అన్వేషించండి

హమాస్‌కి దిమ్మతిరిగిపోయే ప్లాన్, స్పెషల్ యూనిట్‌తో ఇజ్రాయేల్ అటాక్

Israel Gaza Attack: హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేసేందుకు ఇజ్రాయేల్ స్పెషల్ యూనిట్ ఏర్పాటు చేసింది.

 Israel Gaza Attack: 


స్పెషల్ యూనిట్‌తో దాడులు..

ఇజ్రాయేల్‌కి చెందిన ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్‌ Shin Bet సంస్థ హమాస్ ఉగ్రవాదుల్ని ఏరేసేందుకు కొత్త యూనిట్‌ని ఏర్పాటు చేసింది. "Nili" పేరుతో ఈ మిషన్‌ని ప్రారంభించనుంది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై దాడులు చేసిన ప్రతి ఒక్క హమాస్ ఉగ్రవాదిని మట్టుబెట్టడమే ఈ మిషన్ లక్ష్యం. హమాస్ మిలిటరీ వింగ్‌లోని Nukhba కమాండో సభ్యుల్నే టార్గెట్ చేసింది. ఇజ్రాయేల్‌పై రాకెట్ల వర్షం కురిపించి ఈ ఉగ్రవాదులే. ఇదే విషయాన్ని  The Jerusalem Post రిపోర్ట్ వెల్లడించింది. ఈ నీలీ యూనిట్‌ సభ్యులు మరెవరితోనూ సంబంధం లేకుండా మూకుమ్మడిగా ఉగ్రవాదులపై దాడులు చేస్తుంది. ముఖ్యంగా హైర్యాంకింగ్ టెర్రరిస్ట్‌లను మట్టుబెడుతుంది. ఇందుకోసం ఇంటిలిజెన్స్ సిబ్బందితో పాటు ఫీల్ట్‌లో యుద్ధానికి దిగే వాళ్లను ఎంపిక చేసుకుంది షిన్‌ బెట్ సంస్థ. అక్టోబర్ 14న Israeli Defence Forces (IDF) నుక్బా యూనిట్‌కి చెందిన కమాండర్ అలీ క్వాదిని మట్టుబెట్టాయి. ఆ తరవాత మరో కమాండర్‌నీ మట్టుబెట్టింది. అక్టోబర్ 17న హమాస్‌కి చెందిన సెంట్రల్ గాజా బ్రిగేడ్‌ హెడ్‌ అయ్‌మన్ నోఫల్‌పై దాడి చేసింది. ఇలా వరుస పెట్టి హమాస్ కమాండర్‌లను ఏరేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. హమాస్ లీడర్‌ ఉంటున్న ఓ బిల్డింగ్‌పై సైన్యం దాడి చేయగా..అందులోని 14 మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దాడుల్ని ఉద్ధృతం చేసింది. ఇప్పుడు స్పెషల్ యూనిట్ ఏర్పాటు చేసి మరింత వేగంగా ఉగ్రవాదుల్ని ఏరేయాలని ప్లాన్ చేసుకుంది ఇజ్రాయేల్. 

అక్టోబర్ 7 నుంచి దాడులు..

ప్రధాని నెతన్యాహు హమాస్‌పై చాలా సీరియస్‌గా ఉన్నారు. వీలైనంత వేగంగా హమాస్‌ని అంతం చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. 
అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ 1,400 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధం ప్రకటించారు. గాజాపై రాకెట్‌ల వర్షం కురిపించారు. ఇజ్రాయేల్, పాలస్తీనా రెండు వైపులా కలిపి దాదాపు 5 వేల మంది మృతి చెందారు. గాజాలో హమాస్ ఉగ్రవాదుల్ని ఏరేసేంత వరకూ తమ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయేల్ స్పష్టం చేసింది. 

భారత్ సాయం..

యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాకి సాయం చేసేందుకు భారత్‌ ముందుకొచ్చింది. భారీ ఎత్తున వైద్య సాయం అందించింది. అక్కడి ప్రజలకు అవసరమైన వాటిని ప్రత్యేక ఫ్లైట్‌లో పంపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. లైఫ్‌ సేవింగ్ మెడిసిన్స్‌తో పాటు సర్జికల్ ఐటమ్స్, టెంట్స్‌ పంపుతోంది. యూపీలోని ఘజియాబాద్‌లో Hindon Air Base నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన  C-17  ఫ్లైట్‌లో వీటిని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 6.5 టన్నుల మెడికల ఎయిడ్, 32 టన్నుల డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపింది. ఈజిప్ట్‌లోని El-Arish Airportకి ఈ ఫ్లైట్‌ చేరుకోనుంది. గాజాకు ఏ సాయం అందాలన్నా అది ఈజిప్ట్‌ మీదుగా వెళ్లాల్సిందే. అందుకే ఈజిప్ట్‌తో సంప్రదింపులు జరిపింది భారత్. గాజాకు సాయం అందించేందుకు అనుమతినిచ్చింది. 

Also Read: నాలుగేళ్ల కూతుర్ని కత్తితో పొడిచి చంపిన తల్లి, కొడుకుపైనా హత్యాయత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Delhi Crime: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
Embed widget