ఈజిప్ట్‌లో ఇజ్రాయేల్ టూరిస్ట్‌లపై పోలీస్ కాల్పులు, ఇద్దరు మృతి
Israel Gaza Attack: ఈజిప్ట్‌లో ఇజ్రాయేల్ టూరిస్ట్ గ్రూప్‌పై ఓ పోలీస్ కాల్పులు జరపగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Israel Gaza Attack:
టూరిస్ట్‌లపై కాల్పులు..
ఈజిప్ట్‌లో ఇజ్రాయేల్ టూరిస్ట్ గ్రూప్‌పై పోలీస్ ఆఫీసర్‌లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు టూరిస్ట్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఈజిప్టియన్ కూడా మృతి చెందాడు. అలెగ్జాండ్రా సిటీలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయేల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్న తరుణంలో ఈ కాల్పులు జరగడం సంచలనమైంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం...పోలీసుల కాల్పుల్లో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దాడి చేసిన పోలీసులను అరెస్ట్ చేశాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు ఆంబులెన్స్‌లు అక్కడి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించాయి. ఎన్నో దశాబ్దాల క్రితం ఇజ్రాయేల్‌తో ఈజిప్ట్ శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయేల్ పాలస్తీనా వివాదం పరిష్కరించడానికి చాలా సార్లు మధ్యవర్తిత్వం కూడా వహించింది. కానీ ఆ ప్రయత్నాలేవీ వర్కౌట్ అవ్వలేదు. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ...ఈజిప్ట్‌లో ఇప్పటికీ ఇజ్రాయేల్ వ్యతిరేక వర్గాలు చాలానే ఉన్నాయి. ఆ దేశం నుంచి ఎవరు వచ్చినా వాళ్లను శత్రువులుగానే చూస్తుంటారు. ఇప్పుడు ఈజిప్ట్ పోలీసులు టార్గెట్ చేసి మరీ ఇజ్రాయేల్ టూరిస్ట్‌లపై కాల్పులు జరపడానికి కారణం కూడా ఇదే. ఇజ్రాయేల్‌లో హింసాత్మక వాతావరణం నెలకొనడానే అదనుగా చూసుకుని ఈజిప్ట్‌లో ఇలాంటి దాడులు ఇంకా పెరిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే...ఇలాంటివేవీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
An Egyptian policeman opened fire on Israeli tourists in the Mediterranean city of Alexandria, killing at least two Israelis and one Egyptian in support for Palestine
— RISHI🇮🇳 (@ViratxSalman) October 8, 2023
Stand With Israel#Israel॥#Gaza॥#Israel_under_attack ॥ #Palestine॥#Gaza॥#GazaUnderAttack॥#hamasattack pic.twitter.com/sFVRBg7Aoz
హమాస్ ఉగ్రవాదుల దాడులతో ఇజ్రాయేల్ పౌరులు (Israel Palestine War) అల్లాడిపోతున్నారు. మహిళల్ని, చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తున్నారు. దారుణంగా హింసిస్తున్నారు. చిన్నారులనూ దారుణంగా చంపేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ 25 ఏళ్ల యువతి కిడ్నాప్‌కి గురైన వీడియో వైరల్ అవుతోంది. ఓ రేవ్ పార్టీలో ఉన్న నోవా అర్గమని (Noa Argamani) హమాస్ ఉగ్రవాదులు వచ్చి కిడ్నాప్ చేశారు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పార్టీలో ఉన్న వాళ్లపై రాకెట్ దాడులు కూడా చేశారు. ఆ తరవాత ఆ యువతిని కిడ్నాప్ చేశారు. బైక్‌పై బలవంతంగా కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఆ సమయంలో యువతి గట్టిగా అరిచింది. దయచేసి చంపొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఓ టెర్రరిస్ట్ (Hamas Attack) ఇదంతా వీడియో తీసి పోస్ట్ చేశాడు. పక్కనే ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉన్నప్పటికీ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఉగ్రవాదులు చుట్టుముట్టడం వల్ల ఏమీ చేయలేకపోయాడు.
Also Read: అమెరికా చేసిన ఆ పనితో పగబట్టిన పాలస్తీనా, ఇజ్రాయేల్‌లో హమాస్ దాడులు అందుకేనట!