Viral Videos Indian: బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించిన కెనడియన్- కట్టుబట్టలతో నిల్చుండిపోయిన ఎన్‌ఆర్‌ఐ
Viral News : ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఓ వ్యక్తి ఎన్‌ఆర్‌ఐ ఇల్లు ఖాళీ చేయించే వీడియో వైరల్‌గా మారుతోంది. దీని నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Canadian landlord Throwing Out an Indian man belongings: యజమాని తన ఇంట్లో ఉంటున్న ఓ ఎన్‌ఆర్‌ఐను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించే విధానం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంటికి వచ్చిన యజమాని ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి ఇంట్లోని వస్తువులు బయట పడేసే దృష్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి.
15 సెకన్ల వీడియో క్లిప్
కేవలం పదిహేను సెకన్లు ఉన్న ఈ వీడియో నాలుగు మిలియన్ల మంది చూశారు. ఇంకా వేల మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెనడాలోని ఒంటారియోలోని బ్రాంప్టన్‌లో జరిగింది. ఈ ప్రాంతంలో ఓ ఇంట్లో ఓ ఎన్‌ఆర్‌ఐ అద్దెకు ఉంటున్నాడు. అతని ఇంటికి వచ్చి యజమానికి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడు. ఇప్పటికిప్పుడు ఎలా ఖాళీ చేస్తానంటూ ఆయనతో ఎన్‌ఆర్‌ఐ వాగ్వాదానికి దిగారు.
ఇంట్లో రెంట్‌కు ఉంటున్న వ్యక్తి మాట్లాడుతుండగానే యజమానికి తనపని కానిచ్చేశాడు. ఇంట్లో ఉన్న వస్తువులను బయట పెట్టడం మొదలు పెట్టాడు. ఏంటని అడిగితే తన ఇల్లు తన ఇష్టం అంటూ సమాధానం చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన వీడియోలో 15 సెకన్లు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టారు. తర్వాత ఏం జరిగిందని ఎవరి తెలియడం లేదు.
View this post on Instagram
కట్టుబట్టలతో అలా
ఇంటి యజమానికి ఇంటికి వచ్చి వస్తువులన్నీ బయట పడేస్తుంటే అద్దెకు ఉంటున్న వ్యక్తికి ఏం చేయాలో తెలియలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పటిక ఆయన ఒంటిపై బట్టలు లేవు కేవలం షార్ట్ మతాత్రమే వేసుకొని ఉన్నారు. ఇంట్లో వస్తువులు ఒక్కొక్కటిగా బయటకు యజమానికి తీసుకొస్తుంటే నిశ్చేష్టుడై చూస్తు ఉండిపోయాడు.
మండిపడుతున్న ఎన్‌ఆర్ఐలు, నెటిజన్లు
దీనిపై నెటిజన్లు, ఎన్‌ఆర్‌లు మండిపడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే ముందస్తుగానే చెప్పాల్సి ఉందన్నారు. అంతే కానీ సడెన్‌గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే అందులో ఉన్న ఫ్యామిలీ ఎటు పోతుందని.. ఎక్కడ తలదాచుకుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమస్య ఏదైనా కావచ్చు కానీ ఇలా వెళ్లిపోమనడం కరెక్ట్ కాదంటున్నారు. ఇలా ఖాళీ చేయించడం అంత సులభం కాని ఆ అద్దెదారులు కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందన్నారు మరికొందరు నెటిజన్లు. ఆ కేసు విచారణ తేలే వరకు అద్దె చెల్లించకుండానే అదే ఇంట్లో ఉండే అవకాశం కోర్టు కల్పిస్తుందంటున్నారు.
పూర్తి వీడియో ఉంటే మంచింది అంటున్న జనం
మరికొందరు అసలు ఆ వీడియో పూర్తిగా చూస్తే తప్ప ఓ నిర్ణయానికి రాలేమంటున్నారు. 15 సెకన్ల వీడియోతో అక్కడ జరిగిన విషయంపై నిర్దారణకు రాలేమంటున్నారు. మొత్తం వీడియో పెడితే తప్ప ఏం జరిగిందో తెలియదంటున్నారు.
Also Read:మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు?