అన్వేషించండి

Us Election 2024 : డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం- ఉపాధ్యక్ష అభ్యర్థిగా జె.డి.వేన్స్‌

Washington: దుండగుల దాడి తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా తనక సహాయకారిగా జె.డి.వేన్స్‌ను ప్రకటించారు.

J.D. Vance: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ అనూహ్యమైన వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు అంచనా వేయలేని ఎత్తులు వేశారనేందుకు ఉపాధ్యక్ష పదవికి పోటీకి నిలిపి వ్యక్తే ఉదాహరణ. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి  పోటీ పడే అభ్యర్థిగా 39 ఏళ్ల జె.డి.వేన్స్‌ను ఎంపిక చేస్తూ సంచలనం సృష్టించారు. 

దుండగులు దాడి చేసిన తర్వాత ట్రంప్‌లో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ చాలా పెరిగిందని రిపబ్లికన్స్ అంటున్నారు. అందుకే రైట్‌ వింగ్‌పై విశ్వాసం ఉన్న వ్యక్తిని తన పార్టీ తరఫున ఉపాధ్యక్షుడిగా పోటీలో పెట్టారనే వాదన వినిపిస్తోంది. తన విధానాలను కఠినంగా విమర్శించే నేతను ఇలా తన నమ్మకస్తుడిగా పక్కన పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్య కలిగిస్తోంది. 

"వైస్ ప్రెసిడెంట్‌గా J.D. మన రాజ్యాంగం కోసం పోరాడుతూనే ఉంటాడు, మన టీం కోసం గట్టిగా నిలబడతారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో నాకు సహాయకారిగా ఉంటారు. అమెరికా కోసం చేయగలిగినదంతా చేస్తారు" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

"సుదీర్ఘమైన చర్చలు, మథనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. అయినా  యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టడానికి ఉత్తమమైన వ్యక్తి ఒహియోలోని గ్రేట్ స్టేట్ సెనేటర్ J.D. వాన్స్ అని నేను నిర్ణయించుకున్నాను" అని ట్రంప్ పోస్టు చేశారు. 
మిల్వాకీలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభ రోజునే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 

"జె.డి. మెరైన్ కార్ప్స్‌లో అమెరికాకు గౌరవప్రదమైన సేవలందించారు, ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుంచి రెండేళ్లలోనే డిగ్రీ పట్టా తీసుకున్నారు. సుమ్మ కమ్ ల్యాడ్, యేల్ లా స్కూల్ గ్రాడ్యుయేట్, ది యేల్ లా జర్నల్ ఎడిటర్, యేల్ లా వెటరన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇలా పదవులకు న్యాయం చేశారని ట్రంప్ అన్నారు. 

"J.D. రాసిన "హిల్‌బిల్లీ ఎలిజీ" పుస్తకం ది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. కష్టపడి పనిచేసే వాళ్లకు గైడ్‌లా మారింది. J.D. టెక్నాలజీ, ఫైనాన్స్‌లో విజయవంతమైన వ్యాపారిగా చాలా అనుభవం ఉంది. ప్రస్తుత ప్రచారంలో పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, ఒహియో, మిన్నెసోటాలో అమెరికన్ వర్కర్స్ అండ్ ఫార్మర్స్ కోసం పోరాడిన వారికి మరింత బలంగా నిలబడతారని భవిస్తున్నాను అని ట్రంప్ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఆ విగ్రహంపై చేయ్యేస్తే వీపు చింతపండే, ఆదానీపై కేటీఆర్ నోరు విప్పాలి - రేవంత్ రెడ్డి
ఆ విగ్రహంపై చేయ్యేస్తే వీపు చింతపండే, ఆదానీపై కేటీఆర్ నోరు విప్పాలి - రేవంత్ రెడ్డి
YouTuber throwing money : ట్రాఫిక్‌లో డబ్బులు వెదజల్లి వీడియో  - హైదరాబాద్‌లో యూట్యూబర్ అరాచకం - పట్టించుకోని పోలీసులు
ట్రాఫిక్‌లో డబ్బులు వెదజల్లి వీడియో - హైదరాబాద్‌లో యూట్యూబర్ అరాచకం - పట్టించుకోని పోలీసులు
టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
JioCinema Glitch: జియో సినిమాలో గ్లిచ్ - కంప్లయింట్లు చేస్తున్న యూజర్లు!
జియో సినిమాలో గ్లిచ్ - కంప్లయింట్లు చేస్తున్న యూజర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఆ విగ్రహంపై చేయ్యేస్తే వీపు చింతపండే, ఆదానీపై కేటీఆర్ నోరు విప్పాలి - రేవంత్ రెడ్డి
ఆ విగ్రహంపై చేయ్యేస్తే వీపు చింతపండే, ఆదానీపై కేటీఆర్ నోరు విప్పాలి - రేవంత్ రెడ్డి
YouTuber throwing money : ట్రాఫిక్‌లో డబ్బులు వెదజల్లి వీడియో  - హైదరాబాద్‌లో యూట్యూబర్ అరాచకం - పట్టించుకోని పోలీసులు
ట్రాఫిక్‌లో డబ్బులు వెదజల్లి వీడియో - హైదరాబాద్‌లో యూట్యూబర్ అరాచకం - పట్టించుకోని పోలీసులు
టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
JioCinema Glitch: జియో సినిమాలో గ్లిచ్ - కంప్లయింట్లు చేస్తున్న యూజర్లు!
జియో సినిమాలో గ్లిచ్ - కంప్లయింట్లు చేస్తున్న యూజర్లు!
Karimnagar Electric Buses: కరీంనగర్‌కూ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయోచ్! ఏ రూట్లలో తిప్పుతారో తెలుసా?
కరీంనగర్‌కూ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయోచ్! ఏ రూట్లలో తిప్పుతారో తెలుసా?
Mahindra XUV700: మహీంద్రా ఎక్స్‌యూవీ700పై భారీ తగ్గింపు - ఎంత తగ్గించారంటే?
మహీంద్రా ఎక్స్‌యూవీ700పై భారీ తగ్గింపు - ఎంత తగ్గించారంటే?
Pawan Kalyan: అచ్యుతాపురం రియాక్టర్ బ్లాస్ట్: కంపెనీ ఓనర్స్‌ మధ్య గొడవలు - పవన్ కీలక వ్యాఖ్యలు
అచ్యుతాపురం రియాక్టర్ బ్లాస్ట్: కంపెనీ ఓనర్స్‌ మధ్య గొడవలు - పవన్ కీలక వ్యాఖ్యలు
Cristiano Ronaldo: ఒక్కరోజులో 20 మిలియన్ సబ్‌స్క్రైబర్లు - యూట్యూబ్ రికార్డులు కొడుతున్న రొనాల్డో!
ఒక్కరోజులో 20 మిలియన్ సబ్‌స్క్రైబర్లు - యూట్యూబ్ రికార్డులు కొడుతున్న రొనాల్డో!
Embed widget