అమెరికా మహిళతో చైనా విదేశాంగ మంత్రి వివాహేతర సంబంధం, అందుకే సైడ్ చేశారా?
Qin Gang Missing: చైనా మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని విచారణలో తేలింది.
Qin Gang Missing:
వివాహేతర సంబంధం..
దాదాపు మూడు వారాలుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ని (Qin Gang) ప్రభుత్వమే పక్కన పెట్టినట్టు Wall Street Journal వెల్లడించింది. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతోనే పదవి నుంచి తప్పించారని వెల్లడించింది. ఇప్పటికే ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారన్న వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే వాల్ స్ట్రీట్ జనరల్ వెల్లడించిన వివరాలు షాకింగ్‌గా మారాయి. పైగా ఆయనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందనీ తెలిపింది. ఈ వివాహేతర సంబంధం కారణంగా చైనా భద్రతాపరమైన రహస్యాలు ఇంకెవరికైనా తెలియజేశాడా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అమెరికాకి చైనా అంబాసిడర్‌గా పని చేసినన్ని రోజులూ ఆయన వివాహేతర సంబంధం కొనసాగించారని కమ్యూనిస్ట్ పార్టీ అంతర్గత విచారణలో వెల్లడైనట్టు సమాచారం. అంతే కాదు. ఆ సంబంధం కారణంగా ఓ బిడ్డ కూడా పుట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భద్రతా రహస్యాలు ఏమైనా బయటపెట్టారా అనే కోణంలో చాలా గట్టిగానే విచారిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. ప్రెస్ బ్రీఫింగ్‌లో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ (Mao Ning)ని మీడియా ఇదే విషయాన్ని ప్రశ్నించింది. తనకు ఏమీ తెలియదని ఆయన సమాధానం చెప్పకుండా దాటేశారు. క్విన్ గాంగ్‌ని ఎందుకు నియమించారో..ఎందుకు తొలగించారో ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించిందని, వివాహేతర సంబంధం గురించి తనకు ఏమీ తెలియదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే కిన్ గాంగ్ కనిపించకుండా పోయారో అప్పుడే ఆయనను విదేశాంగ మంత్రి పదవి నుంచి తొలగించింది ప్రభుత్వం. ఆయన స్థానంలో వాంగ్ యీకి అవకాశమిచ్చింది.
వరిసారి జూన్ 25న కనిపించారు 57 ఏళ్ల క్విన్. అప్పటి నుంచి మళ్లీ జాడ లేదు. ఏషియన్ సమ్మిట్ హెడ్‌గా ముందుగా క్విన్‌ని నియమించినా ఆ తరవాత తొలగించారు. "అనారోగ్యం వల్లే ఆయన తప్పుకున్నారు" అని చైనా ప్రభుత్వం ప్రచారం చేసినా అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. యురోపియన్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరగాల్సి ఉన్నా...వాటినీ కారణం లేకుండానే పోస్ట్‌పోన్ చేసింది చైనా. ఇవన్నీ ఎన్నో అనుమానాలకు తెర తీశాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడితో సమావేశమైనప్పటి నుంచి క్విన్ గాంగ్ మిస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా..చైనా సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై చర్చించతుండా సెన్సార్ చేసింది ప్రభుత్వం. అక్కడ "where is Qin Gang" అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే...సింపుల్‌గా No Results అని చూపిస్తోంది. అంటే ఎంత సీక్రెసీ మెయింటేన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా...చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఏ లీడర్ అయినా వివాహేతర సంబంధం పెట్టుకుంటే అసలు సహించదు. వెంటనే ఆ పదవి నుంచి తప్పించేస్తుంది. బ్యాన్ విధిస్తుంది. క్విన్ గాంగ్ కూడా ఇలాంటి ఎక్స్‌ట్రా మారిటల్ ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ప్రభుత్వం దూరం పెట్టిందని తెలుస్తోంది. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధులను మీడియా ప్రశ్నించినా.."మాకు ఎలాంటి సమాచారం లేదు" అని సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారు.
Also Read: మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవడానికి రాష్ట్రాల మద్దతు అవసరం లేదట!