World War II Ship: రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిన ఓడ, ఇన్నాళ్లకు దొరికింది - వైరల్ న్యూస్
World War II Ship: రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన ఓడ 84 ఏళ్ల తరవాత వెలుగులోకి వచ్చింది.
World War II Ship:
84 ఏళ్ల తరవాత ఆచూకీ..
మానవ చరిత్రలో రెండు ప్రపంచ యుద్ధాలు ఎంత నష్టాన్ని మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఇంకొందరు సైనికులు కంటికి కనిపించకుండా పోయారు. మరి కొందరు గల్లంతయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ యుద్ధాలు మిగిల్చిన విషాదం పెద్దదే. కొన్ని వార్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్‌ల ఆచూకీ లేకుండా పోయాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇదే జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న జపనీస్ షిప్ సౌత్ చైనా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ షిప్‌లో 864 మంది ఆస్ట్రేలియా సైనికులున్నారు. అలా గల్లంతైన ఓడ జాడలేకుండా పోయింది. చాలా రోజుల పాటు శ్రమించి వెతికినా దొరకలేదు. ఇక లాభం లేదనకుని అప్పుడు అలాగే వదిలేశాయి ప్రభుత్వాలు. 1942 జులైలో ఈ ప్రమాదం జరిగితే..ఇప్పుడు ఆ ఓడ కనిపించింది. 84 ఏళ్ల తరవాత అది వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్ రిచర్డ్ మార్ల్స్ ఈ విషయం వెల్లడించారు. ఫిలిప్పైన్స్ తీరంలో 1942 జులైలో మునిగిపోయిన వార్ ట్రాన్స్‌పోర్ట్ షిప్ ఇప్పుడు కనిపించిందని చెప్పారు. లుజాన్ ఐల్యాండ్ సమీపంలో దీని ఆచూకీ కనుగొన్నట్టు వివరించారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుకెక్కింది. సముద్రం మధ్యలో ఉండగా ఈ షిప్‌పై దాడి జరిగిందని, వెంటనే అది మునిగిపోయిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. అయితే...ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఖైదీలు ఉన్నారా లేదా అన్నది క్లారిటీ లేదు.
వెయ్యి మంది మృతి..?
ఆస్ట్రేలియా రక్షణ శాఖతో పాటు మెరైన్ ఆర్కియాలజీ విభాగానికి చెందిన స్పెషలిస్ట్‌లు ఈ జాడను కనుగొన్నారు. సుదీర్ఘ సర్వే తరవాత 13,123 అడుగుల లోతులో అది కనిపించింది. ఈ ప్రమాదంలో కనీసం 1000 మంది చనిపోయి ఉంటారని అంచనా. వీళ్లలో ఖైదీలతో పాటు సాధారణ పౌరులూ ఉన్నట్టు సమాచారం.
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ వైరల్..
టైటానిక్ షిప్ మునిగిపోయి ఈ ఏడాదితో 111 సంవత్సరాలు గడిచిపోయాయి. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా రికార్డుకెక్కిందీ ఘటన. మర్చిపోదామనుకున్నా...మరిపోలేనిది ఈ విషాదం. టైటానిక్ సినిమాలో ఈ ప్రమాదం జరిగిన తీరుని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో టైటానిక్ గురించి చర్చ జరుగుతోంది. చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన ఈ షిప్‌లో ప్రతిదీ స్పెషలే. ఇప్పుడు ఎన్ని క్రూజ్‌లు వచ్చినా టైటానిక్ ముందు దిగదుడుపే. ఆ షిప్‌లోని ఫెసిలిటీస్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. అందులో అన్నింటి కన్నా హైలైట్...ఫుడ్ మెను(Tatanic Food Menu). ఎన్నో నోరూరించే వంటకాలను ప్రయాణికులకు అందించింది టైటానిక్ సిబ్బంది. ప్రస్తుతం ఈ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్ వెజ్ ప్రియులను ఉవ్విళ్లూరిస్తోంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ Taste Atlas ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ మెనూని పోస్ట్ చేసింది. మొత్తం మూడు క్లాస్‌లకు సంబంధించిన ఫుడ్ మెనూలనూ పోస్ట్ చేసింది.
Also Read: Amarjeet Sada: వయసు 8 ఏళ్లు, చేసింది మూడు హత్యలు - వెన్నులో వణుకు పుట్టించే క్రిమినల్ కథ