అన్వేషించండి

Indian Influencer Family: టిష్యూ పేపర్ల దగ్గరగొడవ - వియత్నాంలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం వీరంగం - వీడియోలు వైరల్

Aishwarya Khanna Singh: వియత్నాంలో ఒక భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం రెస్టారెంట్‌పై దాడి చేసి వీరంగం సృష్టించింది. టిష్యూలు విసిరేయడం వారించినందుకు దాడి చేశారు. అంతా సీసీటీవీలో రికార్డ్ అయింది.

 Indian Tourists Bad Behavior Abroad:  విదేశాల్లో కొంతమంది భారతీయ పర్యాటకుల ప్రవర్తన దేశ ప్రతిష్టను మసకబారుస్తోంది. తాజాగా వియత్నాంలోని హో చి మిన్ సిటీలో ఒక భారతీయ కుటుంబం చేసిన రచ్చ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన డిస్ట్రిక్ట్ 1 లో ఉన్న 'బాంబే బైట్స్' అనే ఇండియన్ రెస్టారెంట్‌లో ఒక భారతీయ కుటుంబం తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. పిల్లలు రెస్టారెంట్ అంతటా టిష్యూ పేపర్లు విసిరేస్తుండటాన్ని సిబ్బంది వారించడమే వారు చేసిన తప్పయింది.

రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. రెండు భారతీయ కుటుంబాలు మద్యం మత్తులో రెస్టారెంట్‌కు వచ్చాయి. వారి పిల్లలు డైనింగ్ ఏరియాలో టిష్యూ పేపర్లను పడేస్తూ రచ్చ చేస్తుండటంతో, అలా చేయవద్దని సిబ్బంది మర్యాదగా కోరారు. దీనికి సహకరించాల్సింది పోయి, ఆ కుటుంబ సభ్యులు సిబ్బందితో గొడవకు దిగారు. రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే సమయంలో ఒక వ్యక్తి టేబుల్‌పై ఉన్న వస్తువులను నేలకేసి కొట్టి, టేబుల్ క్లాత్‌ను లాగిపడేశాడు. అంతటితో ఆగకుండా అడ్డువచ్చిన హోటల్ ఉద్యోగిని తీవ్రంగా నెట్టివేసి భౌతిక దాడికి దిగాడు.  

ఈ ఘటనపై రెస్టారెంట్ ఓనర్ ఐశ్వర్య తీవ్రంగా స్పందించారు. రెస్టారెంట్ అనేది పిల్లలు ఆడుకునే ప్లేగ్రౌండ్ కాదు, మా సిబ్బంది ఎవరి కోపతాపాలు తీర్చుకోవడానికైనా టార్గెట్‌లు అంతకన్నా కాదు. సోషల్ మీడియాలో  ఇన్‌ఫ్లుయెన్సర్  అయినంత మాత్రాన ప్రాథమిక నైతిక విలువలు, మర్యాదలు పాటించనక్కర్లేదని లేదు  అంటూ ఆమె మండిపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి, తమ ఫాలోయింగ్‌ను చూపిస్తూ బెదిరింపులకు దిగడం దారుణమని ఆమె పేర్కొన్నారు.

రెస్టారెంట్ సిబ్బంది గోలు ఓస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు కుటుంబం తాము ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో భారీగా ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లమని, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి రెస్టారెంట్‌ను మూసివేయిస్తామని బెదిరించారు. అంతా అయిపోయాక వారు మరిచిపోయిన బ్యాగ్‌ను మర్యాదగా అందించబోతే, థాంక్స్ చెప్పాల్సింది పోయి కొట్టడానికి చెయ్యి ఎత్తారని ఓస్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ గడ్డపై ఇలాంటి అనుభవం ఎదురవడం తన జీవితంలో ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.   

ఈ సీసీటీవీ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ పేరును బయటపెట్టి  నేమ్ అండ్ షేమ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయులకు విదేశాల్లో ఎలా ప్రవర్తించాలో చెప్పేలా సివిక్ సెన్స్ పై ప్రత్యేక క్లాసులు అవసరమని కొందరు కామెంట్ చేస్తుండగా, ఉద్యోగిపై దాడి చేసినందుకు వియత్నాం చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరుతున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget