ఇజ్రాయేల్‌పై దాడి చేసేందుకు సూసైడ్ బాంబర్స్ కావలెను, ఇరాన్‌లో పోస్టర్లు
Israel Gaza Attack: ఇజ్రాయేల్‌పై దాడి చేసేందుకు సూసైడ్ బాంబర్స్ కావాలంటూ ఇరాన్‌లో పోస్టర్లు అంటించారు.
Israel Palestine Attack:
ఇరాన్‌లో పోస్టర్లు..
ఇజ్రాయేల్, హమాస్ యుద్దం (Israel Hamas War) ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఇజ్రాయేల్‌కి అమెరికా పెద్ద ఎత్తున మద్దతునిస్తోంది. హమాస్‌ని అంతం చేసేంత వరకూ ఊరుకునేదే లేదని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) శపథం చేశారు. అయితే...పాలస్తీనాపై యుద్ధం చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. తక్షణమే ఈ దాడుల్ని ఆపేయాలని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కి చెందిన ఓ సంస్థ సూసైడ్ బాంబర్స్ కావలెను అని చాలా చోట్ల పోస్టర్లు అంటించింది. ప్రస్తుతం ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లపై చర్చ జరుగుతోంది. హిజ్బుల్లా (Hezbollah) ఈ ప్రకటన చేసింది. లెబనాన్‌లో చాలా యాక్టివ్‌గా పని చేస్తోంది ఈ సంస్థ. Daily Express వెల్లడించిన వివరాల ప్రకారం...ఇరాన్‌లోని మషాద్ (Mashhad) సిటీలో చాలా చోట్ల గోడలపై ఈ పోస్టర్లు పెట్టారు. అంతే కాదు. మామూలు ఉద్యోగాలకు ఎలా అయితే వ్యక్తిగత వివరాలు అడుగుతారో...అలానే పర్సనల్ డిటైల్స్ ఇవ్వాలంటూ ఆ పోస్టర్లపై మెన్షన్ చేశారు. స్పెషల్ బెటాలియన్‌లో చేరే అవకాశం కావాలంటే ఈ ఉద్యోగంలో చేరాలంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. పాలస్తీనా కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లే అర్హులు అంటూ తేల్చి చెప్పారు.
మసీదుపై పట్టు కోసం యుద్ధం..
మరో కీలక విషయం ఏంటంటే...సూసైడ్ బాంబర్స్‌గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్లకు రెండు ఆప్షన్స్ ఇచ్చింది హిజ్బుల్లా సంస్థ. దాడులు చేసేందుకు బైక్, కార్...ఈ రెండింట్లో ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తామని చెబుతోంది. కొన్ని చోట్ల జెండాలనూ ఎగరేశారు. అందులో జెరూసలేంలోని Al-Aqsa మసీదుకి వెళ్తున్నట్టుగా పెయింట్ చేశారు. ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య Al-Aqsa Mosque విషయంలో ఎన్నో ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ మసీదు కారణంగానే అరబ్ దేశాలకు, ఇజ్రాయేల్‌కి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇస్లాంలో ఈ మసీదుని అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఈ మసీదుని చేజిక్కించుకునేందుకు హమాస్‌తో పాటు ఇస్లామిక్ జిహాద్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ రెండు సంస్థలు సున్నీ గ్రూప్‌కి చెందినవే. ఈ గ్రూప్‌లకు ఇరాన్ భారీగా మద్దతునిస్తోంది. ఆయుధాలు సరఫరా చేస్తోంది.