ఇంటర్‌సెప్టర్స్..
హమాస్ ప్రయోగించిన ఒక్కో రాకెట్ విలువ 300-800 డాలర్లు మాత్రమే. హమాస్ ఉగ్రవాదులు సొంతగా రాకెట్‌లు తయారు చేసుకునేందుకు 25-90 వేల డాలర్లు ఖర్చు పెడుతోంది. హమాస్ వద్ద ఉన్న టెక్నాలజీ పరంగా చూస్తే..నిముషానికి 140 రాకెట్‌లను ప్రయోగించే కెపాసిటీ ఉంది. ఇజ్రాయేల్‌కి చెందిన ఐరన్ డోమ్ చాలా భిన్నంగా పని చేస్తుంది. ముందుగా శత్రు క్షిపణులను గుర్తిస్తుంది. ఆ తరవాత ఆయుధాలపై కంట్రోల్ సాధిస్తుంది. ఆ తరవాత లక్ష్యానికి గురి పెడుతుంది. శత్రు రాకెట్ ఇజ్రాయేల్ వైపు దూసుకొస్తోంది అంటే...వెంటనే Iron Dome radar system యాక్టివ్ అయిపోతుంది. కంట్రోల్ సిస్టమ్ నుంచి కమాండ్ అలెర్ట్ వస్తుంది. అప్పుడు శత్రు మిజైల్‌పై రాకెట్‌ని ప్రయోగిస్తుంది. దీన్నే Interceptor అంటారు.
ఎందుకు ఫెయిల్ అయింది..?
ఇంత అక్యూరసీ ఉన్న ఐరన్ డోమ్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయిందనేదే అసలు ప్రశ్న. ఓ 100 మిజైల్స్ ఇజ్రాయేల్ వైపు దూసుకొస్తే కనీసం 90 మిజైల్స్‌ని నేలమట్టం చేస్తుంది ఈ సిస్టమ్. ఈ సారి ఫెయిల్ అవడానికి కారణం...హమాస్ ఉగ్రవాదులు అత్యంత వేగంగా ఊహించని విధంగా వేలాది రాకెట్‌లను ప్రయోగించడమే. ఇన్ని రాకెట్స్‌ని ఒకేసారి అడ్డుకోవడం Iron Dome వల్ల కాలేదు. కెపాసిటీకి మించి రాకెట్‌లు దూసుకురావడం వల్ల ఏమీ చేయలేకపోయింది. ఇజ్రాయేల్ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉన్నా..హమాస్ ఉగ్రవాదులు ఇలాంటి లూప్‌హోల్స్‌ని ఆసరాగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈసారీ అదే చేశారు.
Also Read: 24 గంటల్లో ఊరు ఖాళీ చేయండి, గాజా పౌరులకు ఇజ్రాయేల్ ఆదేశాలు - ఐక్యరాజ్య సమితి అసహనం