(Source: ECI/ABP News/ABP Majha)
Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు
Corona Man Made Virus: చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త కోవిడ్19 మానవులు తయారుచేసిన వైరస్ అని సంచలన విషయాలు వెల్లడించారు.
Covid Man Made Virus: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చింది, మానవ సృష్టినా లేక అదే ఉద్భవించిందా అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. ఈ క్రమంలో కరోనా వైరస్ మొట్టమొదట గుర్తించిన చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త కోవిడ్19 మానవులు తయారుచేసిన వైరస్ అని సంచలన విషయాలు వెల్లడించారు. వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV) ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని, న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, పరిశోధకుడు ఆండ్రూ హాఫ్ బ్రిటీష్ న్యూస్ పేపర్ ‘ది సన్’కు ఈ విషయాన్ని తెలిపారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
అమెరికా నిపుణుడు రాసిన పుస్తకంలో నమ్మలేని నిజాలు
అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆండ్రూ హాఫ్ తన తాజా పుస్తకం, "ది ట్రూత్ అబౌట్ వూహాన్"లో పలు సంచలన విషయాలు రాశారు. ఈ బుక్‌లో పేర్కొన్న అంశాలలలో కరోనా వైరస్ వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైంది అనేది చాలా ముఖ్యమైనది అని బ్రిటన్ కు ది సన్ న్యూస్ పేపర్ ప్రచురించింది. చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని సైంటిస్ట్ ఆండ్రూ హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రపంచాన్ని కొవిడ్ మానవ నిర్మిత వైరస్ అని, అది చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే లీకైందని బయటకు రావడంతో పలు దేశాలు తమ అంచనా నిజమైందని చెబుతున్నాయి.
చైనాకు నిధులు అందజేసిన అమెరికా, తరువాత యూటర్న్
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఆండ్రూ హాఫ్ ఎకోహెల్త్ అలయన్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. ఎకో హెల్త్ అనేది ఎన్జీవో సంస్థ. ఇది అంటువ్యాధుల గురించి అధ్యయనం చేస్తుంది. అమెరికాకు చెందిన ఈ సంస్థ గబ్బిలాల్లో కరోనా వైరస్ లపై 10 ఏళ్ల కిందటి నుంచి అధ్యయనం చేస్తోంది. ఈ ఎక్ హెల్త్ సంస్థనే చైనాలోని వూహాన్ ల్యాబ్ కు నిధులు సమకూర్చుతోంది. కానీ ఇదే ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ను చైనా లీక్ చేసిందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో చైనా ల్యాబ్ కు నిధులను అప్పటి ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది.
బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను నిర్ధారించడానికి వూహాన్ ప్రయోగశాలలలో తగిన నియంత్రణ చర్యలు లేవు అని, ఆ కారణంతోనే అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ లీకైందని ఆండ్రూ హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. మానవ నిర్మిత వైరస్ అని చైనాకు మొదట్నుంచీ కొవిడ్ గురించి తెలుసునని, కానీ అందుకు అమెరికా ప్రభుత్వమే కారణమని ప్రచారం జరగడంతో తాను ఆందోళనకు గురైనట్లు రాసుకొచ్చారు. చైనాకు అమెరికా బయో వెపన్స్ అందజేస్తుందని పలు దేశాలు ఆరోపించాయి. చైనా నుంచి లీకైన కరోనా వైరస్ ఆపై ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి మిలియన్ల మంది మరణానికి కారణమైంది. పలు దేశాలు ప్రయాణ ఆంక్షలతో పాటు భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి ఎన్నో కోవిడ్ ఆంక్షలు అమలు చేసినా ప్రాణ నష్టం ఏడాది వరకు ఆగలేదు. వ్యాక్సిన్లు రావడంతో కరోనా ప్రభావం తగ్గిపోయింది.