అన్వేషించండి

ఉత్తర ఇజ్రాయెల్‌ పైకి 16 రాకెట్లను ప్రయోగించిన హమాస్, దాడుల ఆపకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్

పాలస్తీనాలోని హమాస్ సంస్థ మరోసారి రెచ్చిపోయింది. ఇజ్రాయెల్ వరుసగా బాంబు దాడులు చేస్తుండటంతో కొద్ది రోజులు సైలెంట్ అయింది. తాజాగా లెబనాన్‌ నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌ పైకి 16 రాకెట్లను ప్రయోగించింది.

పాలస్తీనాలోని హమాస్ సంస్థ మరోసారి రెచ్చిపోయింది. ఇజ్రాయెల్ వరుసగా బాంబు దాడులు చేస్తుండటంతో కొద్ది రోజులు సైలెంట్ అయింది. తాజాగా లెబనాన్‌ నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పైకి 16 రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని హైఫా లక్ష్యంగా దాడులు చేసినట్లు హమాస్‌ ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లో మరణాలు 10వేలు దాటినట్లు హమాస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తయింది. ఇజ్రాయెల్ అధికారులు కూడా తమ వైపు 1400 మరణాలు సంభవించాయని తెలిపింది. లెబనాన్‌లోనూ 81 మరణాలు సంభవించినట్లు తెలిసింది. మృతుల్లో 59 మంది హెజ్బోల్లా ఉగ్రవాదులున్నట్లు సమాచారం.

ప్రతికారం తప్పదన్న హమాస్
ఇజ్రాయెల్‌ ఆక్రమణ, ఊచకోతలకు ప్రతిస్పందనగానే రాకెట్లను ప్రయోగించినట్లు ఎజ్జెదీన అల్ ఖసమ్‌ బ్రిగేడ్‌ ప్రకటన విడుదల చేసింది. గాజా స్ట్రిప్‌లోని ప్రజలపై జరుగుతున్న దురాక్రమణకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించామని స్పష్టం చేసింది. లెబనాన్‌లోని హెజ్బోల్లాతో హమాస్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో హెజ్బోల్లా-ఇజ్రాయెల్‌ మధ్య నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. లెబనాన్‌ వైపు నుంచి తాజాగా ఉత్తర ఇజ్రాయెల్‌ వైపు 30 ప్రొజెక్టైల్స్‌ దూసుకొచ్చినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. అవి వచ్చిన దిశగానే తిరిగి కాల్పులు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే రెండు వైపులా ప్రాణనష్టం తెలియాల్సి ఉంది. 

హమాస్‌ను భూస్థాపితం చేస్తాం
హమాస్‌ నెట్‌వర్క్‌ను నామారూపాలు లేకుండా చేయడానికి గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్‌ సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ దళాలు నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. ఉత్తరగాజా, దక్షిణ గాజాగా విభజించి, మరింత దూకుడుగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ వెల్లడించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు గాజా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాయి. మరో 48 గంటల్లో అటు వైపు నుంచి గాజా భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది. అటు ఉత్తర గాజాలో భీకర దాడులు కొనసాగుతున్నాయి.

యుద్ధాన్ని ఆపేది లేదు
బందీలను హమాస్‌ వదిలిపెట్టేవరకు కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.  గెలిచే వరకు యుద్ధం కొనసాగిస్తామన్న ఆయన, తమకు మరో మార్గం లేదని ప్రకటించారు. యుద్ధాన్ని ప్రారంభించింది హమాసే అన్న ఆయన, తమను అంతం చేయడానికి కుట్రలు చేసిందని మండిపడ్డారు. హమాస్ ను సమూలంగా నాశనం చేయాలన్నదే తమలక్ష్యమని ప్రకటించారు.

దాడులను అమెరికా ప్రొత్సహిస్తోంది 

పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ప్రజలపై దాడులను అమెరికా ప్రోత్సహిస్తోందని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆరోపించారు. గాజాపై బాంబు దాడులను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇరాక్‌ ప్రధాని మహ్మద్‌ షియా అల్‌ సుదానీతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా గాజాలో బాంబు దాడులు ఆగుతాయని నమ్ముతున్నామన్న ఆయన, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలన్నారు. గాజాలోని ప్రజలకు తక్షణ సాయం అందజేయాలని సూచించారు. అమెరికా, యూరోపియన్‌ దేశాల మద్దతుతో మానవత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్రమైన నేరాలకు పాల్పడుతోందని ఇబ్రహీం రైసీ ఆరోపించారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
SLBC Tunnel News:కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
SLBC Tunnel News:కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
Tamannaah: 'లవర్‌ను కాస్త తెలివిగా సెలక్ట్ చేసుకోండి' - బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా ఏం చెప్పారంటే?
'లవర్‌ను కాస్త తెలివిగా సెలక్ట్ చేసుకోండి' - బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా ఏం చెప్పారంటే?
Viral News: శ్రీరాముడి కుమారుడి సమాధి పాకిస్తాన్‌లో ఉందా? రాజీవ్ శుక్లా ట్వీట్ వైరల్ !
శ్రీరాముడి కుమారుడి సమాధి పాకిస్తాన్‌లో ఉందా? రాజీవ్ శుక్లా ట్వీట్ వైరల్ !
KCR Latest News: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 
Good News For RTC Staff: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Embed widget