అన్వేషించండి

Joe Biden: జో బైడెన్‌కి కొవిడ్‌ పాజిటివ్, వెంటనే ఐసోలేషన్‌లోకి - ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకుంటారా?

Joe Biden: అమెరికా ప్రెసిడెంట్ జో బైెడెన్‌కి కరోనా సోకింది. లాస్‌వెగాస్‌లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. టెస్ట్ చేయగా కొవిడ్ సోకినట్టు తేలింది.

Joe Biden Tests Covid Positive: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి కరోనా సోకింది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికారికంగా ప్రకటించింది. 81 ఏళ్ల బైడెన్‌ ప్రస్తుతం ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై చాలా రోజులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అధ్యక్ష పదవికి పనికి రారంటూ ట్రంప్ చాలా గట్టిగా వాదిస్తున్నారు. రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ కూడా చేశారు. బైడెన్ మాత్రం తాను చాలా ఫిట్‌గా ఉన్నానని తేల్చి చెప్పారు. ఆ దేవుడు దిగి వచ్చి చెప్తే తప్ప ఎన్నికల నుంచి తప్పుకోనని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆయనకు కొవిడ్ రావడం ఆందోళన పెంచుతోంది. ఆయన మెడికల్ కండీషన్ మరీ సీరియస్‌గా మారితే రేసు నుంచి తప్పుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. లాస్‌వెగాస్‌లో ఉండగా అస్వస్థతకు గురైన ఆయనకు టెస్ట్ చేయగా కొవిడ్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆయన జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే..బైడెన్‌ మాత్రం తాను బాగున్నానని మీడియాకి స్పష్టం చేశారు. ఇది చాలా సాధారణమని, మెడికేషన్ తీసుకుంటున్నారని వైట్‌హౌజ్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. 

అయితే..ఇటీవలే బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నా అనారోగ్యం మరీ సహకరించని స్థాయిలో ఉంటే అప్పుడు అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటాను" అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ఇలా అస్వస్థతకు గురయ్యారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పటి నుంచే బైడెన్‌పై పొలిటికల్‌గా ఒత్తిడి పెరిగింది. అంతకు ముందు ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లోనూ బైడెన్ పెద్దగా మాట్లాడలేకపోయారు. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు కొవిడ్ రావడం వల్ల ప్రచారానికి దూరమయ్యారు. వ్యాక్సినేషన్ చేశామని,ఐసోలేషన్‌లో ఉంటూనే తన పని తాను చేసుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యలేమీ లేవని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌ చేయాలి.. ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌ చేయాలి.. ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Rinku Singh Captaincy:  KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
Embed widget