India-Canada Relations: ఆధారాలతోనే మాట్లాడుతున్నామంటూ భారత్‌పై మరోసారి విషం చిమ్మిన కెనడా
India-Canada Relations: బారత్‌ను కెనడా ప్రభుత్వం మరింతగా రెచ్చగొడుతోంది. ప్రధాని నుంచి అంతా భారత్‌పై విషం చిమ్ముతున్నారు. భారత్‌ను దోషిగా నిలబెట్టే దుస్సాహసానికి ఒడిగట్టారు
India-Canada Relations: నిజ్జార్ హత్య కేసు విచారణ కారణంగా భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో భారత్ సైలెంట్‌గా ఉంటున్నా కెనడా పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది.
భారత్, కెనడా మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు మరో స్థాయికి చేరింది. ఇప్పటికే ఆరుగురు కెనడా డిప్లాట్స్‌ను బహిష్కరించింది. దీంతోపాటు ఆ దేశంలో ఉన్న హైకమిషనర్‌ని కూడా వెనక్కిపిలిపించుకుంది. కెనడా చేస్తున్న దుష్ప్రచారంపై చేతలతో భారత్ సమాధానం చెబుతుంటే...పదే పదే రెచ్చగొట్టేలా కెనడా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది.
భారత్ మౌనాన్ని అలుసుగా తీసుకున్న కెనడా ప్రధాని చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కెనడా విదేశాంగ మంత్రి కూడా ఆ లైన్‌లోనే మాట్లాడుతున్నారు. భారత్‌ను రెచ్చగొట్టే ధోరణితో కామెంట్స్ చేస్తున్నారు. కెనడా ఫారెన్ మినిస్టర్ మెలనియా జోలియా మాట్లాడుతూ... హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) ఇచ్చిన నివేదిక ఆధారంగానే భారత రాయబారులు బహిష్కరించామన్నారు. ఈ కేసులో భారత్ పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే ఆ దేశ ప్రధాని నిన్న మాట్లాడుతూ భారత్‌పై విషం కక్కారు. కెనడా రాయబారులను బహిష్కరించి భారత పెద్ద తప్పు చేసిందని ఆరోపించారు. అంతే కాకుండా ఇండియా చేసిన పొరపాట్ల వల్లే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు. దేశ భద్రత విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదన్నారు. దేశంలోనే ఉంటు కెనడా పౌరులను హతమారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితి కెనడాలో ఉన్న భారతీయులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని అయినా దేశం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నారు.