Britain New PM: బ్రిటన్ కొత్త ప్రధానిగా అక్టోబర్ 28న ప్రమాణం చేయనున్న రిషి సునక్
Britain New PM: రిషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్ తొలి హిందూ, నల్లజాతి ప్రధానిగా చరిత్ర సృష్టించనున్నారు.
Rishi Sunak New Britain PM: బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ నియమితులయ్యారు. అంతకుముందు, పెన్నీ మోర్డాంట్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రేసు నుంచి వైదొలిగారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 357 మంది ఎంపీల్లో సగానికిపైగా ఆయనకు మద్దతు తెలపడంతో మాజీ ఆర్థిక మంత్రి సునక్ (42) సునాయాసంగా విజయం సాధించారు.
రిషి సునక్ అక్టోబర్ 28 న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్టోబర్ 29న మంత్రివర్గం కొలువుదీరనుంది.
బ్రిటన్ తొలి హిందూ ప్రధాని
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్‌కు తొలి హిందూ, నల్లజాతి ప్రధాని కానున్నారు. బ్రిటిష్ ప్రధాని పదవి రేసులో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వైదొలిగిన తరువాత రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టే అవకాశాలు బలంగా మారాయి. యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత సునక్ కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఇతర సభ్యులు సాదర స్వాగతం పలికారు.
లిజ్ ట్రస్ అభినందనలు
కన్జర్వేటివ్ పార్టీ నేతగా, యూకే ప్రధానిగా రిషి సునక్ ను నియమించినందుకు మాజీ ప్రధాని లిజ్ ట్రస్ అభినందించారు. 'కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, మా తదుపరి ప్రధానిగా నియమితులైన రిషి సునక్‌కు అభినందనలు. మీకు నా పూర్తి మద్దతు ఉంది."
పలువురు మాజీ మంత్రులు చేరారు
Congratulations @RishiSunak on being appointed as Leader of the Conservative Party and our next Prime Minister.
— Liz Truss (@trussliz) October 24, 2022
You have my full support.
తన మద్దతను ప్రకటిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని, తన పార్టీని ఏకం చేయాలని, దేశం కోసం పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారామె. అంతకుముందు, మాజీ హోం కార్యదర్శి ప్రీతి పటేల్, కేబినెట్ మంత్రులు జేమ్స్ క్లేవర్లీ, నదీమ్ జహావితో సహా పలువురు ప్రముఖ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు సోమవారం జాన్సన్ శిబిరాన్ని విడిచిపెట్టి సునక్‌కు మద్దతు తెలిపారు.
లిజ్ ట్రస్ రాజీనామా
భారత సంతతికి చెందిన మాజీ బ్రిటిష్ మంత్రి అయిన పటేల్ గత నెలలో లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తన పదవికి రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ సునక్‌కు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలని అన్నారు. లిజ్ ట్రస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన 45 రోజుల తరువాత గురువారం (అక్టోబర్ 20) ప్రధానమంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు.