AI సెక్టార్‌కే షాకింగ్ న్యూస్, చాట్ జీపీటీ సీఈవో తొలగింపు - కొత్త CEO ఎవరంటే?
Sam Altman Fired: చాట్‌జీపీటీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ని ఆ పదవి నుంచి తొలగిస్తూ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.
Sam Altman Sacked:
ఓపెన్ ఏఐ సీఈవో తొలగింపు..
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI Technology) వెంట పరుగులు పెడుతోంది. ఆ తరవాత ChatGPT సంచలనం సృష్టించింది. Open AI కంపెనీ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇది చాలా సక్సెస్ అయింది. ఎంతో మంది ఈ టూల్‌ని వాడుతున్నారు. సింపుల్‌గా కంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ సక్సెస్ అయిన తరవాత Open AI సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman Sacked) పేరు మారు మోగింది. అయితే...ఇప్పుడు ఉన్నట్టుండి ఈ కంపెనీ బోర్డు ఆయనను సీఈవో పదవి నుంచి తొలగించడం ఒక్కసారిగా సంచలనమైంది. ఈ అనూహ్య నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీని కుదిపేసింది. AI సెక్టార్‌లోనే చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్న ఆల్ట్‌మన్‌ని తొలగించడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన స్థానంలో మీరా మూర్తిని (Mira Murati) CEOగా నియమించింది. ఇప్పటి వరకూ ఆమె Open AI కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేశారు. ఇప్పుడామెకే సీఈవో పదవి ఇచ్చారు. అయితే...ఎందుకీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కంపెనీ వివరించింది. ఆయనను తొలగిస్తున్నట్టు గూగుల్ మీట్‌లోనే వెల్లడించింది.
"బోర్డ్‌లో కంపెనీ గురించి రివ్యూ ప్రాసెస్ జరిగింది. బోర్డ్‌లోని సభ్యులతో ఆల్ట్‌మన్ సరైన విధంగా కమ్యూనికేట్ అవడం లేదన్న వాదన వినిపించింది. కొన్ని బాధ్యతల్నీ సరిగ్గా నిర్వర్తించడం లేదని కొందరు వాదించారు. ఆయన CEO పదవిలో ఉంటూ కంపెనీని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం పోయింది. అందుకే వెంటనే ఆ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం"
- Open AI బోర్డ్
కారణాలేంటి..?
ఐడియాలజీ విషయంలో బోర్డు సభ్యులకు సీఈవోకి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. అయితే...కచ్చితంగా ఇది కారణమని మాత్రం సరిగ్గా చెప్పడం లేదు కంపెనీ. సేఫ్టీ, ప్రాఫిట్ - ఈ రెండు విషయాల్లోనే ఏకాభిప్రాయం కుదరక తొలగించినట్టు ఓ వాదన వినిపిస్తోంది. నిజానికి Open AI అనేది స్థాపించిన మొదట్లో నాన్‌ప్రాఫిట్ కంపెనీగానే ఉంది. ఆ తరవాత క్రమంగా దాన్ని ప్రాఫిట్ కంపెనీగా మార్చేశారు. ఇదంతా ఆల్ట్‌మన్ చేసిన పనే అన్న వాదనలున్నాయి. పైగా ఇటీవల టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కూడా Open AI కంపెనీపై విమర్శలు గుప్పించారు. కంపెనీకి పెద్ద ఎత్తున లాభాలు తీసుకొచ్చి ఆ క్రెడిట్‌ని సంపాదించుకోవాలని ఆల్ట్‌మన్ భారీగానే ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అయితే...ఈ క్రమంలో సేఫ్‌టీ గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ మధ్యే Developers Day రోజున OpenAI కంపెనీ కొత్త ప్లగిన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లగిన్స్‌తో ఎవరైనా కస్టమైజ్డ్ AI సిస్టమ్‌ని తయారు చేసుకోవచ్చు. అయితే...ఈ ఫీచర్ సరిగ్గా పని చేయక కొన్ని గంటల పాటు ఛాట్‌జీపీటీ డౌన్ అయింది. సేఫ్‌టీ విషయంలోనూ విమర్శలు వచ్చాయి. దీని తరవాత కంపెనీ క్రెడిబిలిటీ కొంత తగ్గింది. ఆల్ట్‌మన్‌ని తొలగించడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. ఇప్పుడు సీఈవోగా అపాయింట్ అయిన మీరా తల్లిదండ్రులకు భారత్ మూలాలున్నాయి. మెకానికల్ ఇంజనీర్‌గా పని చేసిన మీరా...టెస్లా కార్‌ని డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Also Read: Priyanka Chopra: వరుస బెట్టి ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా, మరో రెండు ఫ్లాట్లకు బేరం