అన్వేషించండి

Donald Trump: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెడీ, భాష కూడా ఈజీగా నేర్చుకుంటాను: డొనాల్డ్ ట్రంప్

తమతో ఒప్పందం చేసుకోవాలని, లేక హర్మూజ్ జలసంధి తెరవాలని లేకపోతే సర్వనాశనం చేస్తామని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా అధ్యక్షుడిగా పోటీ చేస్తానన్నారు.

వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలో యుద్ధం క్లైమాక్స్‌కు చేరుకుంటున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వింత ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. తనకు అమెరికాలోనే కాదు అంతకంటే ఎక్కువగా వెనిజులాలో ప్రజాదరణ ఉందని వ్యాఖ్యానించారు.  అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత, వెనిజులా అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని పరిశీలిస్తానని ఆయన అన్నారు.

వెనిజులాలో చాలా పాపులర్.. 
సోమవారం జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలో ఇప్పటివరకు ఏ నాయకుడికి లేనంత ప్రజాదరణ తాను సాధించగలనని అన్నారు. ఈ ఏడాది జనవరిలో అమెరికా సైనిక చర్య ద్వారా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అరెస్టు చేసి న్యూయార్క్ తరలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల విచారణ నిమిత్తం అమెరికాకు తీసుకెళ్లగా ఇక్కడ కొత్త నేత వచ్చి పరిపాలన కొనసాగిస్తున్నారు. 

వెనిజులా అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను
‘అమెరికాలో పదవీకాలం ముగిసిన తరువాత నేను వెనిజులా వెళ్లాలనుకుంటున్నాను. వెనిజులా అధ్యక్ష పదవికి పోటీ చేస్తే, అక్కడ నాకుఉన్న ప్రజాదరణ ఇప్పటివరకు ఏ వ్యక్తికి లేనంత అని  ప్రజలు అంటున్నారు. అమెరికాలో నా బాధ్యతలు పూర్తయిన తర్వాత వెనిజులా వెళ్లాలనుకుంటున్నాను. త్వరలోనే స్పానిష్ ల్యాంగ్వేజ్ నేర్చుకుంటాను. ఎందుకు నాకు ఎక్కువ టైం కూడా పట్టదు. అసలే వేరే భాషలు నేర్చుకోవడంలో నేను దిట్ట. భవిష్యత్తులో వెనిజులాకు వెళ్లి అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై ఆలోచిస్తున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు.

వెనిజులా బాధ్యతలు నిర్వహిస్తున్న డెల్సీ రోడ్రిగ్జ్ 
ప్రస్తుతం ఎన్నికైన వెనిజులా అధ్యక్షురాలి పాలనతో తాము చాలా సంతోషంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. జనవరి 3న నికోలస్ మదురో అరెస్టు తర్వాత, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి పరిపాలన కొనసాగిస్తున్నారు. వెనిజులాతో ఘర్షణ కేవలం 45 నిమిషాల్లో ముగిసిందని, అమెరికా అక్కడి నుండి కోట్ల బ్యారెళ్ల చమురును పొంది ప్రయోజనం చేకూరినట్లు తెలిపారు.

ప్రస్తుతం వెనిజులాలో పరిపాలన బాగుంది. మంచి వ్యక్తులు దేశాన్ని నడిపిస్తున్నారు. దాంతో ఆ ప్రభుత్వుంతో మా సంబంధాలు బాగున్నాయి. మేం వారికి భాగస్వాములుగా కొనసాగుతున్నాం. అదే సమయంలో వెనిజులా నుంచి అమెరికా కోట్ల బ్యారెళ్ల చమురును తీసుకుంటున్నాం. అది హ్యూస్టన్‌లో రిఫైన్ అయ్యి వినియోగానికి సైతం సిద్ధంగా ఉందని’ అన్నారు.

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. నెక్ట్స్ ఏంటీ..

ఇరాన్‌కు ఇచ్చిన గడువు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8కి ముగియనుంది. భారత కాలమానం ప్రకారం ట్రంప్ ఇచ్చిన గడువు బుధవారం ఉదయం 6.30 గంటలకల్లా ముగుస్తుంది. తమతో ఒప్పందాలు చేసుకోవాలని, లేకపోతే తక్షణం హర్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఓవైపు యుద్ధం ఆపేందుకు శాంతిచర్చలు అంటూనే, మరోవైపు ఇరాన్ లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు , ఇంధన వనరులపై భీకర దాడులు చేసి అంతా సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ముడి చమురు కొరతతో పలు దేశాల్లో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే పలు దేశాల్లో ఇంధన కొరత పెరిగి అన్ని ధరలు పెరిగి ఆర్థిక మాంధ్యానికి దారితీసే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget