Andhra Pradesh Silver Clutch Purse : సైప్రస్ ఫస్ట్ లేడీకి మేడిన్ రాజమండ్రి సిల్వర్ క్లచ్ పర్స్ బహుమతి - ప్రధాని మోదీ గిఫ్ట్ వైరల్
handcrafted Silver Clutch Purse: రాజమండ్రి హస్త కళలకు ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ప్రధాని మోదీ ఇచ్చారు. రాజమండ్రి కళాకారులు తయారు చేసిన సిల్వర్ క్లచ్ పర్స్ ను సైప్రస్ ఫస్ట్ లేడీకి బహుమతిగా ఇచ్చారు.

Andhra Pradesh Made handcrafted Silver Clutch : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. సైప్రస్ దేశంలో పర్యటించారు. సైప్రస్ ఫస్ట్ లేడీ ఫిలిప్పా కర్సెరాకు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు. అది మేడిన్ ఆంధ్రా గిఫ్ట్. ఆంధ్రప్రదేశ్ హస్తకళతో తయారు చేసిన సిల్వర్ క్లచ్ పర్స్‌ను బహుమతిగా ఇచ్చారు.
రాజమండ్రిలో తయారీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ ఫస్ట్ లేడీ ఫిలిప్పా కర్సెరాకు బహుమతిగా ఇచ్చిన హస్తకళతో తయారు చేసిన సిల్వర్ క్లచ్ పర్స్ రాజమహేంద్రవరం లో తయారు అయింది. ఈ సిల్వర్ క్లచ్ పర్స్ రెపౌస్సే (repoussé) టెక్నిక్‌తో తయారు చేశారు. సంక్లిష్టమైన పూల డిజైన్‌లు , దేవాలయ బొమ్మలు, రాళ్లతో అధిక ఆకర్షణీయంగా ఉంటుంది.
రాజమండ్రి వెండి హస్తకళలకు ప్రసిద్ధమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోని కళాకారులు సాంప్రదాయ లోహ కళలలో నైపుణ్యంతో ఇలాంటివి తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రెపౌస్సే టెక్నిక్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూంటారు. లోహాన్ని సుత్తితో కొట్టి ఉబ్బిన డిజైన్‌లను సృష్టించడం ద్వారా సంక్లిష్టమైన నమూనాలను రూపొందిస్తారు. రాజమండ్రిలోని అల్కాట్ గార్డెన్స్ వంటి ప్రాంతాలు వెండి క్లచ్ పర్స్‌లు , ఇతర హస్తకళల తయారీకి కేంద్రంగా ఉన్నాయి.
Prime Minister Narendra Modi gifted a Silver Clutch Purse to the First Lady of Cyprus, Philippa Karsera.
— ANI (@ANI) June 16, 2025
This beautiful silver clutch purse from Andhra Pradesh combines traditional metal work with modern style. Made using the repoussé technique, it has detailed floral designs… pic.twitter.com/irbU9GNexc
మోదీ ఇచ్చిన ఈ బహుమతి ఆంధ్రప్రదేశ్ గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, సాంప్రదాయ కళలను ఆధునిక శైలితో సమన్వయం చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేసిందని అనుకోవచ్చు. ఈ క్లచ్ పర్స్ దేవాలయాలు, రాజస్థానీ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన సంక్లిష్టమైన పూల డిజైన్‌తో ఉంది. ఈ క్లచ్ పర్స్ భారతదేశ శతాబ్దాల నాటి లోహ కళాకృతుల సంప్రదాయాన్ని, ఆధునిక శైలిని మిళితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రపంచం ముందు ఉంచింది.
మోదీ ఈ బహుమతిని భారతదేశం క్క “వోకల్ ఫర్ లోకల్” , “ఆత్మనిర్భర్ భారత్” కార్యక్రమాల ద్వారా స్థానిక హస్తకళలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చారు. ఈ బహుమతులు భారతీయ కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి. ఆంధ్రా హస్త కళలకు ప్రధాని మోదీ ఇచ్చిన అరుదైన గౌరవం అని పలువురు ప్రశంసిస్తున్నారు.
PM @narendramodi ji gifted a stunning silver clutch purse to the First Lady of #Cyprus, a proud showcase of Andhra Pradesh’s rich heritage.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 16, 2025
Crafted using the traditional *repoussé* technique, this elegant piece blends royal-era artistry with modern charm, reflecting the timeless… pic.twitter.com/pTbpwzIDzE





















