Britney Spears' wedding Crash : లోపల బ్రిట్నీ స్పియర్స్ పెళ్లి - బయట మొదట భర్త అలజడి ! చివరికేమయిందంటే ?
పాప్ స్టార్ బ్రిట్ని స్పియర్స్ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లిలో మాజీభర్త చేసిన హంగామా మాత్రం హైలెట్ అయింది.
Britney Spears' wedding Crash : లోపల పెళ్లి జరుగుతోంది. తాళి కట్టబోతున్న చివరి క్షణంలో ఓ వ్యక్తి వచ్చి ఆపండి అంటాడు. దీంతో పెళ్లి ఆగిపోతుంది. ఇది చాలా సినిమాల్లో రొటీన్ సీన్. అయినా ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే.. పెళ్లిలో ఇలాంటి సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరి. నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. అదే సెలబ్రిటీల పెళ్లిల్లో జరిగితే మాత్రం ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బ్రిట్ని స్పియర్స్ పెళ్లిలో ఇలాగే జరిగింది.
బ్రిట్ని స్పియర్స్ చాలా ఆటంకాల తర్వతా పెళ్లి చేసుకుంటోంది. బ్రిట్ని స్పియర్స్‌కు ఇప్పటి వరకూ ఎదురైన ఇబ్బందుల కారణంగా రహస్యంగా పెళ్లి చేసుకుంటోంది. లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న ఈ పెళ్లికీ ఇబ్బందులు తప్పలేదు. పెళ్లి జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి... హంగామా సృష్టించాడు. బ్రిట్ని స్పియర్స్ తన భార్య అని.. తనకు ఉన్న ఒకే ఒక్కభార్య అని.. వేడుకున్నాడు. పెళ్లిని ఆపాలని కోరారు. అయితే ఇలాంటిదేదో జరుగుతుందన్న కారణంగానే ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఆ యువకుడ్ని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్లిపోయారు.
Britney Spears' wedding was just dramatically interrupted, as her first husband, Jason Alexander, showed up trying to crash the event ... resulting in a police response. https://t.co/twc25BOhKB
— TMZ (@TMZ) June 9, 2022
బ్రిట్ని స్పియర్స్ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి పేరు జేసన్ అలెగ్జాండర్. నిజంగానే బ్రిట్ని స్పియర్స్‌ను పెళ్లాడింది. 2004లో జేసన్ అలెగ్జాండర్‌ను బ్రిట్నీ పెళ్లాడింది. కానీ ఆ జంట కేవలం 55 గంటలు మాత్రమే కలిసి ఉన్నారు. తరవాత విడిపోయారు. అయితే ఇన్నాళ్ల తర్వాత కూడా పెళ్లి వేదిక వద్దకు తోసుకువెళ్లేందుకు అలెగ్జాండర్ ప్రయత్నించాడు.
40 ఏళ్ల పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవలే సంరక్షణ కేసు నుంచి బయటపడింది. 13 ఏళ్ల పాటు ఆమె తండ్రి సంరక్షణలోనే ఉన్నారు. సంరక్షణలో ఉండడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నానని, పిల్లల్ని కనలేకపోతున్నట్లు బ్రిట్నీ ఓ సందర్భంలో తెలిపింది. పర్సనల్ ట్రైనర్ అస్ఘరితో 2016లో స్పియర్స్‌కు పరిచయం ఏర్పడింది. స్లంబర్ పార్టీ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒకింటిదయింది బ్రిట్ని స్పియర్స్.