అన్వేషించండి

Earthquake in Russia: రష్యాలో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతగా నమోదు

Russia Earthquake: రష్యాలోని కురిల్ దీవులలో భూకంపం ఏర్పడింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగా నమోదైంది. ప్రాణనష్టం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది.

Russia Earthquake: రష్యాలోని కురిల్ దీవుల సమూహంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప శాస్త్ర కేంద్రం (EMSC) శుక్రవారం (జూన్ 13, 2025) నాడు సంభవించిన భూకంపం భూమికి 12 కిలోమీటర్ల దిగువన కేంద్రీకృతమైందని తెలిపింది. కురిల్ దీవులు రష్యా సుదూర తూర్పు భాగంలో ఉన్న సఖాలిన్ ఒబ్లాస్ట్ (ప్రావిన్స్) లో ఉన్న ద్వీపసమూహం. ఈ ద్వీపసమూహం కమ్చట్కా ద్వీపకల్పం (రష్యా) దక్షిణ నుంచి హోక్కైడో ద్వీపం (జపాన్)  ఈశాన్య మూలకు 750 మైళ్ళు (1,200 కిమీ) వరకు విస్తరించి ఉంది. ఇవి ఓఖోట్స్క్ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రం నుంచి వేరు చేస్తాయి. ఇవి 56 ద్వీపాల సమూహం, ఇవి 6,000 చదరపు మైళ్ళు (15,600 చదరపు కిమీ) విస్తరించి ఉన్నాయి.

ఈ శ్రేణి పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న భూగర్భ అస్థిరత బెల్ట్ లో భాగం. ఇందులో కనీసం 100 అగ్నిపర్వతాలు ఉన్నాయి, వాటిలో 35 ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయి. అనేక వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. భూకంపాలు, సునామీలు ఇక్కడ సర్వసాధారణం. 1737లో  210 అడుగుల (64 మీటర్లు) ఎత్తుకు అలలు ఎగసిపడినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రికార్డు ఇదే.  

రష్యాకు సంబంధించిన భూకంప ఘటన
గత జనవరి 26 న కూడా రష్యాలోని కమ్చట్కా ప్రాంత తూర్పు తీరానికి సమీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనిని యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప శాస్త్ర కేంద్రం ధృవీకరించింది. భూకంప కేంద్రం భూమికి 51 కిమీ దిగువన ఉంది. అంతకుముందు, గత సంవత్సరం డిసెంబరులో కురిల్ దీవుల సమూహంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1952 లో రష్యాలోని కురిల్ దీవుల సమూహంలో 9 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇది అగ్నిపర్వతం బద్దలవడం వల్ల సంభవించింది. భూకంపం రావడానికి ప్రధాన కారణం గురించి మాట్లాడితే... భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. దీని కారణంగా భూమి కింద ప్రకంపనలు ఏర్పడతాయి. దీని కారణంగా భూకంపాలు సంభవిస్తాయి. దీనితో పాటు, అణు ఆయుధాల పరీక్షల కారణంగా కూడా భూకంపాలు సంభవిస్తాయి, ఇవి ఎక్కువ హాని కలిగించవు.

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget