(Source: Poll of Polls)
Gen Z: జనరేషన్ Z ఉద్యోగుల రొమాంటిక్ కోరికలు - ఆఫీసులో ఆ పనికి సెపరేట్ టైం ఉండాలట!
Gen Z Employees: ఆఫీసుకు ఎవరైనా ఎందుకు వస్తారు. ఉద్యోగాలు చేయడానికి వస్తారు. కానీ కొత్త తరం అయితే..పని చేస్తాం కానీ.. అన్నీ కావాలంటున్నారు. ఇప్పుడు ఆ పనులు చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు కావాలట.

Gen Z finally wants to have more romance at the office: జనరేషన్ Z అంటే.. నయా మిల్లేనియల్స్ పని మాత్రమే జీవి తం అనుకోవడం లేదు. పనిలోనే కొన్ని ఆనందాలు ఉండాలనుకుంటున్నారు. ఆఫీసులో ఇప్పటికే చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ శృంగారం చేసుకునే అవకాశం మాత్రం కల్పించడం లేదు. ఇప్పుడు ఆ సౌకర్యం కూడా కల్పించాలని వారు కోరుకుంటున్నారట.
1997 - 2012 మధ్య జన్మించిన వారని జనరేషన్ Zగా పిలుస్తున్నారు. వీరు తమ ఆఫఈసు కాన్ఫరెన్స్ గదిలో ఈ పని చేయడానికి వ్యతిరేకం కాదని చెబుతున్నారు. ఉద్యోగుల వ్యవహారాలపై సర్వేలు చేయడంలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఎడుబర్డీ నుండి వచ్చిన కొత్త సర్వే ప్రకారం ఈ కోరికల్ని బహిరంగంగానే వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం ముగించి అందరూ ఆఫీసులకు రావాలని పిలుస్తున్నారు. ఈ క్రమంలో EduBirdie 2,000 మంది జెన్ Z ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇంటి నుండి పని చేయడం వారి లైంగిక జీవనంపై ఎలాంటి ప్రభావం చూపిందో విశ్లేషిచింది. సుమారు 47 శాతం మంది రిమోట్ వర్క్ వారి లైంగిక జీవనాన్ని మెరుగుపరిచిందని చెప్పారు. వారిలో మూడవ వంతు మంది ఆఫీసుకు తిరిగి వెళ్లడం తమ లైంగిక జీవనాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
29 శాతం మంది ఆఫీసుకు తిరిగి వెళ్లడం తమ లైంగిక జీవనాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. ఆఫీసులో రొమాన్స్ అనే భావన ఇప్పటికీ నిషిద్ధమే. అయితే జనరేషన్ Z మాత్రం పని స్థలంలో రొమాన్స్‌ను—లేదా కేవలం లైంగిక సంబంధాలను సహజంగానే చూడాలని కోరుకుంటున్నారు. ఏకంగా 38 శాతం మంది జెన్ Z వ్యక్తులు తమ పనిస్థలంలో హుకప్‌ల కోసం లేదా కొంచెం స్వీయ-సంతృప్తి కోసం ఆన్-కాల్ రూమ్ వంటి ప్రైవేట్ స్థలం ఉండాలని కోరుకుంటున్నారు. సిగరెట్ బ్రేక్‌లు , మానసిక ఆరోగ్య నడకల కోసం బ్రేక్‌లు ఉంటే, లైంగిక సంబంధాల కోసం ఎందుకు ఉండకూడదని జెన్ Z స్పష్టంగా నమ్ముతుందని సర్వేలో వెల్లడయింది.
యువతరం ఉద్యోగులు తమ పనిని ఎందుకు చేస్తున్నామో గుర్తించడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడం , మొత్తం పని-జీవన సమతుల్యత ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. జెన్ Z ఇంటి నుండి పని చేయడంలో ఎన్నో ప్రయోజనాలను అనుభవించింది. కానీ చాలా మంది ఆఫీసుకు వెళ్లడాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. 42 శాతం మంది ఇతరులతో ఉండటం తమకు మంచిదని, ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
సర్వే వివిధ వయసుల నుండి 800 మంది సిబ్బందిని , 200 మంది మేనేజర్‌లను ప్రశ్నించింది. వారి సమాధానాలను విశ్లేషించింది . శృంగారం కోసం సెలవు తీసుకున్న తీసుకున్న సగం మంది ఉద్యోగులు తరువాత వారి ఉత్పాదకతలో గణనీయమైన పెరుగుదల ఉందని విశ్లేషణ గుర్తించింది. అయితే ఈ సర్వే ఇండియాలో జరిగింది కాదు.. అమెరికాలో జరిగింది.





















