News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Astronauts Return to Earth: క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు- ఆరు నెలల అంతరిక్షయానం పూర్తి

Astronauts Return to Earth: నాసా వ్యోమగాములు 6 నెలల అంతరిక్ష యాత్ర ముగించుకుని సురక్షితంగా భూమికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే తీరంలో దిగారు.

FOLLOW US: 
Share:

Astronauts Return to Earth: 

గంటలు కాదు.. రోజులు కాదు... అక్షరాల ఆరు నెలలు... అంతరిక్షంలో ఉన్నారు ఆ నలుగురు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉండి.. ప్రయోగాలు చేశారు. అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకుని సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరు గత మార్చి నుంచి స్పేస్‌లోనే ఉన్నారు. నలుగురు వ్యోమగాములు కక్ష్యలో 186 రోజులు గడిపారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఆరు నెలల సాహసయాత్ర తర్వాత.. తెల్లవారుజామున నలుగురు వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చారు. స్ప్లాష్‌ డౌన్‌ విధానంలో ఫ్లోరెడా తీరంలోని సముద్ర జలాల్లో దిగారు నలుగురు వ్యోమగాములు. ఇందుకోసం స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూడ్రాగన్‌ క్యాప్సుల్‌ను వినియోగించారు. నాసా-స్పేస్‌ ఎక్స్‌ సంయుక్తంగా నిర్వహించిన క్రూ-6 మిషన్‌లో వీరు పనిచేశారు. 

స్పేస్‌ స్టేషన్‌ నుంచి 13 అడుగుల వెడల్పైన క్రూడ్రాగన్‌ వెహికల్‌లోకి ఆదివారం ప్రవేశించారు. దాదాపు ఒక రోజు భూకక్ష్యలో తిరిగి ఫ్లొరెడాలోని జాక్సన్‌విల్లే సముద్ర తీరం  వద్ద ల్యాండ్‌ సైట్‌ సమీపంలోకి చేరుకొన్నారు. అర్ధరాత్రి తర్వాత వారి క్యాప్సుల్‌ సముద్రజలాలపై దిగింది. ఈ ప్రయాణంలో క్రూడ్రాగన్‌ క్యాప్సుల్‌ ఒక దశలో గంటకు 27వేల  కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత... దాని బాహ్య ఉష్ణోగ్రత దాదాపు 19వందల డిగ్రీల వద్దకు దీని చేరుకుంది. క్రూడ్రాగన్‌ క్యాప్సుల్‌కు అమర్చిన ప్యారాచూట్లు ఓపెన్‌ కావడంతో... వేగం నెమ్మదించింది. దీంతో మెల్లగా సముద్రంలో పడింది క్రూడ్రాగన్‌ క్యాప్సుల్. దీనిని డ్రాగన్స్‌ నెస్ట్‌ అనే ప్రత్యేకమైన బోట్‌లోకి ఎక్కించారు. అక్కడే వ్యోమగాములకు అన్ని పరీక్షలు నిర్వహించారు.  

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ నుంచి భూమికి చేరిన వ్యోమగాముల్లో... ఇద్దరు అమెరికాకు చెందిన వ్యోమగాములు. వీరి పేర్లు స్టీఫెన్ బోవెన్, వారెన్ వుడీ హోబర్గ్. వీరితో పాటు రష్యాకు చెందిన ఆండ్రీ ఫెడ్యావ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన సుల్తాన్ అల్-నెయాడి కూడా ఉన్నారు. సుల్తాన్ అల్-నెయాది... అరబ్ దేశానికి సంబంధించి స్పేస్‌లో ఎక్కువ కాలం గడిపిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. మార్చి నుంచి స్పేస్‌లో ఉన్న ఈ నలుగురు వ్యోమగాముల బృందం... అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లో పరిశోధనలు నిర్వహించింది. ఆరు నెలల కాలంలో దాదాపు 200కు పైగా ప్రయోగాలు చేశారు. భూమికి తిరిగి రావడం నమ్మశక్యంగా లేదని.. కానీ సంతోషంగా ఉందంటున్నారు నలుగురు వ్యోమగాములు. 

వీరి స్థానంలో మరో నలుగురు వ్యోమగాములను రీప్లేస్‌ చేశారు. నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ శనివారం కేప్‌ కెనవెరాల్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఇంటర్నేషన్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి నిన్న అడుగుపెట్టారు ఆ నలుగురు వ్యోమగాములు. వారు స్పేష్‌ స్టేషన్‌కు చేరుకోగానే... అక్కడున్న నలుగురు వ్యోమగాములు.. భూమికి దిగివచ్చారు. ఈ నలుగురు స్థానంలో.. ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆరు నెలలపాటు అక్కడే ఉంటారు. ఆ నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు.

Published at : 04 Sep 2023 08:08 PM (IST) Tags: Space NASA Earth international space station world Astronauts

ఇవి కూడా చూడండి

Viral Video: లైవ్‌ డిబేట్‌లో  కొట్టుకున్న పాకిస్థాన్‌ నేతలు

Viral Video: లైవ్‌ డిబేట్‌లో కొట్టుకున్న పాకిస్థాన్‌ నేతలు

Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్‌ రామస్వామి

Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్‌ రామస్వామి

భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!

భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!

India-Canada Row: కెనడా వివాదంపై నోరు విప్పని భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రులు

India-Canada Row: కెనడా వివాదంపై నోరు విప్పని భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రులు

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

టాప్ స్టోరీస్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే