Gaza: AI టూల్స్‌తో హమాస్‌పై ఇజ్రాయేల్ యుద్ధం, టార్గెట్ ఫిక్స్ చేస్తే క్షణాల్లో విధ్వంసం
Israel Gaza Attack: హమాస్‌ని అంతం చేసేందుకు ఇజ్రాయేల్ AI టూల్స్‌తో యుద్ధం చేస్తోంది.
Israel Gaza War:
మళ్లీ మొదలైన వార్..
Gaza News Updates: ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఆరు రోజుల యుద్ధ (Israel-Hamas War) విరామం ముగిసింది. ఇరు వర్గాలూ బందీలను విడతల వారీగా విడుదల చేశాయి. ఈ డీల్ ముగిసిన వెంటనే మళ్లీ యుద్ధం మొదలైంది. గాజాపై దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయేల్. అటు హమాస్ కూడా ఇజ్రాయేల్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకూ 14 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా. అయితే...ఈ యుద్ధాన్ని కొద్ది రోజులు కొనసాగించి ఆపేయాలని భావించడం లేదు ఇజ్రాయేల్. ఈ సారి ఎలాగైనా పూర్తిగా హమాస్‌ని అంతం చేయాలన్న పట్టుదలతో ఉంది. అందుకే కేవలం ఆయుధాలనే కాకుండా టెక్నాలజీతోనూ దెబ్బ కొట్టాలని చూస్తోంది. Bloomberg Report వెల్లడించిన వివరాల ప్రకారం...హమాస్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయేల్ Artificial Intelligence టూల్స్‌ని వినియోగిస్తోంది. Gospel Alchemist, Depth of Wisdom పేరిట రెండు స్పెషల్ AI సిస్టమ్‌లు తయారు చేసింది. గైడెడ్ కమాండ్స్‌తో వీటిని డిజైన్ చేసింది. ఓ టార్గెట్‌ని లాక్ చేసి ధ్వంసం చేయడం వీటి ప్రత్యేకత. హమాస్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు వీటిని విపరీతంగా వినియోగిస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. ఇప్పుడే కాదు. రెండేళ్ల క్రితమే ఇజ్రాయేల్ AI Warకి తెర తీసింది. 2021లో తొలిసారి Operation Guardians of the Wall ఆపరేషన్‌ని లాంఛ్ చేసింది. గాజాలోని పాలస్తీనా మద్దతుదారులపై దాడులు చేసింది. దాదాపు 11 రోజుల పాటు భీకర యుద్ధం కొనసాగించింది. టార్గెట్స్‌ని ధ్వంసం చేసేందుకు AI టూల్స్ సహకారం తీసుకుంది.
దాడులు ఇలా..
గాస్పెల్ లాంటి సిస్టమ్స్ ద్వారా ఆటోమేటెడ్ టూల్స్‌తో టార్గెట్స్‌ని ధ్వంసం (Israel Defence AI Tools) చేయడం అప్పటి నుంచే మొదలైంది. తమ అవసరాలకు అనుగుణంగా ఈ హై క్వాలిటీ ఇంటిలిజెన్స్ సిస్టమ్స్‌ని రూపొందించుకుంది ఇజ్రాయేల్. అంతే కాదు. AIపై రీసెర్చ్ చేస్తున్న వాళ్లకి ఈ సిస్టమ్స్ రిఫరెన్స్‌లుగా నిలిచాయి. ఇదీ ఇజ్రాయేల్ డిఫెన్స్‌కి (Israel Defence Forces) ఉన్న పవర్. 2021లో జరిగిన యుద్ధంలో ఈ సిస్టమ్స్ విజువల్ ఇంటిలిజెన్స్, సిగ్నల్ ఇంటిలిజెన్స్ నుంచి డేటా సేకరించాయి. ఆ డేటా అంతా సిస్టమ్‌లో నిక్షిప్తమైంది. శాటిలైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు చేసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ AI టూల్స్ (Israel War AI Tools) ద్వారా 12 వేల టార్గెట్‌లను ధ్వంసం చేసింది. అంటే రోజుకి కనీసం 444 టార్గెట్స్‌ని హిట్ చేసింది. ఇజ్రాయేల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీస్, మ్యాట్రిక్స్ డిఫెన్స్ మధ్య ఇప్పటికే ఓ ఒప్పందం కుదిరింది. ఆటోమేటెడ్ టార్గెట్ డిటెక్షన్ సిస్టమ్ (Automated Target Detection System) ని తయారు చేసేందుకు డీల్ కుదిరింది. ప్రస్తుతం ఇజ్రాయేల్‌కి అందుబాటులో ఉన్న AI టూల్స్‌తో కనీసం 30-40 వేల టార్గెట్స్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ తయారు చేయడంలో వందలాది మంది సైనికులు, అధికారులు కీలక పాత్ర పోషించారు.
Also Read: World Aids Day: HIV కి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?