'Get the Zuck out': ఫేస్‌బుక్ సీఈఓగా జుకర్ బర్గ్ తప్పుకోనున్నారా? నిరసనకారులు అతడి ఇంటికి ఎందుకెళ్లారు?

ఫేస్ బుక్ సీఈవోగా మార్క్ జుకర్ బర్గ్ రాజీనామా చేయనున్నారా? నిరసనకారులు మార్క్ ఇంటి ముందుకు వెళ్లి నిరసన ఎందుకు చేశారు.

FOLLOW US: 

2021 అక్టోబర్ 17న మార్క్ జుకర్ బర్గ్.. ఫేస్‌బుక్ సీఈఓగా తన ఉద్యోగం నుంచి తొలగిపోవాలని.. కోరుతూ దాదాపు 20 మంది నిరసనకారులు జుకర్‌ పాలో ఆల్టో నివాసారనికి వెళ్లారు. గుంపుగా ఏర్పడి వారంతా.. ఆందోళన చేశారు. నిరసనకారులు తమ వాహనాలకు జుకర్ బర్గ్ సీఈవో తొలగించాలని డిమాండ్ చేస్తూ.. స్టిక్కర్లు వేసుకున్నారు. వ్యక్తిగత సమాచారం గోప్యత లేకుండా ఫేస్ బుక్ చేస్తుందని.. ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అని చెబుతున్నారు. ఫేస్ బుక్ ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడం జరుగుతుందని ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు జుకర్ బర్గ్ తానే.. రాజీనామా చేయనున్నాడని..బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్‌ సంచలన కథనం ప్రచురించింది. 

డిజిటల్ ప్రపంచంలో మెటావర్ తో అద్భుతాలను సృష్టించాలనేది ఫేస్ బుక్ ప్రయత్నం. అయితే దీనికోసం 10 వేల మంది నైపుణ్యం ఉన్న ఉద్యోగులను వచ్చే ఐదేళ్లలో ఫేస్ బుక్ నియమించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది.  దీనికోసం ఫేస్ బుక్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో జుకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు బ్రిటన్ కు చెందిన టాబ్లయిట్ కథనం ప్రచురించింది. ఆ సంస్థ అంతర్గత వ్యవహారాలు చూసుకునే.. కీలక ఉద్యోగి సమాచారం ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది.

డాటా లీకేజీ విషయంపై ఫేస్ బుక్ చాలా రోజులుగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇన్ స్టా గ్రామ్ తో మెంటల్ హెల్త్ దెబ్బతింటోందంటూ.. ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలు చేస్తోంది.  యూజర్‌ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ఎక్కువ అని ఆమె చెబుతోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ కంపెనీలో చర్యలు చేపట్టాలనే అంశంతోపాటు జుకర్ బర్గ్ ఆ పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది.

నవంబర్‌ 10న ‘క్విట్‌ ఫేస్‌బుక్‌’  పేరుతో ఒక్కరోజు ఫేస్‌బుక్‌, దాని అనుబంధ యాప్‌లను వాడొద్దంటూ పెద్ద ఎత్తున్న క్యాంపెయిన్‌ జరుగుతోంది. ఇలాంటి పరిణామాల కారణంతో.. ఆ సంస్థ బోర్డు సభ్యులు సీఈవోగా జుకర్ ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోందని కథనం ప్రచురితమైంది. ఈ పరిణామాలతో జుకర్ బర్గ్ తనకు తానే.. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఆ కథనం సారాంశం. అయితే మెజార్టీ బోర్డు సభ్యులు మాత్రం జుకర్‌బర్గ్‌ నాయకత్వం వైపే మొగ్గు చూపిస్తున్నారట.

ఏంటీ మెటావర్స్

మెటావర్స్‌ అనేది డిజిటల్‌ ప్రపంచం.  త్రీడీ ఎన్విరాన్‌మెంట్‌లో కార్యకలాపాలను చేసుకోవచ్చు. టెక్నాలజీని శాసించేది ఇదేనని అంటున్నారు నిపుణులు. మెటావర్స్‌లో ఎలా ఉంటుందంటే.. మీరు AR లేదా VR హెడ్ సెట్ ధరిస్తే, చూడాలనుకున్న నగరాలను సిటీ టూర్ల రూపంలో వర్చువల్‌గా సందర్శించవచ్చు. అక్కడ ఆకర్షణీయంగా ఉండే విషయాలను పరిశీలించవచ్చు. బెస్ట్ రెస్టారెంట్లు, అక్కడ ఉండే మెనూ వివరాలను అన్నింటినీ ఒకే రోజు సందర్శించి షెడ్యూల్ రూపొందించుకోవచ్చు. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ ఇదే విషయంపై జులైలో ప్రకటన సైతం చేశారు.  యూరోపియన్‌ యూనియన్‌ నుంచే ఈ ప్రయత్నాల్ని మొదలుపెట్టాలని నిర్ణయించారు. దానికోసం పదివేల మంది ఉద్యోగుల్ని నియమించాలని ప్రయత్నాలు చేశారు. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, పోలాండ్‌, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ నుంచి రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను కూడా మెుదలైంది. మరోవైపు మైక్రోసాఫ్ట్, రోబ్లోక్స్‌, ఎపిక్‌ గేమ్స్‌ సైతం సొంత వెర్షన్‌ మెటావర్స్‌ కోసం ప్రణాళికలు వేస్తున్నాయి. 

Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 18 Oct 2021 01:09 PM (IST) Tags: Instagram facebook Mark Zuckerberg protest on facebook

సంబంధిత కథనాలు

YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే

YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే

US President strong Warning to China: చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్- తైవాన్‌కు అండగా ఉంటామని బిడెన్ ప్రకటన

US President strong Warning to China: చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్- తైవాన్‌కు అండగా ఉంటామని బిడెన్ ప్రకటన

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

టాప్ స్టోరీస్

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్