అన్వేషించండి

Oman News: ఒమన్ చమురు నౌక ప్రమాదంలో కీలక అప్‌డేట్- 8 మంది భారతీయ సిబ్బందిని కాపాడిన ఇండియన్ నేవీ

Indian Navy: ఒమన్ సముద్రతీరంలో చమురు ఓడ మునిగిపోయి 13 మంది గల్లంతు అయిన సంగతి తెలిసిందే.. వీరిలో 8మంది భారతీయ సిబ్బందిని ఇండియన్ నేవీ కాపాడింది. మరో ఆరుగురి కోసం గాలిస్తోంది.

Indian Navy Rescue Operation: ఒమన్ (Oman)తీరంలో సముద్రంలో గల్లంతైన చమురు ఓడ నుంచి 8 మంది భారతీయులు సహా ఒక శ్రీలంకకు(Sri Lanka) చెందిన సిబ్బందిన భారత నౌకాదళం (Indian Navy) సురక్షితంగా కాపాడింది. మొత్తం 16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 8 మంది భారతీయులు ఉండగా... ముగ్గురు శ్రీలంకకు చెందిన సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరు మృతిచెందగా...మిగిలిన వారి కోసం నౌకాదళం వెతుకులాట కొనసాగిస్తోంది.

ఒమన్ తీరంలో నౌక మునక
ఒమన్ సముద్రం తీరంలో ముడిచమురు తీసుకెళ్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్ బోల్తాపడింది. కోమోరోస్‌కు చెందిన ఎంటీఫాల్కన్ ప్రిస్టీజ్‌ ఓడ దుబాయి (Dubai)లోని హమరియా పోర్టు నుంచి యమెన్‌లోని పోర్టుకు చమురు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈనెల 14 రాత్రి ఒమన్‌(Oman) తీరంలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో మొత్తం 16మంది సిబ్బంది ఉండగా...అందులో 13 మంది గల్లంతయ్యారు. వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 

గల్లంతైన సమాచారం అందుకున్న భారత నౌకాదళం రెస్క్కూ టీం... అక్కడికి వెళ్లి ఒమన్ సిబ్బందితో కలిసి సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించారు. గల్లంతయ్యే వారిలో 8 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకకు చెందిన వారిని రక్షించారు. వీరితోపాటు ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఓడ ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రతికూలంగా ఉన్నట్లు  రక్షణదళం సిబ్బంది చెప్పారు. గాలులు బలంగా వీస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. ఒమన్‌ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నట్లు మస్కట్‌లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ఒమన్‌ రక్షణదళానికి భారత నావికాదళం సహాయ చర్యలు అందిస్తోందన్నారు. మునిగిపోయిన ఓడలోని వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వివరించింది.

సవాళ్లతో ప్రయాణం
సముద్ర ప్రయాణం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా వచ్చే తుపాన్లు, భీకరగాలులతో పెద్దపెద్ద ఓడలే తలకిందులవుతాయి. ఉన్నట్టుండి సముద్రం ఆటుపోట్లుకు గురవుతుంది. ఓడల్లో పనిచేసే సిబ్బంది వీటన్నింటినీ తట్టుకుని నిలబడతారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసేలా వారికి కఠినమైన శిక్షణ ఉంటుంది. ఒకవేళ అనుకోని ప్రమాదం ఎదురైతే ఏవిధంగా బతికి బయటపడాలో కూడా వారికి నేర్పిస్తారు. కానీ ఒమన్‌ తీరంలో ప్రమాదానికి గురైన ఓడ ఒక్కసారిగా తిరగబడిపోవడంతో అందులో చిక్కుకున్న వారు బయటకు రాలేకపోయారు. ఎంతో కష్టపడి బయటపడిన వారు తీర రక్షణ దళానికి సమాచారం ఇవ్వడంతో వారు భారత నావికాదళంతో కలిసి సముద్రంలో చిక్కుకున్నవారిని కాపాడారు.

ఆరుగురి జాడ ఇంకా తెలియలేదు. వారిని కూడా ప్రాణాలతో రక్షిస్తామని రక్షణదళం చెబుతోంది. భారతీయ సిబ్బంది రక్షణ కోసం ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. సిబ్బంది మొత్తాన్ని రక్షించే వరకు ఒమన్ రక్షణదళ అధికారులకు సూచనలు ఇచ్చింది. ఈ ఆపరేషన్‌లో భారత సిబ్బందిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూటీంకు అభినందనలు తెలిపింది. సిబ్బంది చూపిన సాహసాన్ని మెచ్చుకుంది. మిగిలిన సిబ్బంది భారతీయులు కాకున్నా మానవతా దృక్పథంతో ఇండియన్ నేవీ సహాయ చర్యలు కొనసాగిస్తోంది.

Also Read: జో బైడెన్‌కి కొవిడ్‌ పాజిటివ్, వెంటనే ఐసోలేషన్‌లోకి - ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకుంటారా?

Also Read: ఒక కాకిని కట్టేస్తే వందల కాకుల ధర్నా- నడిరోడ్డుపై వ్యక్తిని నరుకుతుంటే వీడియో తీసిన జనం- ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి?

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget