Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదు- ఇళ్ల నుంచి బయటకు పరుగులు
Earthquake Latest News | రష్యాలోని కమ్చట్కాలో భారీ భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Earthquake in Russia: రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో ఆదివారం (జూలై 20) నాడు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం, ఈ భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉంది.
కమ్చట్కా ద్వీపం భౌగోళికంగా చాలా చురుకైన ప్రాంతం. దీనిని 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్'లో భాగంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతం డజన్ల కొద్దీ క్రియాశీల అగ్నిపర్వతాలతో చుట్టుకుని ఉంది. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ తరచుగా మధ్యస్థ నుంచి తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. తాజాగా సంభవించిన ఈ భూకంపం వల్ల కలిగే నష్టంపై ఎటువంటి సమాచారం లేదు.
జూన్ 13న కూడా బలమైన భూకంపం
గత నెల జూన్ 13, 2025న, రష్యాలోని కురిల్ దీవులలో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 12 కిలోమీటర్ల లోతులో ఉంది. కురిల్ ద్వీపం రష్యాలోని ఫార్ ఈస్టర్న్ భాగంలో ఉంది. కురిల్ దీవులు కమ్చట్కా దక్షిణ దిశ నుండి హక్కైడో ద్వీపం (Japan) ఈశాన్య చివరి ప్రాంతం వరకు 750 మైళ్ళు (1,200 కి.మీ) విస్తరించి ఉంది.
జనవరి 26న రష్యాలోని కమ్చట్కా ప్రాంత తూర్పు తీరానికి సమీపంలో 5.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనిని యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం ధ్రువీకరించింది. భూకంప కేంద్రం భూమికి 51 కి.మీ లోతులో ఉందని గుర్తించారు. 1952లో, రష్యాలోని కురిల్ దీవులలో అత్యధికంగా 9 తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే ఇది అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల సంభవించింది.
భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?
భూకంపాలకు ప్రధాన కారణం ఏంటంటే.. భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొంటాయి. దీని కారణంగా, భూమి కింద కంపనాలు ఉత్పత్తి అవుతాయి, దాని ఫలితంగా భూకంప ప్రకంపనలు అనుభూతి చెందుతాయి. దీనితో పాటు, అణ్వాయుధాల పరీక్షల వల్ల సైతం భూ ప్రకంపనలు అనుభూతి చెందుతాయి. పలు దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.






















