Oil Tanker Capsizes Off: ఒమన్ తీర ప్రాంతంలో మునిగిన ఆయిల్ నౌక- 13 మంది భారతీయుల సహా 16 మంది గల్లంతు
Oman coast : ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం కొమొరోస్ జెండాలో ఉన్న ఆయిల్ ట్యాంకర్‌తో ఉన్న ఓడ తమ తీర ప్రాంతానికి సమీపంలో ముగింది.
Oman Maritime Security Center: సోమవారం ఒమన్ తీర ప్రాంతంలో ఆయిల్‌తో వెళ్తున్న ఓడ నీట మునిగింది. ఈ ప్రమాదంలో 13 మంది భారతీయులు సహా 16 మంది సిబ్బంది గల్లంతైనట్టు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద వివరాలు సోషల్ మీడియాలో వెల్లడించిన ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ విభాగం... దుకమ్‌కు రాస్ మద్రకాకు ఆగ్నేయంలో 25 నాటికల్ మైలు దూరంలో ప్రమాదం జరిగింది. కొమొరోస్ జెండాతో వెళ్తున్న ఓడ నీట ముగిసింది.
ఓడలో వెళ్తూ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు మారిటైం సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే తమ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని పేర్కొంది.
మునిగిపోయిన నౌక Prestige Falconగా గుర్తించారు. ఇది ఆయిల్‌ను తీసుకెళ్తున్న టైంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో 13 మంది భారతీయులు, మరో ముగ్గురు శ్రీలక వాసులు ఉన్నట్టు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే నౌక తలకిందులుగా పడిపోయిందని ఆయిల్ లీక్ అయిందా లేదా అనేది ఇంకా తేలలేదని రాయిటర్స్‌కు మారిటైం సెక్యూరిటీ సంస్థ చెప్పింది.
ఎల్‌ఎస్‌ఈజీ షిప్పింగ్ డేటా ప్రకారం... చమురు ట్యాంకర్ నౌక యెమెన్ పోర్ట్ ఆఫ్ అడెన్ వైపు వెళుతోంది తెలుస్తోంది. ఈ నౌక 2007లో తయారు చేశారు. దీని పొడవు 117 మీటర్లుగా చెబుతున్నారు.