By: ABP Desam | Updated at : 18 Mar 2022 08:10 PM (IST)
Edited By: Murali Krishna
భారత్‌లో ఎవరూ హ్యాపీగా లేరా? ఆ జాబితాలో మనకంటే ముందే పాక్!
World Happiness Report: ప్రపంచ అత్యంత సంతోషకర దేశాల జాబితా ( World Happiness Report) తాజాగా విడుదలైంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఫిన్లాండ్ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఐదోసారి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 146 దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను బయటపెట్టారు.
టాప్ 20
ఈ రిపోర్ట్ ప్రకారం అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, అఫ్గానిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. టాప్ 20 దేశాల జాబితా, మునుపటి ఏడాదికి ఇప్పటికీ స్థానంలో తేడా చూద్దాం.
భారత్ ఎక్కడ?
మరోవైపు ఈ జాబితాలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 139వ స్థానంలో ఉంది. అంటే మూడు స్థానాలు మెరుగైంది. అయితే పాకిస్థాన్ (121), నేపాల్ (84), బంగ్లాదేశ్ (94), శ్రీలంక (127) మనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
ఆ రెండు
ఈ నివేదిక ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందే రూపొందింది. దీంతో రష్యా 80వ స్థానంలో, ఉక్రెయిన్ 98వ స్థానంలో నిలిచాయి.
ఎలా లెక్కిస్తారు?
పౌరుల సంతోషం, ఆదాయం, ఆరోగ్యం, సామాజిక అంశాలు వంటి వాటిని పరిశీలించి, 0-10 పాయింట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తారు. అఫ్గానిస్థాన్ చివరి (146) స్థానంలో నిలవగా, లెబనాన్ (145), జింబాబ్వే (144), రువాండా (143) ర్యాంకులు సాధించాయి.
ఆకలి కేకలు
ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు దాదాపు పది లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని తెలిసింది. చిన్నారులకు సాయం అందకుంటే వాళ్లంతా మరణించే అవకాశం ఉందని వెల్లడైంది.
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?