Pakistan Caretaker PM: హాట్ హాట్‌గా పాకిస్థాన్ రాజకీయం- ఆపద్ధర్మ ప్రధానిగా ఆయనే!
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.
పాకిస్థాన్ ఆపద్దర్మ ప్రధానిగా ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంతో తాత్కాలిక ప్రధానిగా నియమించబోయే వారి పేర్లను ప్రకటించాలని అధ్యక్షుడు అల్వి ఇటీవల లేఖ రాశారు. ఇమ్రాన్‌తో పాటు ప్రతిపక్ష నేతకు కూడా ఆ లేఖను పంపారు.
పార్లమెంట్‌ను రద్దు చేసిన మూడు రోజుల్లోగా పేర్లను ప్రకటించాలని అధ్యక్షుడు అల్వి తన లేఖలో కోరారు. దీంతో గుల్జార్ పేరును తాత్కాలిక ప్రధాని పదవికి నియమించాలని ఇమ్రాన్ ప్రతిపాదించారు. అయితే నేషనల్ అసెంబ్లీని రద్దు చేయడంతో 90 రోజుల్లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
గుల్జర్ అహ్మద్.. పాకిస్థాన్‌కు 27వ చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. 2019 డిసెంబర్‌లో ఆ బాధ్యతలు చేపట్టిన గుల్జర్.. 2022 ఫిబ్రవరిన రిటైర్ అయ్యారు.
Also Read: Pakistan PM Imran Khan: ఆయన ఓ మెంటల్ కేస్- ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య కామెంట్స్
Also Read: Fact Check : పంజాబ్ కొత్త సీఎం బైక్ దొంగనా ? ఇదిగో నిజం