అన్వేషించండి

Iran War 2026: 'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్

Iran War 2026: ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ప్రస్తుతం నాల్గో వారంలోకి ప్రవేశిస్తోంది. పర్షియన్ గల్ఫ్‌్ ప్రాంతం నుంచి మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధంగా మారాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఖర్గ్ ద్వీపం, చమురు ఎగుమతులపై అమెరికా లక్ష్యంగా ఇరాన్ ప్రతిఘటిస్తోంది.

Iran War 2026: మధ్య ప్రాచ్యంలో మూడు వారాలుగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ తీవ్రంగా తిరస్కరించింది. యుద్ధం ఎప్పుడు ముగించాలో ట్రంప్ నిర్ణయించలేరని స్పష్టం చేసింది. శాంతి చర్చలకు ఇరాన్ ప్రభుత్వం కఠినమైన షరతులను విధించింది. అమెరికా ప్రతిపాదించిన పీస్‌ టైమ్‌లైన్‌ను తోసిపుచ్చిన ఇరాన్, తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పోరాటం కొనసాగుతుందని హెచ్చరించింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే దిశగా అడుగులు వేస్తున్నాయని, తమ సైనిక లక్ష్యాలు దాదాపు నెరవేరాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనను ఇరాన్ అధినాయకత్వం సవాలు చేసింది. తాము అమెరికా నిర్దేశించిన గడువులకు కట్టుబడి లేమని, యుద్ధ విరమణ అనేది ఇరాన్ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని టెహ్రాన్‌ స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఖర్గ్‌ ద్వీపంపై పట్టు, ఆంక్షల్లో ఇరాన్ తన పంథాను మార్చుకోలేదు. 

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ప్రస్తుతం నాల్గో వారంలోకి ప్రవేశిస్తోంది. పర్షియన్ గల్ఫ్‌్ ప్రాంతం నుంచి మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధంగా మారాయి. మార్చి 25 నాటికి అందిన సమాచారం ప్రకారం ఇరాన్ తన విదేశాంగా విధానంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని, ట్రంప్ ప్రిపాదించిన శాంతి ఒప్పందాన్ని అది ఒక ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణించింది. 

ఈ ప్రతిష్టంభనకు ప్రధాన కారణం ఆధిపత్య పోరు. ట్రంప్‌ తన వ్యూహంలో భాగంగా ఇరాన్ క్షిపణ వ్యవస్థలను, అణు సామర్థ్యాన్ని దెబ్బతీశామని పేర్కొనగా, ఇరాన్ మాత్రం తమ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని వాదిస్తోంది. ఇరాన్ తనపై ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలు తక్షణమే ఎత్తివేయాలని వాదిస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు వంటి ఖర్గ్ ద్వీపం నుంచి అమెరికా తన పట్టును వదులుకోవాలని డిమాండ్ చేస్తోంది. తమ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యాన్ని సహించబోమని, శాంతి కాలక్రమాన్ని తానే స్వయంగా నిర్ణయిస్తామని ఇరాన్ నొక్కి చెప్పింది. 

ఇరాన్ మొండి వైఖరి ప్రపంచ దేశాలను అందోళనకు గురి చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటిేక 140 మిలియన్ బారెళ్ల ఇరాన్ చమురును మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ఆంక్షలను సడలించినప్పటికీ, ఇరాన్ సహకరించకపోతే ఈ ప్రక్రియ క్లిష్టతరంగా మారుతోంది. ఇరాన్ తిరస్కరణతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు మళ్లీ స్థిరత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక వైపు శాంతి అంటున్న ట్రంప్, మరోవైపు అదనపు మెరైన్లను పంపుతుండటం, దీనికి ప్రతిగా ఇరాన్ తన డ్యాన్సింగ్‌ మిస్సైల్స్ సిద్ధం చేయడం యుద్ధం సుదీర్గంగా కొనసాగే సూచనలు ఇస్తోంది. 

ఈ సంక్షోభం వెనుక ఉన్న లోతైన కారణాలను పరిశీలిస్తే ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే ప్రక్రియగా కనిపిస్తోంది. మధ్య ప్రాచ్యం నుంచి సరఫరా అయ్యే ప్రపంచ చమురు 20 శాతం హుర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇరాన్ దీనిని అడ్డుకోవడంతో భారత్, చైనా, ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నాయి. ఈజిప్ట్ బ్రెడ్‌ ధరలపై నియంత్రణ విధించడం, చైనా ఎరువుల నిల్వలను విడుదల చేయడం వంటివి  యుద్ధం సృష్టించిన ఆర్థిక ప్రకంపనలకు నిదర్శనం. 

ఇరాన్ తన 90 శాతం చమురు ఎగుమతలను ఖర్గ్ ద్వీప నుంచే చేస్తుంది. దీనిని అమెరికా లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఇరాన్ రివల్యూషన్ గార్డ్స్‌ ఆదాయం పడిపోయింది. అందుకే ఇరాన్ ఇప్పుడు ఈ ద్వీపం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని నిర్ణయించుకుంది. ఈ యుద్ధంలో రష్యా తన చమురు ఆదాయాన్ని పెంచుకుంటూ లాభపడుతుండగా, చైనా తన ఇంధన భద్రత కోసం ఆందోళన చెందుతోంది. భారత్ మాత్రం ఇటు అమెరికాతోను, ఇటు ఇరాన్‌తోనూ దౌత్యపరమైన సంబంధాలను సమతుల్యం చేసుకుంటూ, తన ఇంధన అవసరాల కోసం రష్యా, ఇతర దేశాలవైపు చూస్తోంది. 

ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ఇరాన్ అణు ఒప్పందం నుంచి తప్పుకున్నట్టే. ఇప్పుడు సైనిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను లొంగదీసుోకవాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేమీ నాయకత్వంలో ఆ దేశం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. 

యుద్ధం ప్రారంభించడం సులభమే కానీ దానిని ముగించడం ఇరు పక్షాల అంగీకారం లేకుండా అసాధ్యమనే నానుడిని ఇరాన్ ప్రస్తుత వైఖరి నిజం చేస్తోంది. ట్రంప్ తన లక్ష్యాలను చేరుకున్నాని చెబుతున్నప్పటికీ, ఇరాన్ విధించిన షరతులు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన అంత సులభం కాదని, స్పష్టం చేస్తున్నాయి. 

Frequently Asked Questions

ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఇరాన్ సహకరించకపోతే మార్కెట్‌లోకి చమురు విడుదల క్లిష్టమవుతుంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు స్థిరత్వం కోల్పోయే ప్రమాదం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget