By: ABP Desam | Updated at : 11 Dec 2022 11:59 PM (IST)
న్యూ ఇయర్ వేడుకలు ఈ ప్రదేశాలకు వెళితే ఆ కిక్కే వేరు
న్యూ ఇయర్ వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో సెలబ్రెషన్స్‌ను ఓ రేంజ్‌లో ప్లాన్ చేసేందుకు ఇప్పటి నుంచి రెడీ అవుతుంది యువత. లాస్ట్ ఇయర్ ఓ లెక్క.. ఈ ఇయర్ ఇంకో లెక్క అంటూ ఏర్పాట్లు చేసుకుంటారు. మిరిమిట్లు గొలిపే కాంతులు, అబ్బుపరిచే స్కై టవర్స్.. టపాకుల మోతతో దద్దరిల్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. డ్యాన్స్‌లు.. కేక్ కటింగ్స్, పార్టీలతో చిల్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకలకు రెడీ అవుతున్నారు. అమెరికా టు అమలాపురం వరకు న్యూ ఇయర్ సంబరాలు తమకు తోచినట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. 2022కి గుడ్‌బై చెప్పి కోటి ఆశలతో 2023లోకి స్వాగతం చెప్పెందుకు యువతతో పాటు పెద్దవారు కూడా రెడీ అవుతున్నారు. అయితే గతంలోలాగ కాకుండా కాస్త వెరైటీ సుదూర ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రెట్ చేసుకోవాలనుకునే వారికి అదిరిపోయే ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ అందుబాటులోకి ఉంది.
న్యూ ఇయర్ వేడుకలు విదేశాల్లో చేసుకోవాలనుకునే వారికి ఇండోనేషియా దేశం కరెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశానికి వీసా లేకుండా అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా వెళ్లి రావొచ్చు. అంతేకాదు ఇందుకోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం కూడా లేదు. ముఖ్యంగా నూతన సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రదేశం సందర్శించదగినది. కోల్‌కతా నుంచి ఇండోనేషియాకుక డైరెక్ట్ విమానాలు ఉన్నాయి. ఇందుకు ఒక్కోక్కరికి సుమారు 20 నుండి 25 వేల వరకు టిక్కెట్లు ధరలు ఉంటాయి. ఒక నెల పాటు ఇక్కడ ఎలాంటి వీసా లేకుండానే సందర్శించవచ్చు.
ఇక ఇండోనేషియాలో చాలా వరకు భారతీయులు ఉంటారు కాబట్టి.. ఇక్కడ కూడా న్యూఇయర్ వేడుకలు గ్రాండ్‌ను జరుగుతాయి.
ఇక ఆ తర్వాత స్థానంలో మకావు దేశమనే చెప్పాలి. ట్రావెలింగ్‌ను ఇష్టపడే వారు ఒక్కసారైనా మకావును సందర్శించవచ్చు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసే మ్యూజిక్ ఈవెంట్స్ చాలా బాగా జరుపుతారు. కోల్‌కతా నుండి ఇక్కడికి దాదాపు 40 వేలకు విమాన టిక్కెట్‌లను పొందవచ్చు. ఇక ఈ దేశంలో కూడా వీసా అవసరం లేదు.
మూడో దేశం థాయ్‌లాండ్. ఈ దేశంలో కూడా కొత్త ఏడాది వేడుకలు గ్రాండ్‌గానే జరుగుతాయి. ఇక ప్రతి భారతీయుడు సందర్శించడానికి ఇష్టపడే ప్రదేశం థాయ్‌లాండ్ అనే చెప్పాలి. మీరు శీతాకాలపు సెలవుల్లో థాయ్‌లాండ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఇక్కడ వీసా తీసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు వీసా ఆన్ అరైవల్ లభిస్తుంది.
ఇక మరో న్యూ ఇయర్ టూరిజం ప్లేస్‌లో మాల్దీవులు. ఇక్కడ సెలబ్రిటీ నుండి సామాన్యల వరకు ఇష్టంగా వెళ్లే దేశం ఇదే అని చెప్పాలి. నూతన సంవత్సరానికి మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఇక్కడ కూడా మీరు వీసా తీసుకోవలసిన అవసరం లేదు. ఇక పైన తెలిపిన దేశాలతో పోలిస్తే.. మాల్దీవులకు కాస్త తక్కువ బడ్జెట్‌లోనే అయిపోతుందని చెప్పాలి. ఒక వేళ హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో మాత్రమే సెలబ్రెట్ చేసుకోవాలనుకునే వారి కోసం చాలా ప్రైవేట్ ఈవెంట్ కంపెనీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాయి.
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !
Pakistan Crisis: IMF పెట్టిన కండీషన్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మాకు వేరే ఆప్షన్ కూడా లేదు - పాక్ ప్రధాని
PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
US - China: అమెరికా ఎయిర్ బేస్‌లో చైనా స్పై బెలూన్, అలెర్ట్ అయిన అగ్రరాజ్యం
Elon Musk Twitter: ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్న ఎలన్ మస్క్, కారణమిదేనట!
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్