Earthquake: పొరుగు దేశాల్లో మళ్లీ భూకంపం-పాకిస్తాన్‌తోపాటు మూడు దేశాల్లో భూప్రకంపనలు
భూకంపాలు భయపెడుతున్నాయి. భారత్ పొరుగు దేశాల్లో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఈసారి పాకిస్తాన్‌తోపాటు మూడు దేశాల్లో భూమి కంపించింది.
Earthquake News: భారత పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. తరచూ భూప్రకంపనతు రావడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు.. ఎక్కడ భూమి కంపిస్తుందో తెలియక భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఇవాళ కూడా భారత దేశానికి పొరుగున ఉన్న మూడు దేశాల్లో మరోసారి భూకంపం వచ్చింది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున పాకిస్తాన్ (Pakistan), చైనా (China), పాపువా న్యూగినియా ((Papua New Guinea) దేశాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
పసిఫిక్ మహా సముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియా (Papua New Guinea) లో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున 3గంటల 16నిమిషాలకు భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సముద్రతీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ (Wekak) సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కూల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. వెకెక్ (Wekak)కు 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జీయోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
పపువా న్యూగినియాతో పాకిస్థాన్, చైనా, పపువా న్యూగినియా భూకంపంతో వణికిపోయాయి. పాకిస్థాన్, చైనాలో కూడా తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం చైనాలోని జిజాంగ్‌లో తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ఇక... పాకిస్థాన్‌లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదుగా నమోదైంది. పాకిస్తాన్‌లో తెల్లవారుజామున 3గంటల 38నిమిషాలకు భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల మూడు దేశాల్లోనూ ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం రాలేదు.
భూకంపాలు ఎందుకు వస్తాయి?
భూమి లోపల ఏడు ప్లేట్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్ జోన్స్ అంటారు. పదేపదే ఢీకొనడం వల్ల ప్లేట్ల మూలలు వంగి ఉంటాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా.. లోపల ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల భూకంపం సంభవిస్తుంది.
భూకంపం తీవ్రతను ఎలా కొలుస్తారు?
భూకంపాలను రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు. రిక్టర్ స్కేల్‌పై.. భూకంపాలను దాని కేంద్రం నుంచి ఒకటి నుంచి 9 వరకు కొలుస్తారు. భూకంపం సమయంలో భూమి లోపల నుండి విడుదలయ్యే శక్తి ఆధారంగా తీవ్రతను కొలుస్తుంది. రిక్టర్ స్కేలుపై 0 నుండి 1.9 వరకు భూకంపాన్ని సీస్మోగ్రాఫ్ ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. రిక్టర్ స్కేల్ 2 నుంచి 2.9 అంటే... భూకంపం సంభవించినప్పుడు తేలికపాటి ప్రకంపనలు సంభవిస్తాయి. 3 నుంచి 3.9 వరకు అంటే... వస్తువులు కంపిచేస్థాయిలో ప్రకంపనలు ఉంటాయి. రిక్టర్ స్కేలుపై 4 నుంచి 4.9 వరకు అంటే... గోడలపై వేలాడుతున్న ఫ్రేమ్‌లు పడిపోయే స్థాయిలో ప్రకంపనలు ఉంటాయి. 5 నుంచి 5.9 వరకు అంటే... ఫర్నిచర్ వణుకుతుంది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6 నుంచి 6.9 ఉంటే.. భవనాల పునాదులకు పగుళ్లు వస్తాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply