Silvio Berlusconi : 85 ఏళ్ల మాజీ ప్రధాని 32 ఏళ్ల ఎంపీతో "సింబాలిక్ మ్యారేజ్" ! ఇటలీ ప్రేమలు ఇలాగే ఉంటాయా ?
రసిర రాజుగా పేరు తెచ్చుకున్న ఇటలీ మాజీ ప్రధాని బెర్లూస్కోనీ 85ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డారు. పెళ్లికి సమస్యలు తలెత్తడంతో 32 ఏళ్ల తన ఎంపీ లవర్‌ను సింబాలిక్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లూస్కోని గురించి అంతర్జాతీయ వ్యవహారాలపై ఆసక్తి ఉన్న వారందరికీ తెలుసు. పుతిన్‌లా ఆయన యుద్ధాలుచేయలేదు. ట్రంప్‌లా రచ్చ చేయలేదు. కానీ ప్రధానిగా ఆయన రొమాన్స్ చేశారు. ఆయన లైఫ్ స్టైల్ ప్రపంచం మొత్తం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయనకు 85 ఏళ్ల వయసు వచ్చింది. ఎప్పుడో ప్రధాని పదవి పోయింది. అయినా బెర్లూస్కోని తన రొమాంటిక్ లైఫ్‌లో మాత్రం లోటు లేకుండా చేసుకుంటున్నాడు. తాజాగా తనకంటే వయసులో యాభై మూడేళ్లు చిన్నదైన 32 ఏళ్ల మహిళా ఎంపీ మార్తాతో సింబాలిక్ వివాహం చేసుకున్నారు. అంటే పెళ్లి కాదు.. కానీ పెళ్లిలాంటిదన్నమాట. ఇలా ఎందుకు చేసుకున్నాడంటే దానికో కారణం ఉంది.
85 ఏళ్ల బెర్లూస్కోనీ చేసుకున్న సింబాలిక్ వివాహం ఫోటోలు వైరల్ అయ్యాయి. మూడు స్టేజ్‌ల్లో ఉండే అతి పెద్ద కేక్‌ను కోసి అతి సన్నిహితుల సమక్షంలో మార్తాకు రింగ్ తొడిగారు. కానీ ఇదంతా అనధికారికం. అందుకే సింబాలిక్ మ్యారేజ్అని ప్రకటించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.అసలు పెళ్లి కాకుండా సింబాలిక్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ... బెర్లూస్కోనీ కుటుంబంలోని సమస్యలే. వీరి వివాహానికి సిల్వియో సంతానం అంగీకరించడం లేదు. సిల్వియో బెర్లుస్కోనీకి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్నారు. 85 ఏళ్ల వయసులో 32 ఏళ్ల మార్తాను పెళ్లి చేసుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ వ్యతిరేకతకు అసలు కారణం రొటీన్‌దే . అదే ఆస్తులు ఒకవేళ సిల్వియో.. మార్తాను పెళ్లి చేసుకుంటే అతని ఆస్తిలో సగం ఆమెకు చెందుతుంది. ఆగర్భ శ్రీమంతుడైన బెర్లూస్కోనీకి ఐదు బిలియన్ యూరోల ఆస్తి ఉంటుంది. మార్తా ఫస్సీనాకు ఇంతకు ముందు ఫ్రాన్సిస్కా పాస్కల్ అనే యువకుడితో రిలేషన్‌లో ఉంది. ఆ తరువాత అతనితో విడిపోయి.. తనకన్నా 53 ఏళ్లు పెద్దవాడైన సిల్వియో బెర్లుస్కోనీతో ప్రేమలో పడింది. ఆయనతో సహజీవనం చేస్తోంది.
బెర్లూస్కోరీ స్త్రీ లోలుడు. ఆయనపై అనేక ప్రచారాలు ఉన్నాయి. బుంగా బుంగా సెక్స్ పార్టీలను ఆయన ఎంజాయ్ చేసేవాడని చెబుతూ ఉంటారు. ఆయనపై అనేక విచారణలు జరిగాయి. 74 ఏళ్ల వయసులో బెర్లుస్కోనీ రూబీ ది హార్ట్ స్టీలర్‌గా పిలిచే 17 ఏళ్ల నైట్ క్లబ్ డ్యాన్సర్‌తో సెక్స్‌కు చెల్లింపులు చేసినట్లు వచ్చిన ఆరోపణలు వచ్చాయి.దానిపై విచారణ కూడా జరిగింది. యంగ్ మోడల్స్‌తో సంబంధాల వల్ల ఆయన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. అంతేకాదు.. సెక్స్ వర్కర్‌తో ఒక రాత్రి గడపడానికి రూ. 50 కోట్లు చెల్లించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయనపై ఇలాంటి ఆరోపణలులెక్కలేనన్ని ఉన్నాయి. తన ట్రాక్ రికార్డును 85 ఏళ్ల వయసులోనూ కొనసాగిస్తున్నారు.