అన్వేషించండి

US Golden Dome System: అమెరికా గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్, అంతరిక్షం నుంచి పర్యవేక్షణ, AIతో కంట్రోల్.. ట్రంప్ మామూలోడు కాదు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ డోమ్ అనే కొత్త ఉపగ్రహ ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను ప్రకటించారు. దీని ఖర్చు, వ్యూహం, పాత్ర, ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

US Golden Dome System: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణకు అత్యంత శక్తివంతమైన క్షిపణి భద్రతా వ్యవస్థ 'గోల్డెన్ డోమ్' (Golden Dome)ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటంటే.. శత్రు క్షిపణులను వెంటనే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని మధ్యలోనే ఆకాశంలోనే నాశనం చేయడం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'గోల్డెన్ డోమ్ ప్రణాళికకు' మొదట్లో 25 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ అనుకున్నారు. అయితే, మొత్తం వ్యవస్థను నిర్మించడానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం. దీని నిర్మాణం అంతా అమెరికాలోనే జరుగుతుంది. 

గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. నా పదవీకాలం ముగిసేలోపు ఇది పూర్తవుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ బాధ్యతను జనరల్ మైఖేల్ గుయెట్‌లీన్‌కు అప్పగించింది. ఇది ఇజ్రాయెల్ కు చెందిన 'ఐరన్ డోమ్' వ్యవస్థ నుంచి స్ఫూర్తి పొందింది. కానీ దీని పరిధి ఎక్కువ.  అంతరిక్షం నుంచి సైతం ఇది పర్యవేక్షణ చేయనుంది. ఇందులో వందల పర్యవేక్షణ ఉపగ్రహాల నెట్‌వర్క్ ఉంటుంది. ఈ ఉపగ్రహాలు క్షిపణులు ప్రయోగించిన వెంటనే వాటిని గుర్తించి, నాశనం చేయడంలో సహాయపడతాయి. ఇవి రియల్ టైమ్ డేటా షేరింగ్, రేడార్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానమై ఉంటాయి.  ఇందులో AI ఆధారిత టెక్నాలజీ వినియోగిస్తారు. ట్రాకింగ్, ఫైర్ కమాండ్ ఏఐ ద్వారా చేయనున్నారు. ఈ వ్యవస్థ అమెరికా రక్షణ వ్యూహంలో అంతరిక్ష ఆధారిత రక్షణ (స్పేస్-బేస్డ్ డిఫెన్స్)ను తొలి స్థానంలో ఉంచుతుందని’ భావిస్తున్నట్లు తెలిపారు.

ఆసక్తి చూపుతున్న కెనడా
అమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై కెనడా ఆసక్తి చూపిందని, అమెరికా తన పొరుగు దేశానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఈ ప్రాజెక్ట్‌ను కేవలం దేశ ప్రజల భద్రతకు మాత్రమే పరిమితం చేయాలని భావించడం లేదు. ఇది నాటో దేశాలతో భాగస్వామ్యం కోసం కొత్త ఆలోచనలు చేస్తుందన్నారు.  చైనా, రష్యా వంటి దేశాలకు గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సంకేతాలు పంపుతున్నాం. జనరల్ మైఖేల్ గుయెట్‌లీన్‌ను ఈ వ్యవస్థ డైరెక్టర్,  పర్యవేక్షణ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

ఇప్పటికే పని ప్రారంభించిన పెంటగన్
పెంటగన్ ఇప్పటికే సెన్సార్లు, ఉపగ్రహాలు, క్షిపణి పరీక్షల విధివిధానాలను సైతం రూపొందించింది. అమెరికా ప్రభుత్వ బడ్జెట్ ఆమోదంతో గోల్డెన్ డోమ్ నిర్మాణానికి సిద్ధమవుతాం. ట్రంప్ ఎన్నికల హామీగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టారు. దీని సహాయంతో అమెరికా ICBM, హైపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసి దీటుగా ఎదుర్కోగలదు. అంతరిక్ష ఆధిపత్యంలోనూ అమెరికాకు మెరుగైన స్థానంలో నిలవనుంది. ఇది అత్యంత భద్రత కలిగిన రక్షణ వ్యవస్థగా మారుతుందని ట్రంప్ భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Embed widget