Students Sentenced To Death: కోర్టు సంచలన తీర్పు.. విద్యార్థి దారుణహత్య కేసులో 20 మందికి మరణశిక్ష..!
తోటి విద్యార్థిని హత్య చేసిన కేసులో 20 మంది యూనివర్సిటీ విద్యార్థులకు కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మరో ఐదుగురు విద్యార్థులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు.
సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించిన యువకుడిని 2019లో దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం 20 మంది యూనివర్సిటీ విద్యార్థులకు ఢాకా కోర్టు మరణశిక్ష విధించింది. గతంలో నీటి భాగస్వామ్యం విషయంలో భారత్‌తో ఒప్పందాలు చేసుకున్నందుకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా తీరును వ్యవహరిస్తూ ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కానీ కొన్ని గంటలకే ఊహించని దారుణం జరిగింది. అబ్రార్ ఫహాద్ (21) అనే యువకుడు యూనివర్సిటీ వసతి గృహంలో శవమై కనిపించాడు.
అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం అవామీ లీగ్, బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (బీసీఎల్) సభ్యులైన 25 మంది తోటి విద్యార్థులు అబ్రార్ ఫహద్‌ను క్రికెట్ బ్యాట్, ఇతర వస్తువులతో దాదాపు 6 గంటలపాటు దాడి చేశారు. ఫహద్ హత్యపై కీలక తీర్పు నేడు వెలువడింది. సహ విద్యార్థిని హత్య చేసిన రెండేళ్ల కిందటి ఘటనలో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించారు.
బంగ్లా కోర్టు తీర్పుపై మృతుడు అబ్రార్ ఫహద్ తండ్రి బర్కత్ ఉల్లా కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడారు. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ శిక్షను త్వరలోనే అమలు చేస్తారంటూ ఆశాభావంతో ఉన్నారు. తన కుమారుడ్ని దాడి చేసి హత్య చేసిన ఘటనలో మిగతా ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు ప్రాసిక్యూటర్ అబ్దుల్లా అబు ఏఎఫ్‌పీ మీడియాకు తెలిపారు.
Also Read: Chopper Crash Coonoor: ఊటీలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. నలుగురు మృతి.. చాపర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్!
ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉరిశిక్ష ఖరారు..
భారత్, బంగ్లాదేశ్ నీటి పంపిణీ విషయంపై ఒప్పందం చేసుకున్నాయి. ఈ విషయపై అబ్రార్ ఫహద్ అనే విద్యార్ధి ప్రధాని షేక్ హసీనాను తీవ్రంగా విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది జరిగిన కొన్ని గంటలకు తోటి విద్యార్థులు ఫహద్‌పై దాడి చేయగా చనిపోయాడు. భారత్‌కు నీటి పంపిణీకి ఎందుకు అనుమతి ఇచ్చారని ఆ విద్యార్థి తన పోస్టులో ప్రశ్నించాడు. కొన్ని గంటల్లో బీసీఎల్ కార్యకర్తలు, మరికొందరు విద్యార్థులు హాస్టల్‌లోని ఫహద్ గదిలోకి వెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. కొన్ని గంటల తరువాత ఫహద్ డెడ్ బాడీని అక్కడే పడేసి వెళ్లిపోయారు. అంతకుముందు 2018లో సైతం ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థి సంఘాలు హింసకు పాల్పడ్డాయి.
విద్యార్థి దారుణహత్యపై ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పదించారు. దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. హత్య చేసే వారికి కఠిన శిక్ష తప్పకుండా పడుతుందని చెప్పారు. కేసును బట్టి భారీ సంఖ్యలో ఉరిశిక్షలు ఖరారు చేయడం బంగ్లాదేశ్‌లో బ్రిటీషు కాలం నుంచే ఉంది. ఈ ఆగస్టులో, ఇద్దరు స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలను హత్య చేసిన కేసులో ఆరుగురు ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు మరణశిక్ష విధించారు.
Also Read: Ram Nagar Dead Body: ట్యాంకులో కుళ్లిన శవం ఇతనిదే.. ముట్టుకుంటే ఊడిపోయేలా డెడ్‌బాడీ, హత్యా.. ఆత్మహత్యా?