Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష - ఇక జైల్లోనే పాక్ మాజీ అధ్యక్షుడి జీవితం !
Jail For Imran Khan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. ఆయన భార్యకు కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

former Pakistan PM Imran Khan sentenced to 14 years: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి కోర్టు పధ్నాలుగు ఏళ్ల జైలు శిక్షవిధించింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కు సంబంధించిన భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రామ్ ఖాన్ కు స్థానిక కోర్టు శుక్రవారం 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇమ్రాన్ ఖాన్ పై పలు ఆర్థిక నేరాల అభియోగాలను పదవి నుంచి దిగిపోయిన తర్వతా మోపారు. ఆయనపై ఉన్న కేసుల్లో అతి పెద్దదైన కేసులో ఆగస్టు 2023లో అరెస్టు చేశారు. అప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా రావల్పిండిలోని గ్యారిసన్ నగరంలోని జైలులో అవినీతి నిరోధక కోర్టు తీర్పును వెలువరించింది.
వివిధ కారణాల వల్ల మూడుసార్లు వాయిదా పడిన తీర్పును అవినీతి నిరోధక కోర్టు న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ప్రకటించారు.అదిలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. పాకిస్తాన్ లో అవినీతి కేసుల్ని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) దర్యాప్తు చేస్తుంది. ఈ సంస్థ డిసెంబర్ 2023లో ఇమ్రాన్ ఖాన్ , అతని భార్య బుష్రా బీబీ మరో ఆరుగురిపై కేసు నమోదు చేసింది. పాకిస్తాన్ ఖజానాకు 190 మిలియన్ పౌండ్ల అంటే యాభై మిలియన్ల పాకిస్తాన్ రూపాయల మేర నష్టం కలిగించారని అభియోగాలు నమోదు చేసారు. అల్ ఖాదిర్ ట్రస్టుకు అనుచిత లబ్ది కలిగించడం వల్ల ఈ నష్టం జరిగిందని కోర్టు చెబుతంది.
అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు ఏమిటంటే ?
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని కేసు నమోదు అయింది. ఆ డబ్బులకు బదులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త నుండి భూమిని బహుమతిగా స్వీకరించారని ఇమ్రాన్ ఖాన్ దంపతులపై కేసులు నమోదు అయ్యాయి. 2022లో బ్రిటిష్ అధికారులు 190 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల
డబ్బులు మనీ లాండరింగ్ ద్వారా పాకిస్తాన్ చేరాయని గుర్తించారు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఇవన్నీ మాలిక్ రియాజ్ అనే వ్యాపారవేత్తకు చెందినవి. అయితే ఆ మనీలాండరింగ్ సొమ్మును స్వాధీనం చేసుకోకుండా.. అవినీతికి పాల్పడ్డారు. ఓ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ దంపతులు ఆ వ్యాపారవేత్త సాయం తీసుకుని ఆ నిధులను మళ్లించారు.
అల్-ఖాదిర్ ట్రస్ట్ ట్రస్టీగా బీబీ ఈ సెటిల్మెంట్ నుండి లబ్ది పొందారని కేసు పెట్టారు. జీలమ్‌లోని అల్-ఖాదిర్ విశ్వవిద్యాలయం కోసం అవినీతి డబ్బుతో భూమిని కొనుగోలు చేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.అయితే ఇమ్రాన్ మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టచం చేశారు. కానీ ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఈ అంశంపై కేసులు పెట్టి 2023లో అరెస్టుచేశారు. అయితే తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు.
పార్టీ పెట్టిన తర్వాత ఒక సారి గెలిచి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ పూర్తి కాలం పదవిలో ఉండలేదు. ఏప్రిల్ 2022లో పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించారు. అవినీతి, అధికారిక రహస్యాలను బహిర్గతం చేయడం, వివాహ చట్టాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై మూడు వేర్వేరు తీర్పులలో ఆయన దోషిగా నిర్ధారించారు. ఈ మూడు కేసుల్లోనూ ఆయనకు శిక్ష పడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

